'మిడ్‌ మానేరు' పనుల్లో అపశ్రుతి | accident at mid manair project works | Sakshi
Sakshi News home page

'మిడ్‌ మానేరు' పనుల్లో అపశ్రుతి

Published Sat, Oct 7 2017 2:14 PM | Last Updated on Fri, Aug 30 2019 8:17 PM

accident at mid manair project works

సాక్షి, రాజన్న సిరిసిల్ల: మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్పిల్‌వే పై పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు పై నుంచి జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బోయినిపల్లి మండలం మానువాడ దగ్గర నిర్మిస్తున్న మిడ్‌ మానేరు ప్రాజెక్టు స్పిల్‌వే పై పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement