ములకలచెరువు (చిత్తూరు) : ప్యాసింజర్ రైలు ఇంజిన్ లోపంతో గంటలపాటు నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకు రైలు తిరిగి కదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు ఇంజిన్‌లో లోపంతో ములకలచెరువు మండలం బత్తలాపురం వద్ద నిలిచిపోయింది. అయితే అదే మార్గంలో రావాల్సిన తిరుపతి- గుంతకల్లు రైలును తుమ్మనగుట్ట వద్ద ఆపేశారు.
ఆ ఇంజిన్‌ను బత్తలాపురం వద్దకు తీసుకెళ్లి అక్కడ నిలిచిన రైలు బోగీలను బత్తలాపురం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం రైలు గుంతకల్లు వైపు వెళ్లిపోయింది. కాగా తిరుపతి రైలు అక్కడే ఉంది. హిందూపురం నుంచి మరో ఇంజిన్‌ను తెప్పించి నిలిచిపోయిన రైలును సాయంత్రం 5 గంటల సమయంలో గమ్యస్థానం వైపు నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రయాణికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
ఇంజిన్ ఫెయిలై నిలిచిన రైలు
Published Fri, Oct 16 2015 3:50 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement