ములకలచెరువు (చిత్తూరు జిల్లా): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన టమాటా ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. 30 కిలోల బాక్సు రూ.600 పలికింది. రెండు రోజుల క్రితం వరకు అదే బాక్సు ధర రూ.3 వేలు దాటింది. బయటి రాష్ట్రాల నుంచి పలువురు వ్యాపారులు ఇక్కడికి టమాటాలను తెప్పించడంతోనే ధరలు తగ్గాయని స్థానికులు చెబుతున్నారు.
కాగా, ఠారెత్తిస్తున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. అవసరమైతే మిగిలిన జిల్లాల్లోనూ విక్రయాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
(చదవండి: విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి..)
Comments
Please login to add a commentAdd a comment