- ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే లెసైన్‌స రద్దు
- బెంగళూరు సీపీ ఔరాద్కర్ హెచ్చరిక
మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలు నడిపే వారి లెసైన్స్‌లు రద్దు చేస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ హెచ్చరించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. నగర ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా తీసుకునే చర్యల్లో భాగంగా రవాణా చట్టంలోని అంశాల ప్రకారం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
మొబైల్ ఫోనులో మాట్లాడుతూ వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. బాడుగకు వెళ్లడానికి నిరాకరించే, ఎక్కువ బాడుగులు డిమాండ్ చేసే ఆటో, క్యాబ్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి డ్రైవింగ్ లెసైన్స్‌లను కూడా రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.