రెచ్చిపోయిన ఆకతాయిలు  | Youth Has Been Harassing Girls In Junior College In Mulakalacheruvu | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఆకతాయిలు 

Published Tue, Jul 19 2022 10:47 PM | Last Updated on Tue, Jul 19 2022 10:47 PM

Youth Has Been Harassing Girls In Junior College In Mulakalacheruvu - Sakshi

ములకలచెరువు: స్థానిక కదిరి రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మోడల్‌ స్కూల్‌ వద్ద ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కళాశాల, పాఠశాలకు వచ్చి వెళ్లే బాలికలను వారు వేధింపులకు గురి చేస్తున్నారు. విసిగి వేసారిన బాలికలు కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం బాలికలు ఇంటికి వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు కళాశాల వద్దకు వెళ్లారు.

వారి ఎదుటే బాలికలను వేధిస్తుండటంతో.. ఆకతాయిలకు వార్నింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించారు. రెచ్చిపోయిన వారు బాలికల కుటుంబ సభ్యుల మీద ఎదురు తిరిగారు. చుట్టు పక్కల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. దీంతో అక్కడే ద్విచక్రవాహనాలు వదిలేసి వారు పారిపోయారు. పోలీసులు చొరవ తీసుకొని ఆకతాయిల ఆటకట్టించాలని బాలికల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement