
సాక్షి, న్యూఢిల్లీ : పూణేలో తాను ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని దళిత నేత, గుజరాత్ ఎంఎల్‌ఏ జిగ్నేష్ మెవాని చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తనను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ర్టలో భీమా - కొరేగావ్ ఘటనల నేపథ్యంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 31న జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మెవాని, జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, మహారాష్ర్ట బంద్‌లోనూ పాల్గొనలేదని మెవాని స్పష్టం చేశారు. తనను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు మహారాష్ర్ట ఘటనలను నిరసిస్తూ దళితులు చేపట్టిన నిరసనలు గుజరాత్, యూపీలనూ తాకాయి. పూణేలో దళిత యువకుడి హత్యను ఖండిస్తూ యూపీలోని ముజఫర్‌నగర్‌లోనూ దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.