ప్యాపిలి: రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మునిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో నాసిర్ బాషా అనే వ్యక్తి మృతి చెందాడు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని డోన్, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
అయితే, ఈ దాడిలోనే తీవ్రంగా గాయపడిన కంబగిరిస్వామి (42) ప్రాణాలు కాపాడుకునేందుకు కనిపించకుండా ఎటో వెళ్లిపోయాడు. అనంతరం ఇంటికి చేరిన ఆయన ఈ మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు.
పాత కక్షల కారణంగానే గొడవ జరిగినట్టు అనుమానిస్తున్నారు. రెండు వర్గాల ఘర్షణతో మునిమడుగు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి పరిస్థితి అదుపు చేస్తున్నారు.