
సాక్షి, కృష్ణా జిల్లా: ఒకసారి మీ అమ్మమ్మగారి ఊరొచ్చి అక్కడ సమస్యలు పరిష్కరించండయ్యా..అని అభ్యర్థిచిన గ్రామస్తులకు ఆ ఊరికి తాను ఈ జన్మలో రానంటూ షాకిచ్చారు సినీ నటుడు, హిందూపూరం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. గురువారం తన స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామానికి బాలకృష్ణ వచ్చారు.
అక్కడి స్థానికులు, కుటుంబ సభ్యులు, చుట్టాలతో కొద్దిసేపు మాట్లాడారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్వరలో అమరావతిలో కూడా దాతల సహకారంతో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు. బాలకృష్ణ నిమ్మకూరు వచ్చారని తెలియడంతో సమీపంలోని కొమరవోలు గ్రామస్తులు అక్కడికి వచ్చి ఆయనను కలుసుకున్నారు.
మీ అమ్మగారి పుట్టిల్లు, మీ అమ్మమ్మగారి ఊరు కొమరవోలు రావాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు బాలకృష్ణను కోరారు. దీనికి బాలకృష్ణ బదులిస్తూ ‘కొమరవోలా..అదెక్కడుంది? ఆ ఊరికి ఈ జన్మలో రాను’ అని వ్యాఖ్యానించారు. ‘వారు లింగాయతులు..ఆ ఊరుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు.

ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు..
Comments
Please login to add a commentAdd a comment