బి.కొత్తకోట: ములకలచెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని ఈనెల 8న స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ముట్టడించి తాళాలు వేసిన ఘటనలో అధికారులే బలి పశువులు అవుతున్నారు. తహసీల్దార్ ఇచ్చిన పోలీసు ఫిర్యాదు నమోదైతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తామని మండల నేతలు మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌కు అల్టిమేటమ్ ఇవ్వడమే ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది. శనివారం డిప్యూటీ తహసీల్దార్ నిర్మలాదేవిని ఉన్నతాధికారులు చిత్తూరుకు బదిలీ చేయగా తహసీల్దార్ అమరేంద్రబాబు సోమవారం నుంచి 15 రోజులు సెలవులో వెళ్తున్నారు.
దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. వివరాల్లోకి వెళితే.. తహసీల్దార్ అమరేంద్రబాబు సమస్యలను పరిష్కరించడం లేదంటూ 8వ తేదీన మండలానికి చెందిన టీడీపీ నాయకులు, తహసీల్దార్ కార్యాలయానికి తాళంవేశారు. దీంతో తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐ, సిబ్బంది కార్యాలయంలోనే సాయంత్రం ఉండిపోయారు. ఆ మరుసటి రోజు మళ్లీ ఆందోళన నిర్వహించారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయడం కోసం నాయకులు ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి చిత్తూరు వెళ్లి కలెక్టర్‌ను కలిసినా సానుకూల స్పందనరాలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగిన నాయకులు కేసు నమోదు చేస్తే మూకుమ్మడిగా పార్టీకి రాజీనా మాలు చేయాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని మంత్రి అమరనా«థ్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌కు తేల్చిచెప్పడంతో కేసు నమోదు పెండింగ్‌లో పడిందని తెలిసింది. ఇంతలో జిల్లా అధికారులు శనివారం డిప్యూటీ తహసీల్దార్ నిర్మలాదేవిని చిత్తూరుకు బదిలీ చేశారు. ఆమె బదిలీ అయిన మరుసటి రోజు ఆదివారం తహసీల్దార్ అమరేంద్రబాబు సుదీర్ఘ సెలవులోకి వెళ్లడం చర్చ నీయాశమైంది. కాగా గురువారం రోజే అమరేంద్రబాబును జిల్లా అధికారులు చిత్తూరుకు పిలి పించుకొని వివరాలు సేకరించారు. దీంతో ఆయన ఈనెల 15 నుంచి వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని భావిస్తున్నారు.
పంతం నెగ్గుతుందా?
మండలానికి చెందిన కొందరు టీడీపీ నేతలు తహసీల్దార్‌ను బదిలీ చేయించి ఆయన స్థానంలో ఇటీవల డీటీగా వచ్చిన నిర్మలాదేవిని ఇన్‌చార్జిగా నియమించుకోవాలని యత్నించినట్టు తెలిసింది. అది సాధ్యం కాకపోవడంతో ఆందోళనకు దిగారు. అయితే కేసు నమోదు వరకు పరిస్థితి వెళ్లడంతో రాజకీయ వివాదం నెలకొంది. ఇదిలా ఉండగా బదిలీ అయిన నిర్మలాదేవి స్థానంలో కొత్త డీటీగా వచ్చిన వెంకటరెడ్డి సెలవురోజైనా.. ఆదివారమే ఆVýæమేఘాలపై బాధ్యతలు చేపట్టడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment