govt junior college
-
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ శిక్షణను ఆదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది.తొలుత కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు లేదా పది కి.మీ. పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు అంతర్భాగంగా ఐఐటీ, నీట్ శిక్షణను కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందే ఇవ్వనున్నారు.విద్యార్థుల కాలేజీలు వేరైనప్పటికీ ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో వారి హాజరు ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల వారి అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా శిక్షణను ఇంటర్ బోర్డు చేపట్టింది. ఈ ప్రత్యేక శిక్షణపై ఆసక్తి గల ప్రభుత్వ లెక్చరర్లతో వారు పనిచేస్తున్న కాలేజీల్లోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే, అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఐఐటీ, నీట్ నమూనా పరీక్షల నిర్వహణ వంటి అన్ని అంశాలను నారాయణ విద్యాసంస్థలే చూసుకోనున్నాయి. -
సీటివ్వండి..లేకపోతే చచ్చిపోతా!
పెందుర్తి: గంజాయి మత్తులో ఓ టీనేజర్ పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద సోమవారం వీరంగం సృష్టించాడు. గతేడాది ఇదే కళాశాలలో చదువుకున్నానని..కానీ బహిష్కరించారని..ఇప్పుడు తనకు సీటివ్వకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. కర్రతో రోడ్డుపై వచ్చేపోయే వాహనాలకు ఇబ్బంది కలిగించాడు. రోడ్డుపై పడుకొని తీవ్రస్థాయిలో అలజడి రేపాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడ్ని రిహబిలిటేషన్ కేంద్రానికి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాలివి..పెందుర్తి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి (17) గతేడాది పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాడు. అయితే అతడి అలవాట్లు, క్రమశిక్షణారాహిత్యం కారణంగా అప్పట్లో కళాశాల నుంచి టీసీ ఇచ్చి పంపేశారు. అయితే సదరు విద్యార్థి గంజాయి మత్తులో సోమవారం కళాశాల ప్రాంగణానికి వచ్చి కర్రలతో విద్యార్థులను హడలగొట్టాడు. తనకు మళ్లీ సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాహనాల మధ్యకు వెళ్లి అలజడి రేపాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఐ అసిరితాత వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సదరు టీనేజర్‌ను అదుపులోని తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం ప్రభుత్వ రిహబిలిటేషన్ కేంద్రానికి తరించారు. -
ఇంటర్ ప్రత్యేక తరగతులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతూ ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారికోసం ప్రత్యేక శిక్షణ తరగతులు (రెమిడియల్ శిక్షణ)కు శ్రీకారం చుట్టింది. వీరందరికీ ఈ నెల 21 వరకు (21 రోజులపాటు) తరగతులు నిర్వహించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన శిక్షణకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు సబ్జెక్టుల లోపు ఫెయిలైన వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు పోయినవారికి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. రెండు షిఫ్టుల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. తరగతుల నిర్వహణ, కాలేజీలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెసిడెన్షియల్ తరహా శిక్షణపై కూడా అధికారులు దృష్టి సారించారు. విద్యార్థుల ఆసక్తి మేరకు డివిజనల్ కేంద్రాల్లో హాస్టల్ వసతి కల్పించి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఫెయిలైన బాలికలకు ప్రత్యేక ఏర్పాట్లు ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన బాలికలకు కూడా రెసిడెన్షియల్ శిక్షణ అందించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి పూర్తి రక్షణ వాతావరణం ఉండే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో వసతి, శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన విధానం ఎంచుకుని తరగతులకు హాజరు కావచ్చు. బీసీ గురుకులాల్లో ఫెయిలైన విద్యార్థులు 195 మంది ఉండగా.. వారికి ఆన్లైన్, రెసిడెన్షియల్ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. 10 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వారికి ఆన్‌లైన్‌లోనూ, అంతకు మించి విద్యార్థులు ఉన్నచోట 14 సెంటర్లలో రెసిడెన్షియల్ తరగతులకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ పాసైనా మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు కూడా రెమిడియల్ శిక్షణ తరగతులకు హాజరు కావచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఫీజు చెల్లించడానికి మే 3 చివరి తేదీ అని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం సాయంత్రంలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. -
700 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్
-
రెచ్చిపోయిన ఆకతాయిలు
ములకలచెరువు: స్థానిక కదిరి రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ వద్ద ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కళాశాల, పాఠశాలకు వచ్చి వెళ్లే బాలికలను వారు వేధింపులకు గురి చేస్తున్నారు. విసిగి వేసారిన బాలికలు కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం బాలికలు ఇంటికి వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు కళాశాల వద్దకు వెళ్లారు. వారి ఎదుటే బాలికలను వేధిస్తుండటంతో.. ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. రెచ్చిపోయిన వారు బాలికల కుటుంబ సభ్యుల మీద ఎదురు తిరిగారు. చుట్టు పక్కల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. దీంతో అక్కడే ద్విచక్రవాహనాలు వదిలేసి వారు పారిపోయారు. పోలీసులు చొరవ తీసుకొని ఆకతాయిల ఆటకట్టించాలని బాలికల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు. -
‘భోజనం’ అమలయ్యేనా?
మహబూబ్‌నగర్ మండలంలోని మాసన్‌పల్లికి చెందిన విమల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. నిత్యం 15కిలోమీటర్లు ప్రయాణించి కాలేజీకి వెళ్తుంది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఉదయం ఇంటిపని పూర్తి చేసుకుని బస్సు వచ్చే సమయానికి రెడీగా ఉండాలి. ఆమె బయలుదేరే సమయానికి ఇంట్లో వంట పూర్తవదు. దీంతో టిఫిన్ బాక్స్ లేకుండానే వచ్చేస్తుంది. మధ్యాహ్నం వరకు ఎలాగోలా ఉంటున్నా, ఆ తర్వాత పాఠాలు వినలేకపోతోంది. వారంలో నాలుగు రోజులు ఇదే వరుస. ఈ పరి స్థితి ఒక్క విమలదే కాదు.. గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం కళాశాలలకు వస్తున్న చాలామంది విద్యార్థులది. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదన కొంతకాలంగా ఉన్నప్పటికీ జూలైలో హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు సంబం దించి పలుఅంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే భోజనం అందుతుందని విద్యార్థులు ఆనందించారు. కానీ నిర్ణయం వెలువడి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు అమలుకు నోచుకోకపోవడంతో నిరాశ అలుముకుంది. ఎప్పటి నుంచి అమలుచేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం.. గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే చాలామంది విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఇంటినుంచి మధ్యాహ్నం భోజనం తీసుకురాలేకపోతున్నారు. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల చాలారకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం తగ్గుతున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పౌష్టికాహారం అందుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయని గుర్తించారు. అమలు ఎంతో అవసరం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలు, వృత్తి విద్యా కళాశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలుచేయడం ఎంతో అవసరమని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా అన్ని కళాశాలల్లో కలిపి 20,016 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఎదిగే క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తే రక్తహీనత, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశమే లేదని పేర్కొంటున్నారు. ఇబ్బందులు తప్పేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు చాలా వరకు జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రంలో ఉన్నాయి. వీటిలో చదివే చాలా మంది విద్యార్థులకు జిల్లాలోని గ్రామాల నుంచి బస్సుతో పాటు పలువాహనాలలో వస్తుంటారు. చాలా గ్రామాలకు సకాలంలో బస్సు సదుపాయం లేక విద్యార్థులు కాలినడకన వస్తున్నారు. ఈ క్రమంలో వారు బయలుదేరే సమయానికి భోజనం ఉండటం లేదు. కాలికడుపుతోనే వచ్చి, చిరుతిళ్లతో సరిపెట్టుకుంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోక ఆకలితో నకనకలాడుతున్నారు. శారీర, మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రయాణానికే సరిపోతుంది చాలాకాలంగా కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతారని అందరూ అంటున్నారు. కానీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఇంటి వద్ద అన్ని పనులు పూర్తి చేసుకుని రావాలంటే చదువుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఉదయం, సాయంత్రం ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక భోజనం మీద ప్రత్యేక దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కళాశాలలో విద్యార్థులకు భోజనం పెడితే పెద్ద సమస్య తీరుతుంది. – సరోజ, కోయిల్‌కొండ, బాలికల జూనియర్ కళాశాల వెంటనే అమలు చేయాలి ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలుచేయాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. దీనిద్వారా ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. – అనూష, మానన్పల్లి, బాలికల జూనియర్ కళాశాల ఇబ్బందులు తీర్చాలి నేను నిత్యం మా ఊరు పిల్లగుండుతండా నుంచి కళాశాలకు బస్సులో వస్తున్నాను. ఉదయం బస్సు వచ్చే సమయానికి పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. లేదంటే బస్సు పోతుంది. నేను వచ్చే సమయానికి ఇంట్లో వంట కాదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నాలాగే చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. – సురేఖ, పిల్లగుండతండా, బాలికల జూనియర్ కళాశాల -
ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికగా రాజంపేట
కడప స్పోర్ట్స్ : ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీల్లో గ్రూప్1 విభాగంలోని క్రీడా పోటీలను జిల్లాలోని రాజంపేట పట్టణంలో నిర్వహించేందుకు శాప్ అధికారులు నిర్ణయించినట్లు డీఎస్డీఓ లక్ష్మీనారాయణశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నుంచి 23వ తేది వరకు రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. గ్రూప్1 విభాగంలోని వాలీబాల్, అథ్లెటిక్స్, తైక్వాండో పోటీలను అక్కడ నిర్వహించనున్నారని చెప్పారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
కడప వైఎస్ఆర్ సర్కిల్: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను పొందుపరిచందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా అంశానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్అహ్మద్, నగర అధ్యక్షులు బండి జకరయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.