ఈ ఏడాది విశాఖలో బాణసంచా విక్రయూల దుకాణాలకు లెసైన్స్‌లు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు.
విశాఖపట్నం: ఈ ఏడాది విశాఖలో బాణసంచా విక్రయూల దుకాణాలకు లెసైన్స్‌లు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు. హుదూద్ తుఫాన్ కారణంగా నగరంలో ఎక్కడికక్కడ ఎండిన చెట్లు పేరుకుపోవడంతో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నం దున ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నగరంలో మందుగుండు సామగ్రి నిల్వ ఉన్న గోదాములను కూడా సీజ్ చేయనున్నామన్నారు.
పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో తుఫాన్ తరువాత శాంతి భద్రతల నిర్వహణపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు, ఒడిశాకు చెందిన బృందాలు సుమారు రెండు వేల మంది పోలీసులు తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు వివరించారు.
ప్రస్తుతం నగరంలో పరిస్థితులు మెరుగు పడటంతో శాంతిభద్రతలపై దృష్టి సారిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా నగరం అంధకారంలో ఉండటంతో పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు వస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భాదితులు తమ సమస్యలను 100 నంబరుకు లేదా పోలీస్ స్టేషన్లకు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.
త్వరలో సీపీ నియూమకం
నగర పోలీస్ కమిషనర్‌ను త్వరలో నియమించనున్నట్టు డీజీపీ రాముడు తెలిపారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన శివధరరెడ్డి తెలంగాణ ఇంటిలిజెన్స్ ఐజీగా బదిలీపై వెళ్లినప్పటి నుంచి ఇన్‌చార్జ్ పోలీస్ కమిషనర్‌గా అతుల్‌సింగ్ ఉన్నారని చెప్పారు. ఆయన అంగీకరిస్తే ఆయన్నే పూర్తిస్థారుు పోలీస్ కమిషనర్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు సాంబశివరావు, పూర్ణచంద్రరావు, గౌతమ్‌శావంత్, అనురాధ, సురేంద్రబాబులతో పాటు డీఐజీ పి.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.