
చికిత్స పొందుతున్న బాలాజి, గాయపడిన కానిస్టేబుల్ హేమాద్రి
పుంగనూరు: ఆవు పొలంలో దూరి పంటను మేసిందని ఇరువర్గాలు ఘర్షణ పడిన సంఘటన గురువారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడి నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు.. భరిణేపల్లెకు చెందిన హేమాద్రి తిరుపతిలో పోలీస్‌గా పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా హేమాద్రి చిన్నాన్న బాలాజి ఆవు తన పొలంలో మేసిందని సాయంత్రం ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీనిపై బాలాజి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పినా హేమాద్రి వినకుండా బాలాజి ఇంటి వద్దకు వెళ్లి అతనిని కొడవలితో నరకడంతో ఎడమచెయ్యి, కాలు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బాలాజి తల్లి మునెమ్మకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ హేమాద్రి మాట్లాడుతూ తనపై బాలాజి, వారి కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు వచ్చి ఆఘర్షణలో బాలాజి గాయపడ్డాడని, తన తల్లినారాయణమ్మను, తనను గాయపరిచారని తెలిపాడు. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment