Picketing
-
ఘర్షణకు దారితీసిన పంది వ్యవహారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పంది విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో బుధవారం జరిగింది. పంచాయతీలో మాట్లాడుదామని చెప్పి ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన వారు చితకబాదారు. గ్రామానికి చెందిన సింగబోయిన నాగరాజు మిర్చి తోటలో మేడ కృష్ణకు చెందిన పంది వెళ్లి నాశనం చేసిందని పందిని చంపారు. ఈ విషయమే ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలోఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్యమానేరు వద్ద పోలీసు పికెటింగ్
మూడు టీఎంసీల నీటి నిల్వకు చర్యలు పోలీసు పికెటింగ్ ఏర్పాటు సిరిసిల్ల రూరల్ : ఇల్లంతకుంట మండలం మాన్వాడ వద్ద నిర్మిస్తున్న మధ్యమానేరు స్పిల్‌వే వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీ నీరు మధ్యమానేరుకు భారీగా వచ్చిచేరుకోవడంతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. స్పిల్‌వే వద్ద లోతు ఎక్కువగా ఉండడం, నీటి విడుదలను చూసేందుకు సందర్శకుల సంఖ్య పెరగడంతో సిరిసిల్ల పోలీసులు భద్రత చేపట్టారు. సీఐ విజయకుమార్ శనివారం ప్రాజెక్టును పరిశీలించి పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. మధ్యమానేరులో పని చేసే కార్మికులు మినహా ఎవరిని స్పిల్‌వే పైకి అనుమతించొద్దన్నారు. ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
అన్నపురెడ్డిపల్లిలో పోలీస్ పికెటింగ్
చండ్రుగొండ: ఆదివాసీ, గిరిజనేతర రైతుల మధ్య నెలకొన్న దేవాదాయ భూముల వివాదం నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లి గ్రామంలో సోమవారం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్తోపాటు 144 సెక్షన్ విధించారు. దీంతో గ్రామంలోని వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే వేంకటేశ్వరస్వామి ఆలయ వీధితోపాటు రద్దిగా ఉండే ప్రధాన సెంటర్ బోసిపోయింది. గ్రామస్తులు సైతం ఇండ్లకే పరిమితమయ్యారు. -
అరచేతిలో వైకుంఠం చూపుతున్న బాబు
విజయవాడ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సబ్-కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగిన పికెటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దగాకోరు ప్రభుత్వంపై పోరాటం ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు ప్రధాన హామీలతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు.. ఆచరణలో అమలు చేయటానికి రకరకాల సాకులతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు, వాటిని అమలు చేయటం సాధ్యం కాదని కొందరు చెప్పినా చంద్రబాబు బుకాయించారన్నారు. తొలిసంతకం రుణమాఫీ ఫైలుపై పెట్టి, రైతుసాధికారిత సంస్థను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు కనీసం ఒక్కరైతుకు, లేదా డ్వాక్రా మహిళకు రుణమాఫీ చేయలేదన్నారు. రాష్టాన్ని సింగపూర్ చేస్తానని సరికొత్త హామీలు చేశారన్నారు. హామీల అమలు కోసం సీపీఐ పోరాటాన్ని ఉధ్రుతం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పార్జీ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ హామీలు అమలు చేయకపోతే పోరాటాలకు వెనుకాడేది లేదన్నారు.పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రుణమాఫీ అమలు చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాజర్‌వలి, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు సూర్యదేవర నాగేశ్వరరావు, చలసాని రామారావు, దోనేపూడి శంకర్, టి.వి.రమణమూర్తి, మహిళా సమాఖ్య నాయకురాలు దుర్గాభవాని, ఏఐటీయూసీ నాయకుడు చలసాని అజయ్‌కుమార్, ఏఐవైఎఫ్ నాయకుడు నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సబ్-కలెక్టరేట్ వద్ద జరిగిన పికెటింగ్ కార్యక్రమం సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బాణసంచా దుకాణాల లెసైన్స్‌లు రద్దు
విశాఖపట్నం: ఈ ఏడాది విశాఖలో బాణసంచా విక్రయూల దుకాణాలకు లెసైన్స్‌లు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు. హుదూద్ తుఫాన్ కారణంగా నగరంలో ఎక్కడికక్కడ ఎండిన చెట్లు పేరుకుపోవడంతో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నం దున ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నగరంలో మందుగుండు సామగ్రి నిల్వ ఉన్న గోదాములను కూడా సీజ్ చేయనున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో తుఫాన్ తరువాత శాంతి భద్రతల నిర్వహణపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు, ఒడిశాకు చెందిన బృందాలు సుమారు రెండు వేల మంది పోలీసులు తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు వివరించారు. ప్రస్తుతం నగరంలో పరిస్థితులు మెరుగు పడటంతో శాంతిభద్రతలపై దృష్టి సారిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా నగరం అంధకారంలో ఉండటంతో పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు వస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భాదితులు తమ సమస్యలను 100 నంబరుకు లేదా పోలీస్ స్టేషన్లకు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరలో సీపీ నియూమకం నగర పోలీస్ కమిషనర్‌ను త్వరలో నియమించనున్నట్టు డీజీపీ రాముడు తెలిపారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన శివధరరెడ్డి తెలంగాణ ఇంటిలిజెన్స్ ఐజీగా బదిలీపై వెళ్లినప్పటి నుంచి ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్‌గా అతుల్‌సింగ్ ఉన్నారని చెప్పారు. ఆయన అంగీకరిస్తే ఆయన్నే పూర్తిస్థారుు పోలీస్ కమిషనర్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు సాంబశివరావు, పూర్ణచంద్రరావు, గౌతమ్శావంత్, అనురాధ, సురేంద్రబాబులతో పాటు డీఐజీ పి.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.