సాక్షి, కృష్ణా జిల్లా : జిల్లాలోని కంచికచెర్లలో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు హల్‌చల్ చేశారు. జాతీయ రహదారిపై బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటు తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ రహదారిపై భారీ బైక్ ర్యాలీ తీశారు. అక్కడే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో స్థానికులు ఎం జరుగుతుందోనన్న ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో బైకులు హైవేపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment