పాడేరు రూరల్ : మన్యంలో ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పాడేరు డివిజన్ పోలీసులు నడుం బిగించారు. డ్రైవర్లకు, వాహన యజమానులకు కౌన్సెలింగ్ చేపట్టారు. తప్పతాగి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించడానికి ప్రత్యేకంగా మౌత్ అలార్ట్ మిషన్‌ను తెప్పించారు.
గురువారం స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కార్యాలయంలో పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి. మాడుగుల మార్గాలో జీపులు, ఆటో సర్వీసులు చేస్తున్న డ్రైవర్లు, వాహన యజమానులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు వీలుగా ముద్రించిన గోడ పత్రికలను అవిష్కరించారు.
ఈ సందర్భంగా పాడేరు ఏఎస్పీ బాబూజీ మాట్లాడుతూ జీపులు, ఆటోల్లో పరిమితి మేరకే ప్రయాణికులను ఎక్కించాలని, వేగాన్ని తగ్గించాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని హెచ్చరించారు. ఎవరైనా ప్రమాదాలకు కారణమైతే అటువంటి వారి లెసైన్స్‌లను రద్దు చేసి, వాహనాలను సీజ్ చేసి, హత్య కేసు నమోదు చేస్తామన్నారు.
సక్రమంగా వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉన్న లెసైన్స్‌లు లేని డ్రైవర్లను గుర్తించి రవాణ శాఖ ద్వారా పోలీసు శాఖ లెసైన్స్‌లను ఇప్పించే ఏర్పాట్లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఆర్టీవో శివరామకష్ణ, పాడేరు డిపో మేనేజర్ వి. ప్రవీణ, పాడేరు సీఐ ఎన్. సాయి, పాడేరు హుకుంపేట ఎస్‌ఐలు ధనుంజయ్, భరత్‌కుమార్ పాల్గొన్నారు.
స్పీడెక్కువైతే...లెసైన్స్ రద్దు
Published Fri, Jul 11 2014 12:45 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement