విషాదం: బాణసంచా కాల్చడంపై ఘర్షణ.. ఒకరు మృతి | UP Man Killed After Two Groups Clash Over Bursting Firecrackers | Sakshi
Sakshi News home page

విషాదం: బాణసంచా కాల్చడంపై ఘర్షణ.. ఒకరు మృతి

Nov 5 2021 9:25 AM | Updated on Nov 5 2021 12:24 PM

UP Man Killed After Two Groups Clash Over Bursting Firecrackers - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: దీపావళి రోజు విషాదం చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. షామ్లీ జిల్లాలో గురువారం దీపావళి రోజు టపాసులు కాల్చడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. 
చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని రాహుల్‌, సంజీవ్‌ సైనీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొదుతూ సంజీవ్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement