lesains
-
బాణసంచా దుకాణాల లెసైన్స్‌లు రద్దు
విశాఖపట్నం: ఈ ఏడాది విశాఖలో బాణసంచా విక్రయూల దుకాణాలకు లెసైన్స్‌లు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు. హుదూద్ తుఫాన్ కారణంగా నగరంలో ఎక్కడికక్కడ ఎండిన చెట్లు పేరుకుపోవడంతో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నం దున ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నగరంలో మందుగుండు సామగ్రి నిల్వ ఉన్న గోదాములను కూడా సీజ్ చేయనున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో తుఫాన్ తరువాత శాంతి భద్రతల నిర్వహణపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు, ఒడిశాకు చెందిన బృందాలు సుమారు రెండు వేల మంది పోలీసులు తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు వివరించారు. ప్రస్తుతం నగరంలో పరిస్థితులు మెరుగు పడటంతో శాంతిభద్రతలపై దృష్టి సారిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా నగరం అంధకారంలో ఉండటంతో పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు వస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భాదితులు తమ సమస్యలను 100 నంబరుకు లేదా పోలీస్ స్టేషన్లకు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరలో సీపీ నియూమకం నగర పోలీస్ కమిషనర్‌ను త్వరలో నియమించనున్నట్టు డీజీపీ రాముడు తెలిపారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన శివధరరెడ్డి తెలంగాణ ఇంటిలిజెన్స్ ఐజీగా బదిలీపై వెళ్లినప్పటి నుంచి ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్‌గా అతుల్‌సింగ్ ఉన్నారని చెప్పారు. ఆయన అంగీకరిస్తే ఆయన్నే పూర్తిస్థారుు పోలీస్ కమిషనర్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు సాంబశివరావు, పూర్ణచంద్రరావు, గౌతమ్శావంత్, అనురాధ, సురేంద్రబాబులతో పాటు డీఐజీ పి.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. -
స్పీడెక్కువైతే...లెసైన్స్ రద్దు
పాడేరు రూరల్ : మన్యంలో ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పాడేరు డివిజన్ పోలీసులు నడుం బిగించారు. డ్రైవర్లకు, వాహన యజమానులకు కౌన్సెలింగ్ చేపట్టారు. తప్పతాగి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించడానికి ప్రత్యేకంగా మౌత్ అలార్ట్ మిషన్‌ను తెప్పించారు. గురువారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కార్యాలయంలో పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి. మాడుగుల మార్గాలో జీపులు, ఆటో సర్వీసులు చేస్తున్న డ్రైవర్లు, వాహన యజమానులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు వీలుగా ముద్రించిన గోడ పత్రికలను అవిష్కరించారు. ఈ సందర్భంగా పాడేరు ఏఎస్పీ బాబూజీ మాట్లాడుతూ జీపులు, ఆటోల్లో పరిమితి మేరకే ప్రయాణికులను ఎక్కించాలని, వేగాన్ని తగ్గించాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని హెచ్చరించారు. ఎవరైనా ప్రమాదాలకు కారణమైతే అటువంటి వారి లెసైన్స్‌లను రద్దు చేసి, వాహనాలను సీజ్ చేసి, హత్య కేసు నమోదు చేస్తామన్నారు. సక్రమంగా వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉన్న లెసైన్స్‌లు లేని డ్రైవర్లను గుర్తించి రవాణ శాఖ ద్వారా పోలీసు శాఖ లెసైన్స్‌లను ఇప్పించే ఏర్పాట్లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఆర్టీవో శివరామకష్ణ, పాడేరు డిపో మేనేజర్ వి. ప్రవీణ, పాడేరు సీఐ ఎన్. సాయి, పాడేరు హుకుంపేట ఎస్ఐలు ధనుంజయ్, భరత్‌కుమార్ పాల్గొన్నారు. -
కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల సం ఖ్యను స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీలుగా మారిన కొత్త పట్టణాల్లో బార్ల ఏర్పాటు కు లెసైన్స్‌లు జారీ చేస్తారు. జూలై 1 నుంచి మొదలు కాబోతున్న 2014- 15 ఎక్సైజ్ పాలసీని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. జూలై ఒకటి నుంచి ప్రస్తు త బార్లను రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా జీవోలు జారీ చేశారు. కాగా,బార్ల లెసైన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబుల్లో ఈ ఫీజులు ఉంటాయి. అయితే ప్రివిలేజ్ ఫీజు 5 రెట్లకు కుదించారు. అంటే లెసైన్స్ ఫీజు కన్నా ఐదు రెట్ల అమ్మకాలు దాటితే, తరువాత కొనుగోలు చేసే బాటిళ్లపై ఎక్సైజ్ శాఖ 14.5 శాతం ఫీజు వసూలు చేస్తుంది. పెరగనున్న బార్లు: తెలంగాణలోని 10 జిల్లాల్లో బార్ లెసైన్స్‌లు 726 ఉన్నప్పటికీ ప్రస్తుతం 704 మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పటివరకు బార్లులేని కొత్త మునిసిపాలిటీల్లో వాటిని ఏర్పాటుకు ఎక్సైజ్ కమిషనర్ అనుమతిస్తారు. రాష్ట్రంలో మొత్తం 38 మునిసిపాలిటీలు ఉండగా వీటిలో 8 కొత్తవే. బార్ల లెసైన్స్ ఫీజు ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రివిలేజ్ ఫీజును 5 రెట్లకు తగ్గించడం వల్ల ఒక్కో బార్ నుంచి కనీసం రూ. 5లక్షల వరకు సర్కార్‌కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. -
భలే కిక్కు
మద్యం దుకాణాల టెండర్లకు ముగిసిన గడువు చివరి రోజు పోటెత్తిన వైనం దరఖాస్తుల ద్వారా రూ.5.28 కోట్ల ఆదాయం నేడు లాటరీ ద్వారా లెసైన్సుల మంజూరు 100కు పైగా షాపులకు దరఖాస్తులు నిల్ చిత్తూరు (అర్బన్): మద్యం దుకాణాల నిర్వహణ లెసైన్స్‌ల జారీకి దరఖాస్తులు వెల్లువెత్తారుు. రెండు రోజులుగా అంతంతమాత్రంగా పడిన దరఖాస్తులు చివరి రోజైన శుక్రవారం సుమారు వెయ్యికి పైగా వచ్చాయి. మహిళలు, వృద్ధులు, పిల్లల నుంచీ దరఖాస్తులు అందడం గమనార్హం. జిల్లాలోని 458 మద్యం దుకాణాల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులు ఈనెల 23న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో పోటీదారులు బారులుతీరారు. రూ.2 కోట్ల ఆదాయం చిత్తూరులో 214, తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 244 మద్యం దుకాణాలకు మొత్తం రెండు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతి దరఖాస్తుకూ రూ.25 వేలు (నాన్ రీఫండబుల్) డీడీ రూపంలో దరఖాస్తుదారులు చెల్లించాలి. ఈ లెక్కన ఇంకా ఒక్క దుకాణం కేటాయింపు జరగకుండానే ప్రభుత్వానికి దాదాపు రూ.5.28 కోట్ల ఆదాయం లభించింది. 2014-15 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ పెట్టుకున్న రూ.117 కోట్ల లక్ష్యాన్ని సులువుగా చేరుకోనుంది. నేడు లాటరీ ద్వారా ఎంపిక లెసైన్సుల ఖరారు కోసం శనివారం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పేర్కొన్నారు. పలు దుకాణాలకు దరఖాస్తులు నిల్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి లెసైన్సుల జారీ రుసుములను భారీగా పెంచేయడం, దుకాణాల ధరలూ పెరగడంతో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తులు పడలేదు. వీటి సంఖ్య జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చివరి రోజున ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమంది టెండర్లు వేశారు, ఎంత ఆదాయం వచ్చింది, ఏయే దుకాణాలకు టెండర్లు పడలేదనే విషయాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. మేము సైతం మద్యం దుకాణాల లెసైన్సుల కోసం ఈసారి మహిళామణులు టెండర్లు వేశారు. దుకాణాల కేటాయింపులో ఎలాంటి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కొందరు మహిళలు ఒక్కరే నేరుగా పాల్గొని లెసైన్సుల కోసం దరఖాస్తులు వేశారు. మరికొన్ని దుకాణాలను భర్తలు సెంటిమెంట్ కోసం వారి భార్యలు, కుమార్తెల వద్ద టెండర్లు వేయించారు. మరికొందరు వారి తల్లులను సైతం తీసుకువచ్చి టెండర్లు వేయించారు. పలుచోట్ల వాగ్వివాదం మద్యం టెండర్లు వేయడానికి వచ్చిన దరఖాస్తుదారులు పలు చోట్ల వాగ్వివాదాలకు దిగారు. శ్రీకాళహస్తి మండలంలో ఒకే షాపునకు 23 మంది దరఖాస్తులు వేయగా, ఎక్సైజ్ అధికారుల ముందే నువ్వు వేయకూడదంటే... నువ్వు వేయకూడదని దుర్భాషలాడుకున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తులను అందజేయాల్సి ఉంది. తిరుపతి - చిత్తూరు మార్గంలో రైల్వేగేటు పడిపోవడంతో 20 మంది దరఖాస్తులు వేయలేకపోయారు. సమయం సమీపిస్తుండడంతో దరఖాస్తులు వేయడానికి పలువురు పరుగులు తీసి టెండర్లను దాఖలు చేశారు. -
ముగియనున్న లెసైన్స్ గడువు
భీమవరం క్రైం : ఎక్సైజ్ కొత్త పాలసీని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఎక్సైజ్ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. మద్యంషాపుల లెసైన్స్ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ తరువాత షాపుల మంజూరుకు అనుసరించాల్సిన విధి విధివిధానాలపై ఎక్సైజ్ అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో మద్యం షాపుల లెసైన్స్ గడువు ముగిసేలోగా చేయాల్సిన పనులను ఏవిధంగా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం 389 వైన్ షాపులు, 39 బార్లకు సంబంధించి లెసైన్స్‌లను పాత విధానంతోనే అమలు చేస్తారా? లేక కొత్త విధానం రూపొం దిస్తారా? అనేది మద్యం వ్యాపారులకు ఉత్కంఠగా మారింది. ప్రైవేట్ వ్యక్తులు మద్యం వ్యాపారం చేసుకునేలా ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తారా? లేక ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతుందా? అనేవి ప్రశ్నలుగా మారాయి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల నేపధ్యంలో మద్యం దుకాణాల యజమానులకు నష్టం వాటిల్లిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని పాలసీని రూపొందిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా కొత్త పాలసీని ప్రకటించకపోతే ప్రస్తుతం ఉన్న లెసైన్స్లనే కొన్ని నెలలు పొడిగిస్తారని పలువురు భావిస్తున్నారు. -
కారు డ్రైవర్ చెప్పిన పాఠాలు
ప్రేరణ ఆయన వయస్సు ఇప్పుడు 61 ఏళ్లు. జుట్టు నెరిసిపోయింది. చూపు మందగించింది. ఆ వ్యక్తి దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలో 25 ఏళ్లపాటు పనిచేశారు. ఆయన నుంచి నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. అలాగనీ ఆయన భారీ వేతనం వచ్చే చాలా గొప్ప ఉద్యోగం చేసినవారు కాదు. పేరు కూడా మీరు ఇప్పటిదాకా విని ఉండరు. ఆయన నా కారు డ్రైవర్. పేరు కరుణన్.. జీవితంలో కొన్నిసార్లు విలువైన పాఠాలను సాధారణ వ్యక్తుల నుంచి కూడా నేర్చుకుంటాం. ఓ రోజు ఉదయం కరుణన్ నాతో చాలాసేపు మాట్లాడారు. తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కరుణన్గొప్ప కాలేజీల్లో ప్రముఖుల సమక్షంలో అతిథి ప్రసంగాలు చేయకపోయినా ఆయన నాతో చెప్పినవి నేటి యువతరానికి తప్పకుండా ఉపయోగడతాయి. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. లెసైన్స్ వస్తే డ్రైవింగ్ వచ్చినట్టేనా? డ్రైవింగ్ లెసైన్స్ వచ్చినప్పుడు నా వయస్సు 18 ఏళ్లు. అంతకు కొన్ని నెలల ముందుగానే కారు నడపడం నేర్చుకున్నా. లెసైన్స్ వచ్చేయగానే డ్రైవర్ అయినట్లు కాదు. అది వాహనం నడపడానికి ఒక అనుమతి పత్రం మాత్రమే. అథారిటీ స్టాంప్ లాంటిది కాదు. కారును పూర్తిగా నడపడం వచ్చినవారే డ్రైవర్ తప్ప లెసైన్స్ సంపాదించుకున్నవారు డ్రైవర్ కాలేరు. ఎంబీఏ డిగ్రీ ఒక వ్యక్తిని మేనేజర్‌గా మార్చలేదు. కొన్నేళ్లు పని నేర్చుకొని, తగిన అనుభవం సంపాదిస్తేనే మేనేజర్ అనే హోదాను పొందుతారు. నేటితరం విద్యార్థులు డిగ్రీ చేతికి రాగానే అన్ని నేర్చుకున్నట్లేనని భ్రమపడుతున్నారు. కానీ, అది ముగింపు కాదు, ప్రారంభం మాత్రమే. ఒక డిగ్రీ, డిప్లొమా, లెసైన్స్... వాస్తవ జీవిత అనుభవాల నుంచి నేర్చుకొనేందుకు ఒక వ్యక్తికి తగిన అర్హత కల్పిస్తాయి. అంతేతప్ప పరిపూర్ణుడిగా మార్చలేవు. బాహ్య ప్రపంచం ఎంతో భిన్నం: నేను కారు నడపడం నేర్చుకున్నా. కానీ, నా తొలి ఉద్యోగం చిన్న టెంపో వాహనం నడపడం. కారుతో పోలిస్తే దీని స్టీరింగ్ చక్రం, గేర్లు చాలా భిన్నంగా ఉన్నాయి. నేను దీన్ని తేలికగా డ్రైవ్ చేస్తానని అనుకున్నా.. కానీ, కనీసం స్టార్ట్ కూడా చేయలేకపోయా. తరగతి గది బయట ఉండే ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, అకౌంటెంట్లు, ఇతరులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. బయటి ప్రపంచాన్ని యథాతథంగా స్వీకరించడానికి సంసిద్ధులు కావాలి. కొన్ని మెట్లు కిందికి దిగండి: నేను రాత్రిపూట క్లీనర్‌గా కూడా పనిచేశా. వాహనాల లోపల ఉండే విడిభాగాలను పరిశీలించి, వాటి పనితీరును అర్థం చేసుకొనేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. దానివల్ల నేను ఒక మంచి డ్రైవర్‌గా మారగలిగాను. దేశంలో నేడు పేరుప్రఖ్యాతులు సంపాదించిన మార్కెటింగ్ నిపుణులంతా ఒకప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో సబ్బులు, కోలాలు, ఇతర వస్తువులు అమ్మినవారే. ఆ అనుభవం నుంచే వారు పాఠాలు నేర్చుకొని ఉన్నతస్థానాలకు ఎదిగారు. మీరు జీవితంలో విజయం సాధించాలని నిజంగా కోరుకుంటే.. మీ స్థాయి నుంచి కొన్నిమెట్లు కిందికి దిగండి. చేతులకు మరకలు అంటినా ఫర్వాలేదు బాగా కష్టపడండి. మంచి యజమాని.. విలువైన జీతం: నా మొదటి ఉద్యోగంలో వేతనం చాలాచాలా తక్కువ. కానీ, యజమాని చాలా మంచివాడు. పనిలో తప్పులు చేసినా సరిదిద్దుకోవడానికి ఆయన నాకు అవకాశాలిచ్చారు. యజమాని నుంచి నేర్చుకున్న మంచి విషయాలు మనసులో ముద్రించుకుపోయాయి. మీ తొలి ఉద్యోగంలో.. జీతభత్యాల గురించి, సంస్థ పరిమాణం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మంచి యజమాని దొరికితే.. అంతకంటే విలువైన వేతనం ఉండదు. చేస్తున్న పనే ముఖ్యం: బాగా ఖరీదైన, విలాసవంతమైన కార్లనే నడపాలనే కోరిక నాలో ఉండేది. ప్రారంభంలో టెంపో, స్కూల్ వ్యాన్, సిటీ బస్సు నడపాల్సి వచ్చింది. వాహనం ఏదైనప్పటికీ డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాను. తర్వాత గొప్ప కార్లను నడిపే అవకాశాలు వచ్చాయి. కంపెనీ ముఖ్యం కాదు, చేస్తున్న పనే ముఖ్యం. తర్వాత రాబోయే ఉద్యోగం, పదోన్నతులు, వేతనాల గురించి ఆలోచించకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా.. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తే విజయం, ఆనందం వాటంతట అవే అనివార్యంగా వస్తాయి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
సెల్లు.. లెసైన్స్‌కు చెల్లు
ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే లెసైన్‌స రద్దు బెంగళూరు సీపీ ఔరాద్కర్ హెచ్చరిక మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలు నడిపే వారి లెసైన్స్‌లు రద్దు చేస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ హెచ్చరించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. నగర ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా తీసుకునే చర్యల్లో భాగంగా రవాణా చట్టంలోని అంశాల ప్రకారం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మొబైల్ ఫోనులో మాట్లాడుతూ వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. బాడుగకు వెళ్లడానికి నిరాకరించే, ఎక్కువ బాడుగులు డిమాండ్ చేసే ఆటో, క్యాబ్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి డ్రైవింగ్ లెసైన్స్‌లను కూడా రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. -
నీటి దందాతో కోట్లు
రూ.25 కోట్లకుపైగా దోచేస్తున్న ప్రైవేటు సంస్థలు ఐఎస్ఐ లేకనే వాటర్ప్యాకెట్లు, బాటిల్స్ అమ్మకాలు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో నిలువు దోపిడీ తిరుపతి, చిత్తూరు నగరాల్లో నకిలీ కంపెనీలు పట్టించుకోని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు నకిలీ కంపెనీల నీళ్ల వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారుు. వేసవి మొదలవడంతో ఈ నీళ్ల వ్యాపారం మాఫియూ స్థాయికి చేరుకుంది. సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఏటా నకిలీ వాటర్ ప్యాకేజీ కంపెనీలు రూ.25 కోట్లకు పైగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచేస్తున్నాయి. నకిలీ వాటర్ కంపెనీలు కలుషితమైన నీటిని అమ్ముతూ దాదాపు కోట్లల్లో టర్నోవర్ చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆహార మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో 90 శాతం ప్యాకేజీ వాటర్ కంపెనీలు నడవడం లేదు. కొన్ని లెసైన్స్లే లేకుండా విచ్చలవిడిగా నాసిరకం, కలుషితమైన నీటితో వ్యాపారం చేస్తున్నాయి. వందల్లో నకిలీ కంపెనీలు తిరుపతిలో 4, చిత్తూరులో రెండు, మదనపల్లెలో 2 కలిపి జిల్లా మొత్తం పదిలోపే ఐఎస్ఐ ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ లెసైన్స్ కలిగిన కంపెనీలు ఉన్నాయి. ఒక్క తిరుపతిలోనే ఐఎస్ఐ ముద్ర లేని వాటర్ప్లాంట్లు పదికి పైగా ఉన్నాయి. ఇళ్లలో నడుస్తున్న చిన్నాచితక అనధికారిక కంపెనీలు రెండు వందలకు పైగా ఉన్నాయి. మదనపల్లెలో 50, చిత్తూరులో 100 వరకు ఇలాంటి బోగస్ వాటర్ ప్యాకేజీ కంపెనీలు ఉన్నాయి. శివారు ప్రాంతంలో స్థలం లీజ్‌కు తీసుకోవడం బోరు వేసేయడం, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అనధికారికంగా ప్రారంభించేయడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. వీటిని అడ్డుకోవడంపై జిల్లా అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. నిబంధనలు ఇవీ... బీఎస్ఐ ఇచ్చే ఐఎస్ఐ మార్కు తప్పనిసరిగా ఉండాలి. ఐఎస్ఐ ఉంటేనే ఫుడ్ లెసైన్స్ ఇస్తారు. ఈ రెండు ఉంటేనే ప్యాకేజీ వాటర్ కంపెనీ నిర్వహించడానికి అనుమతి లభిస్తుంది. పంచాయతీ లేదా మున్సిపాలిటీ అప్రూవల్ కచ్చితంగా ఉండాలి. స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీగా గుర్తింపు పొంది ఉండాలి. సేల్‌ట్యాక్స్ టిన్ మెంబర్‌తోపాటు టీవోటీ లెసైన్స్ కలిగి ఉండాలి. వాటర్‌ప్లాంట్‌లో ఒక మైక్రోబయోలజిస్టు, కెమిస్టు, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. వీరు ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్స్ తీసి ప్రయోగశాలకు పరీక్ష నిమిత్తం పంపుతుండాలి. ప్రతి నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి వాటర్ శాంపిల్స్ పరీక్షకు పంపి నివేదిక తెప్పించుకోవాలి. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్-లేబుల్‌పై ఐఎస్ఐ మార్కు, వాటర్ ప్యాకేజీ చేసిన తేదీ, గడువు తీరే తేదీ ముద్రించాలి. ఒక వాటర్ ప్యాకెట్‌ను మూడు రోజుల్లోనే విక్రయించాలి. డబ్బు పెట్టినా... కలుషిత నీరే రైళ్లు, ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లో, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి విష్ణునివాసం, శ్రీనివాసం వంటి యాత్రికుల సముదాయాల వద్ద నాసిరకం, కలుషిత ప్యాకేజీ వాటర్‌ను విరివిగా అమ్ముతున్నారు. ఒక్కొక్క వాటర్ ప్యాకెట్ రూ.2, బస్టాండ్లలో రూ.3కి కూడా విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ ముద్ర ఉన్న కంపెనీ బాటి ల్స్ లీటరు రూ.20 విక్రయిస్తుండగా, ఎలాంటి నాణ్యత లేని, ప్రమాణాలు పాటించని కంపెనీల వాటర్ బాటిల్స్‌ను రూ.20 కే విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయూ మున్సిపల్ కమిషనర్లు, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అధికమొత్తాలకు ఆశపడి.... నీటిని ఎలాంటి ప్రోసెసింగ్ చేయకుండా నేరుగా తయూరైన వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్‌పై అధిక మొత్తంలో మార్జిన్ ఇస్తున్నారు. దీంతో దుకాణదారులు కూడా నాసిరకం నీటి ఉత్పత్తులపైనే ఆసక్తి చూపుతున్నారు. రానున్నది వేసవి సీజన్ కావడంతో ఈ తరహా మోసపూరిత వ్యాపారాలు ఇప్పటి నుంచే పుంజుకోనున్నాయి.