Published
Sat, Oct 1 2016 1:34 AM
| Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
పెద్దింట్లమ్మ ఆలయ ఈవోకు తీవ్ర గాయాలు
ఉండి : ఉండి బస్టాండ్ సమీపంలో ఎన్నార్పీ అగ్రహారం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో కృష్ణాజిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఈవో కొండలరావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఈవో కొండలరావు ద్విచక్రవాహనంపై మరో వ్యక్తితో కలిసి ఉండివైపు వస్తున్నారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో వేగంగా వస్తున్నారు. ఈ క్రమంలో ఉండి బస్టాండ్‌కు సమీపంలో పంది అడ్డుగా రావడంతో దానిని ఢీకొట్టి ద్విచక్రవాహనం పల్టీకొట్టింది. దీంతో కొండలరావుతోపాటు, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కొండలరావు తలకు తీవ్ర గాయమైంది. ఘటనా స్థలంలోనే ఆయనకు ఫిట్సు రావడంతో స్థానికులు సపర్యలు చేశారు. 108కు ఫోన్ చేశారు. 20 నిమిషాలు ఆలస్యంగా 108 రావడంతో కొండలరావు పరిస్థితి విషమించింది. ఎట్టకేలకు ఆయనతోపాటు మరో వ్యక్తిని భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పంది మరణించింది.