ఘర్షణకు దారితీసిన పంది వ్యవహారం | The conflict between the two factions in the issue of pig | Sakshi
Sakshi News home page

పంది విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Published Wed, Jan 31 2018 3:11 PM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

The conflict between the two factions in the issue of pig - Sakshi

బేతంపూడిలో పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పంది విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో బుధవారం జరిగింది. పంచాయతీలో మాట్లాడుదామని చెప్పి ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన వారు చితకబాదారు. గ్రామానికి చెందిన సింగబోయిన నాగరాజు మిర్చి తోటలో మేడ కృష్ణకు చెందిన పంది వెళ్లి నాశనం చేసిందని పందిని చంపారు.

ఈ విషయమే ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలోఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement