- మూడు టీఎంసీల నీటి నిల్వకు చర్యలు
- పోలీసు పికెటింగ్ ఏర్పాటు
మధ్యమానేరు వద్ద పోలీసు పికెటింగ్
Published Sat, Aug 13 2016 10:51 PM | Last Updated on Fri, Aug 30 2019 8:19 PM
సిరిసిల్ల రూరల్ : ఇల్లంతకుంట మండలం మాన్వాడ వద్ద నిర్మిస్తున్న మధ్యమానేరు స్పిల్‌వే వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీ నీరు మధ్యమానేరుకు భారీగా వచ్చిచేరుకోవడంతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. స్పిల్‌వే వద్ద లోతు ఎక్కువగా ఉండడం, నీటి విడుదలను చూసేందుకు సందర్శకుల సంఖ్య పెరగడంతో సిరిసిల్ల పోలీసులు భద్రత చేపట్టారు. సీఐ విజయకుమార్ శనివారం ప్రాజెక్టును పరిశీలించి పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. మధ్యమానేరులో పని చేసే కార్మికులు మినహా ఎవరిని స్పిల్‌వే పైకి అనుమతించొద్దన్నారు. ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement