సాక్షి, విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య ‘వన్’ రెస్టారెంట్ దాడి వ్యవహారం చిచ్చురేపింది. మూడు రోజుల క్రితం అన్నవరంలో వన్ రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందిపై దాడి జరిగింది. రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందిపై హోంమంత్రి అనిత అనుచరులు దాడికి పాల్పడ్డారు.
ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా టీడీపీ నేతలు గంటల తరబడి హోటల్‌లో కూర్చున్నారు. పీక్ అవర్‌లో ఎక్కువ సేపు కూర్చుంటే నష్టపోతామని హెటల్ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో.. హోటల్ మేనేజర్, సిబ్బందితో టీడీపీ నేతలు ఘర్షణకు దిగి.. దాడికి పాల్పడ్డారు.
ఈ గొడవ విషయాన్ని హోటల్ సిబ్బంది అమెరికాలోని యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే దాడి విషయాన్ని నందమూరి బాలకృష్ణ దృష్టికి హోటల్ యాజమాని తీసుకెళ్లారు. దీంతో హోంమంత్రి వంగలపూడి అనితకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ చేసిన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినా గొడవ సద్దుమణగపోవడంతో పంచాయితీ సీఎం పేషీకి చేరింది. అనంతరం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారా? హోంమంత్రి అనుచరులు కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తారా? అనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment