ప్రమాదకర స్థలాలను పరిశీలిస్తున్న అధికారుల బృందం(ఫైల్)
నిజామాబాద్ రూరల్ : చిన్న రోడ్డు కాస్త రహదారి వరకు పెంచి మంచి సౌకర్యమే కల్పించారు!. ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం నుంచి మల్కాపూర్ గ్రామం వరకు గల బాన్సువాడ –నిజామాబాద్ రహదారిపై మలుపులు ప్రమాదకరంగా మారాయి. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మలుపుల వద్ద కనీసం సూచికలు కాని, హెచ్చరిక బోర్డులు గాని లేవు. దీంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కనీసం నెలకు నాలుగు ప్రమాదాలు అవుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఏడాదికి సగటున 15 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్– బాన్సువాడ మధ్య తిరిగే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మల్లారం గండిలో రోడ్డు ఇరుకుగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పది చోట్ల మలుపులు ఉన్నాయి. ఈ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
తద్వారా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. బైకులు, భారీ వాహనాలు సైతం ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని రహదారి పరిసర గ్రామాలవాసులు ఆరోపిస్తున్నారు. మల్లారం, మల్కాపూర్, ముత్తకుంట, కొత్తపేట, ప్రజలు ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
మల్లారం గండిలో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అధికారులు ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకో వాలి. ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నా రు. స్పీడ్ బ్రేకర్‌లు ఏర్పాటు చేయాలి. రోడ్డు మీద వెళ్లేవారికి ప్రమాదాలు కాకుండా చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాం తంలో నిఘా ఏర్పాటు చేయాలి. –మీసాల సువర్ణమధుకర్, సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment