Bhima Koregaon
-
బీమా కొరేగావ్ కేసు: ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు ఊరట
ముంబయి: బీమా కొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న ఎల్గార్ పరిషత్ సభ్యులు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్రవాద వ్యతిరేక నిరోధక చట్టం (ఊపా) కింద అరెస్టైన వీరిద్దరి బెయిల్ పిటీషన్‌ను 2021 డిసెంబర్లో బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. బీమా కోరేగావ్ కేసులో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై 2018లో వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబయిలోని తలోజా జైలులో నిర్భందించారు. ఐదేళ్లపాటు వరుసగా కస్టడీలోనే ఉన్నందున కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి అనే ఒక్క కారణంతో బెయిల్ నిరాకరించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాల తరపున న్యాయవాదులు మూడు రోజుల పాటు వాదనలు వినిపించారు. ఊపా చట్టం కింద అరెస్టు చేయడానికి సరిపడు ఆధారాలు తమ క్లయింట్ల వద్ద లభించలేదని విన్నివించారు. అందుకు తగు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. పూణెలోని బీమా కొరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 2017 డిసెంబర్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ కేసులో వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలతో సహా 14 మందిని ఎన్ఐఏ నిందితులుగా చేర్చింది. బీమా కొరేగావ్ యుద్ధం జరిగి 200 ఏళ్ల వార్షికోత్సవాన్ని 2017 డిసెంబర్ 31న జరిపారు. దీనిని పురస్కరించుకుని ఎల్గార్ పరిషత్ ఈవెంట్‌కు సంబంధించి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముంబయి, నాగ్‌పూర్, ఢిల్లీ నుంచి 2018 జూన్‌లో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు హింసను ప్రేరేపించాయని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!
కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరాని తనం నుండి విముక్తి పొందడానికి మహార్ పీడిత కులానికి చెందిన ఐదు వందలమంది సైనికులు 1818 జనవరి ఒకటవ తేదీ నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున రెండవ బాజీరావు పీష్వా సైన్యంతో భీమానది ఒడ్డున వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. ఈ విజయానికి సూచనగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కోరేగావ్ వద్ద మహార్ అమరవీరుల స్థూపాన్ని నిర్మించి, ఆ స్థూపంపై యుద్ధంలో చనిపోయిన 22 మంది మహార్ వీరుల పేర్లను చెక్కించారు. భీమా నది ఒడ్డున నిర్మించిన మహార్ వీరుల స్మారక విజయ స్తంభాన్ని 1927లో డాక్టర్ అంబేడ్కర్ సందర్శించే వరకు భీమా కోరేగావ్ చరిత్ర... స్వతంత్ర పోరాటం పేరుతో వక్రీకరణకు గురైంది. అక్కడ జరిగిన యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా మరా ఠాలు చేసిన స్వాతంత్య్ర పోరాటంగా కుహనా చరిత్రకారులు చిత్రించారు. నిజానికి చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే... మహార్ వీరులు ఆ యుద్ధంలో తమ పట్ల పీష్వాలు అనుసరిస్తున్న అంటరానితనం, అణచివేతలకు వ్యతిరేకంగా... తమ విముక్తి కొరకే పాల్గొన్నా రనేది వాస్తవం. అంబేడ్కర్ భీమాకోరేగావ్ వద్ద విజయాన్ని మరాఠా పీష్వాల రాజ్యంలో ‘బ్రాహ్మణీయ అణచివేతపై దళిత ఆత్మగౌరవ ప్రతీకగా’ ప్రకటించడంతో అసలు చరిత్ర వెలుగు లోకి వచ్చింది. మరాఠా సామ్రాజ్యంలో నిజానికి పీష్వాలు దళితులపై చేస్తున్న కుల అణచివేత, ఆగడాలు అంతా ఇంతా కాదు. నడుముకు చీపురు, మూతికి ముంత కట్టించారు. దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆయుధాలు నిరాకరించి పశువుల కన్నా హీనంగా చూస్తున్న పీష్వాల పాలనలో పోరాటం తప్పితే మరేమీ మిగల్లేదు. యుద్ధానికి ముందు మహార్ల నాయకుడైన సిఖ్ నాయక్... పీష్వా సైన్యాధికారిని యుద్ధం జరగకుండా ఉండాలంటే... తమను మనుషులుగా గుర్తించి, అంటరానితనం పాటించడం నిలిపివేసి కనీస హక్కులు ఇవ్వాలని అడిగాడు. ‘మీరు యుద్ధం చేసి గెలిచినా కూడా అస్పృశ్యులే, మీ అంటరానితనం పోదు. మీరు ఎప్పుడూ మా కాళ్ళకింద ఉండేవారే’ అని కండకావరంతో సైని కాధికారి మాట్లాడటంతో యుద్ధం అనివార్యమైంది. అత్యంత బలస్థులూ, పోరాట యోధులైన మహర్ యువకులు ఆ మాటలతో ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. రెండు రోజులు కాలినడకన ప్రయాణం చేశారు. వెంట తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి. అయినా ఆకలితో ఉండి కూడా భీమా నది ఒడ్డున 1818 జనవరి ఒకటవ తేదీనాడు 20 వేల అశ్వికదళం, 8 వేల పదాతిదళం కలిగినన పీష్వాల సైన్యంతో పోరాడి విజయం సాధించారు. ఇది ముమ్మాటికీ కుల పీడనపై ‘ప్రతిఘటన’గానే మనం చూడాలి. నేడు కుల వ్యవస్థ ఆధునిక రూపాలు సంతరించుకొని గ్రామాల నుండి పట్టణాల వరకూ, పాఠశాలల నుండి యూని వర్సిటీల వరకూ, చిన్న పని ప్రదేశాల నుండి కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల వరకూ రాజ్యమేలుతోంది. రోజురోజుకు బలోపేతం అవుతున్న హిందూత్వ ఫాసిజం మనుస్మృతిని అధికారికంగా నెలకొల్పే దిశగా పయనిస్తున్నది. దళిత బహుజనుల నీడ, గాలి సోకకుండా వారి మానవ హక్కు లన్నింటినీ నిషేధించిన పీష్వాల అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతి రేకంగా సాగిన భీమా కోరేగావ్ పోరాటాన్ని ఎత్తి పడుతూ అంబేడ్కర్ ఆ పోరాటాన్ని ఆత్మగౌరవ ప్రతీక అని ప్రకటించి, దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు. అనంతరం ఈ దేశ రాజ్యంగంలో దళితులకు హక్కులను పొందుపర్చడంతో పాటు కుల వర్గ పీడన అంతం కావాలని ఆశించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన మహిళలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలతో కూడిన బహుజన సమాజపు విముక్తికై వినూత్న మార్గంలో పోరాడారు. అయినా కొత్త పీష్వాలు అధికారాన్ని చలాయిస్తున్న సందర్భంలో మళ్లీ మనువాదం పూర్తి స్థాయిలో జడలు విప్పుకునే అవకాశం ఉంది. అందుకే బహుజన సమాజం అప్రమత్తతతో ఉండాలి. – కోట ఆనంద్, కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ‘ 96523 57076 (నేడు భీమా కోరెగావ్ పోరాటం జరిగిన రోజు) -
నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: రెండేళ్లుగా జైలులో గడుపుతున్న ఎల్గార్ పరిషత్–మావో సంబంధాల కేసులో నిందితుడు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రూ.2.4 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. గృహ నిర్బంధంపై 14 షరతులు విధించింది. 70 ఏళ్ల నవ్లఖా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా గృహ నిర్భంధానికి అనుమతిస్తున్నామని తెలిపింది. ఈ ఆదేశాలు తాత్కాలికమని నెల రోజుల తర్వాత సమీక్షిస్తామంటూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. గృహనిర్భంధానికి అనుమతి ఇవ్వాలన్న నవ్లఖా పిటిషన్‌ను గురువారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌ల సుప్రీం ధర్మాసనం విచారించింది. ‘నిందితుడు 2020 నుంచి కస్టడీలో ఉన్నారు. గతంలో గృహనిర్బంధం దుర్వినియోగం చేసిన ఫిర్యాదులేవీ లేవు. ఈ కేసు మినహా మరో నేరపూరిత ఆరోపణలు లేవు. అందుకే హౌస్అరెస్ట్కు అనుమతినిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీల ఏర్పాటు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నిఘా తదితరాల ఖర్చు మొత్తం నవ్లఖా భరించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులు.. ► పోలీసుల సమక్షంలో వారిచ్చిన ఫోన్ నుంచి రోజుకు 10 నిమిషాలు మాట్లాడొచ్చు. ► సహచరుడి ఇంటర్నెట్లేని ఫోన్ వాడొచ్చు. ఎస్ఎంఎస్లు, కాల్స్‌కు అనుమతి. వాటిని డిలీట్ చేయకూడదు. ముంబై వదిలి వెళ్లొద్దు. ► గరిష్టంగా ఇద్దరు కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి 3 గంటల పాటు సందర్శించొచ్చు. ► కేబుల్ టీవీ చూడొచ్చు. కేసులో సాక్షులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దు. -
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఏఐ కోర్టును అడగండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌పై విడుదలైన విప్లవ రచయిత వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లాలంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారించింది. వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు -
వరవరరావుకు ఊరట.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: విప్లవ రచయిత నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ కాల వ్యవధిని సుప్రీంకోర్టు తొలగించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు వేసిన పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపిన సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్‌ను మంజూరు చేసింది. గ్రేటర్ ముంబై దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది. కాగా భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో వరవర రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. చదవండి: పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి -
నేడు వరవరరావు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్–ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వడానికి బోంబే హైకోర్టు ఏప్రిల్ 13న నిరాకరించింది. ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ విచారిస్తుంది. 83 ఏళ్ల వయసున్న వరవరరావు నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్నారు. -
భీమా–కోరేగావ్ కేసులో పవార్‌కు సమన్లు
ముంబై: 2018 జనవరి 1న చోటుచేసుకున్న భీమా–కోరేగావ్ హింసాకాండ కేసులో దర్యాప్తు కమిషన్ నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు సమన్లు జారీ చేసింది. మే 5, 6న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆయన సాక్ష్యాన్ని నమోదు చేస్తామని తెలిపింది. దర్యాప్తు కమిషన్‌కు శరద్ పవార్ ఏప్రిల్ 11న సమర్పించిన అదనపు అఫిడవిట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ సంఘటన విషయంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన జరగడానికి దారితీసిన పరిస్థితుల గురించి తనకు సమాచారం లేదన్నారు. భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ(దేశద్రోహానికి సంబంధించినది) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని శరద్ పవార్ కోరారు. ఈ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయాలని లేదా ఇందులో మార్పులు చేయాలని విన్నవించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి 1870లో బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన సెక్షన్ 124ఏను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశ సమగ్రతను కాపాడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సరిపోతుందని సూచించారు. భీమా–కోరేగావ్ కేసులో దర్యాప్తు కమిషన్ 2020లో శరద్ పవార్‌కు సమన్లు జారీ చేసింది. కానీ, అప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆయన హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సమన్లు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. -
పర్మనెంట్ బెయిల్ ఇవ్వలేం
ముంబై: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో తనకు పర్మనెంట్ మెడికల్ బెయిల్ ఇవ్వాలన్న హక్కుల నేత వరవరరావు (83) విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి తాత్కాలిక మెడికల్ బెయిల్‌పై ఉన్న ఆయన దాన్ని మరో ఆర్నెల్ల పాటు పొడిగించాలని, ముంబైలో కాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతించాలని, విచారణ పూర్తయేదాకా పర్మనెంట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ ఎస్బీ శుక్రే, జీఏ సనప్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. అయితే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునేందుకు వీలుగా బెయిల్‌ను మూడు నెలలు పొడిగించింది. వీవీలో పార్కిన్సన్ లక్షణాలు కన్పిస్తున్నాయని ఆయన తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన్ను ఉంచిన తలోజా జైల్లో వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సదుపాయాలపై ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖ ఐజీని ఆదేశించింది. -
జైలులో మగ్గుతూనే ఉన్నారు!
‘భీమాకోరేగాం యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. ఆ యుద్ధం జరిగి 200 సంవత్సరాలైన సందర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్ర వర్ణాలవారు దాడి చేశారు...’ ‘స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి’ అని సాయిని నరేందర్ ‘సాక్షి’ దినపత్రికలో (1 జన వరి, 2022) రాసిన విశ్లేషణలో, ఆ దాడి జరిగిన వధూభద్రక్లో శంభాజీ మహరాజ్‌కు సమాధి నిర్మించిన దళితుని సమాధిని 2018 జనవరి 1న అగ్రవర్ణాలు కూల్చేసిన విషయాన్ని ప్రస్తావించ లేదు. భీమాకోరేగాం శౌర్యస్థలికి, ఒక రోజు ముందు (డిసెంబర్ 31, 2017) జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ (శనివార్ వాడ, పుణే)కు ముంబై నుంచి దళితులను, అణచబడిన కులాలవారిని తరలించిన ఆరోపణపై 8 మంది తెలంగాణకు చెందిన రిలయన్స్ కంపెనీ కార్మికులను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసిన ప్రస్తావనా ఆ వ్యాసంలో లేదు. ఈ అరెస్టు సందర్భంగా ఏటీఎస్ వాళ్లు చేసిన మానసిక చిత్రహింసలు భరించలేక తెలుగు, మరాఠీ సాహిత్యవేత్త మచ్చ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఎనమండుగురు యువకులు ఉద్యోగాలు కోల్పోయి రెండేళ్లు జైల్లో ఉండి విడుదలయ్యారు. భీమాకోరేగాం అమరుల 200వ సంస్మరణ సభ నిర్వహించిన 280 సంస్థల ఎల్గార్ పరిషత్ సమావేశం (31 డిసెంబర్ 2017–శనివార్ పేట, పుణే)లో ‘నయీ పీష్వాయీ నహీ చలేగీ’ అని రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేయించిన సాంస్కృ తిక కళాకారుడు, రిపబ్లిక్ పాంథర్స్ సంస్థాపకుడు సుధీర్ ధావ్లే, కబీర్ కళామంచ్ కళాకారులు రమేశ్, సాగర్, జ్యోతి ఇంకా జైల్లో మగ్గుతూనే ఉన్నారు. (చదవండి: ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్) ఈ కేసును 2020 జనవరి నుంచి కేంద్ర ఎన్ఐఏ కోర్టు– ముంబై చేపట్టింది కనుక, వీళ్లతో పాటు అంబేడ్కరిస్టు మార్క్సిస్టు మేధావి ఆనంద్ టేల్టుంబ్డే, ప్రొఫెసర్ సాయిబాబా, ఆయన సహచరులపై గడ్చిరోలీ కుట్ర కేసును వాదించిన ప్రముఖ క్రిమినల్ లాయర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (ఐఏపీఎల్) కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్, ‘కలర్స్ ఆఫ్ కేజ్’ (సంకెళ్ల సవ్వడి) రచయిత, ఐఏపీఎల్ కోశాధికారి అరుణ్ ఫెరీరా, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రీసెర్చ్ స్కాలర్ రోనా విల్సన్, ప్రొ. జీఎన్ సాయిబాబా డిఫెన్స్ కమిటీకి సహకరించిన ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ హనీబాబు, ప్రొఫెసర్ షోమా సేన్, వర్ణన్ గొన్జాల్వెజ్, మహేశ్ రౌత్, గౌతమ్ నవ్లఖా ఇంకా జైళ్లలో మగ్గుతూనే ఉన్నారు. కస్టోడియల్ మరణానికి గురయిన స్టాన్ స్వామి గురించి ఇక చెప్పేదేముంది? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!) – సాథీ, హైదరాబాద్ -
స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి
పీష్వా బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్. 500 మంది మహర్ వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారు. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటిష్ వాళ్లు తమతో కలిసి పోరాడాలని మహర్లను కోరారు. అప్పటి మహార్ నాయకుడు సిద్‌నాక్ పీష్వా సైన్యాధికారి బాపు గోఖలే వద్దకు వెళ్లి పశువులకన్నా హీనంగా చూడబడుతున్న తమకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. యుద్ధం చేసినా, చేయకపోయినా మీ బతుకులకు మేము ఇచ్చే స్థానం ఇంతేనని గోఖలే కరాఖండీగా చెప్పారు. వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచు కోవాలని ప్రతిన బూనిన ఐదు వందల మంది మహర్ సైన్యం, రెండు వందల మంది బ్రిటిష్ సైన్యంతో కలిసి 200 కిలోమీటర్లు నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పదాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కని పిస్తున్న పీష్వా సైన్యాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ బతికితే పోరాట వీరులుగా బత కాలనీ, లేదంటే హీనమైన బతుకులతో చావాలనీ నిర్ణయించుకున్న మహర్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి తలపడింది. తిండి లేకుండా కాలినడకన వచ్చి కూడా మహర్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఎదుర్కోవడాన్ని చూసిన బ్రిటిష్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఆశ్చర్యపోయారు. భీకర పోరాటంలో భీమా నది ఎర్రబడింది. పీష్వా సైన్యం వెనక్కి తగ్గింది. అమరులైన 12 మంది మహార్ సైనికులకు బ్రిటిష్ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహర్ సైనికులతో మహర్ రెజిమెంట్ ఏర్పాటు చేశారు. (చదవండి: డెస్మండ్ టూటూ.. వివక్షపై ధిక్కార స్వరం) 1927 జనవరి 1న ఈ స్మారక స్థూపాన్ని మొదటిసారి సందర్శించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ దీన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఎందరో దళితులు జనవరి ఒకటిన దీని దర్శనానికి వెళ్లడం మొదలైంది. దళిత గౌరవం నిలిచి గెలిచిన రోజు అయినందున దేశవ్యాప్తంగా శౌర్య దివస్‌గా జరుపుకొంటున్నారు. (చదవండి: జీవించే హక్కు అందరి సొంతం కాదా?) అత్యంత క్రూరమైన అంటరానితనం పీష్వా బ్రాహ్మణ రాజ్యమైన పుణె ప్రాంతంలో ఉండేది. దళితుల నీడ కూడా అగ్రవర్ణాలపై పడకూడదనీ, దళితులు పొద్దున, సాయంత్రం అగ్రవర్ణాల వారి ఇళ్లకు గానీ వారి దగ్గరకు గానీ పోగూడదనీ, తమ నీడ తమ పైన పడే పట్టగలు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉండేది. శివాజీ పాలనలో ఇలా ఉండేది కాదు. శివాజీ పాలనలో సైన్యంలో ఉన్న మహార్లను అనంతర పాలకులు తొలగించి మనుధర్మాన్ని పకడ్బందీగా అమలుపరిచారు. 200 సంవత్సరాల క్రితం జరిగిన భీమా కోరేగావ్ యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. యుద్ధం జరిగి 200 సంవత్సరాలు జరిగిన సంద ర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్రవర్ణాలవారు దాడి చేశారు. ఇప్పటికి దళితులూ, అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు భేదభావం లేదంటూ దళిత వాడల్లో భోజనాలు చేస్తూనే, మరోపక్క కోరేగావ్ లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. (చదవండి: కీలవేణ్మని పోరాటం.. స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటన) శౌర్య దివస్ స్ఫూర్తిగా బ్యాలట్ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ప్రత్యక్ష యుద్ధం చేసిన బహుజనులు నేడు ప్రజాస్వామ్య దేశంలో బహుజన రాజ్యం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. జ్యోతిరావు ఫూలే, పెరియార్, సాహూ మహారాజ్, నారాయణ గురు లాంటి మహానుభావుల మార్గంలో– బహుజనుల్లో ఎదిగిన వాళ్లు విలువలతో కూడిన రాజకీయాల నిర్మాణం చేయాలి. - సాయిని నరేందర్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు (జనవరి 1న భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం) -
సుధా భరద్వాజ్.. జైలు నుంచి విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్(60) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. మూడేళ్లకు పైగా ఆమె జైలు జీవితం గడిపిన ఆమెకు బాంబే హైకోర్టు డిసెంబర్ 1న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కండీషన్‌తో పాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, రూ. 50 వేల పూచీకత్తుతో సుధా భరద్వాజ్‌ను విడుదల చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. (Nagaland Firing: డ్రెస్ మార్చి, మృతదేహాల దగ్గర ఆయుధాలు పెట్టబోయారు) -
వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరవరరావు తన బెయిల్‌ను పొడగించాలని విజ్ఞప్తి చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ క్రమంలో వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా వరవరరావు కోర్టు తనకు ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని.. ఫలితంగా తాను కుంటుంబానికి దూరంగా ఉంటున్నానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 84 ఏళ్ల వయసులో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్ట్ విధించిన ఏ ఒక్క షరతును తాను ఉల్లంగించలేదని వరవరరావు కోర్టుకు తెలిపారు. (చదవండి: ఒకరి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే) ముంబై హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకోవాలంటే తన లాంటి వారికి చాలా కష్టం అవుతుందన్నారు. తన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే తన కుటుంబం దగ్గరికి వెల్లేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వరవరరావు వాదనలు విన్న కోర్టు ఈ నెల 25న ఆయనను సరెండర్ కావాలని ఆదేశించింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు గత 4 సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నారు. చదవండి: భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు! -
Stan Swamy: అస్సలు సంబంధం లేని..
ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి.. 84 ఏళ్ల వయసులో.. పైగా కాళ్లు చేతులు గొలుసులతో బంధించి ఉంటాయి. ఇంత కంటే దారుణం ఉంటుందా? అంటూ ఓ ఫొటోను నెట్లో వైరల్ చేస్తున్నారు కొందరు. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా శిక్ష అనుభవించిన స్టాన్ స్వామి.. గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కొందరు ఓ ఫొటోను వైరల్ చేస్తున్నారు. వైరల్.. గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు. అలాంటి వ్యక్తిని సంకెళ్లతో బంధించి మరీ చికిత్స అందించారు. ఈ వయసులో ఆయనను అంతలా కష్టపెట్టడం దారుణం. వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో.. అంటూ కొందరు నెటిజన్స్ ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్.. అయితే గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో అది మే నెలలో బాగా వైరల్ అయిన ఫొటోగా తేలింది. ఆ వ్యక్తి పేరు బాబురామ్ బల్వాన్(92). ఓ హత్య కేసులో యూపీ ఉటా జైళ్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో అతన్ని ఆస్పతత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. అయితే ఈ ఫొటో కూడా వివాదాస్పదం కాగా.. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు అప్పుడు. అయినా ఆ వివాదం సర్దుమణగపోకపోవడంతో వార్డెన్‌ను సస్పెండ్ చేశారు కూడా. -
భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు!
సాక్షి,ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న ప్రముఖ ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు ఫాదర్ స్టాన్ స్వామి (84) కన్నుమూయడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని లోటని పలువురు రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు తమ సంతాపం తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వామి మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన న్యాయానికి, మానవత్వానికి అర్హుడు అంటూ స్టాన్ మృతిపై సంతాపం తెలిపారు. స్వామి మరణం విచారకరం. గొప్ప మానవతావాది, దేవుడిలాంటి ఆయన పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. ఒక భారతీయుగా చాలా బాధపడుతున్నానంటూ కాంగ్రెస్ ఎంపీ,సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ఈ విషాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు?నిర్దోషిని, సామాజిక న్యాయం కోసం నిరంతరం తపించిన స్వామిని ప్రభుత్వమే హత్య చేసిందని జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. స్వామి మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేశారు.సమాజంలో అత్యంత అణగారినవారి కోసం జీవితాంతంపోరాడిన వ్యక్తి కస్టడీలో చనిపోవడం అత్యంత విచారకరమని ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం తీరని అపఖ్యాతికి గురవుతోందన్నారు. ఇంకా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ , సీపీఎం (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితరులు ట్విటర్ ద్వారా స్వామి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ధైర్యశాలి, ఉద్యమకారుడు స్వామికి మరణం లేదని, ఆయన తమ హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటారని దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ట్వీట్ చేశారు. ఆ మహామనిషి రక్తంతో తమ చేతులను తడుపుకున్న మోదీ షాలను జాతి ఎప్పటికీ విస్మరించదంటూ మండిపడ్డారు. దారుణ ఉపా చట్టం ఆయనను బలి తీసుకుంది. త్వరలో విచారణ మొదలు కానుందనే ఆశ విఫలం కావడంతో న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ మూగబోయారంటూ ప్రముఖ న్యాయవాది కబిల్ సిబల్ ట్వీట్ చేశారు. నోరెత్తిన వారినందరినీ "ఉగ్రవాదులు" గా ప్రభుత్వం ముద్ర వేస్తోందంటూ ఘాటుగా విమర్శించారు. కాగా కరోనా బారిన పడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 ఉండగా ఉదయం కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. 84 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ స్థిరంగా మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్న స్వామిని జైల్లో నిర్బంధించి, బెయిల్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుందని బీజేపీ సర్కార్‌పై పలువురు సామాజిక సంఘ నేతలు మండిపడుతున్నారు. Heartfelt condolences on the passing of Father Stan Swamy. He deserved justice and humaneness. — Rahul Gandhi (@RahulGandhi) July 5, 2021 Sad to learn of Fr #StanSwamy's passing. A humanitarian & man of God whom our government could not treat with humanity. Deeply saddened as an Indian. RIP. https://t.co/aOB6T0iHU9 — Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2021 Stan Smith (84) passes away The system sucks UAPA No bail Little hope of early trial Others too languish in jail Lawyers , Academics , Social Activists ....raise their voices for the voiceless They too are now “voiceless” The State calls them “ terrorists” — Kapil Sibal (@KapilSibal) July 5, 2021 Fr Stan Swamy shall never die. He will live in our hearts as a hero, the brave dissenter who stood against the fascist Modi government at the cost of his life. Modi & Shah have Fr. Stan Swamy's blood on their hands. The country will never forgive them. #StanSwamy — Jignesh Mevani (@jigneshmevani80) July 5, 2021 Deeply saddened by the passing of Fr. Stan Swamy. Unjustifiable that a man who fought all through his life for our society's most downtrodden, had to die in custody. Such travesty of justice should have no place in our democracy. Heartfelt condolences! — Pinarayi Vijayan (@vijayanpinarayi) July 5, 2021 -
భీమా కోరేగావ్ కేసు: స్టాన్ స్వామి కన్నుమూత
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై బొంబాయి హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే 84 ఏళ్ల స్వామి ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కోవిడ్‌కు చికిత్స పొందుతూ స్టాన్ స్వామి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని ఆయన బెయిల్ కేసును విచారిస్తున్న ధర్మాసనానికి స్వామి తరఫు న్యాయవాది మిహిర్ దేశాయి తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమాదార్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వార్తపై స్పందించేందుకు తమకు మాటలు రావడం లేదని, స్టాన్ స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని వ్యాఖ్యానించింది. రోమన్ కేథలిక్ ప్రీస్ట్‌గా ఉన్న స్టాన్ స్వామి మృతిపై జెస్యూట్ ప్రొవిన్షియల్ ఆఫ్ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. పేదలకు గౌరవప్రదమైన జీవితం లభించాలని పోరాటం చేశారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాన్ స్వామి మృతి విషయంలో చికిత్స అందించిన ఆసుపత్రిపై కానీ, బెయిల్ కేసు విచారణ జరుపుతున్న కోర్టుపై కానీ తమకెలాంటి ఫిర్యాదులు లేవని చెప్పగలమని.. అయితే, ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న ఎన్ఐఏపై, జైలు అధికారులపై మాత్రం అలా చెప్పలేమని న్యాయవాది మిహిర్ దేశాయి ధర్మాసనంతో వ్యాఖ్యానించారు. స్వామికి సరైన సమయంలో వైద్య సదుపాయం కల్పించే విషయంలో ఎన్ఐఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. విచారణ ఖైదీ అయిన తన క్లయింట్ స్వామి మృతికి దారితీసిన కారణాలపై హైకోర్టు న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 10 రోజుల ముందు స్వామిని జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లారని, కానీ, ఆయనకు అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్ష జరపలేదని కోర్టుకు వివరించారు. ఆ తరువాత హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో పరీక్షించగా, కోవిడ్ నిర్ధారణ అయిందన్నారు. స్టాన్ స్వామికి బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రతీసారి ఎన్ఐఏ వ్యతిరేకించిందని, కానీ, ఒక్కరోజు కూడా ఆయనను విచారించడానికి కస్టడీకి తీసుకోలేదని ఆరోపించారు. విచారణ ఖైదీగా ఉన్న సమయంలోనే స్టాన్ స్వామి మరణించినందువల్ల, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, న్యాయ విచారణకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్టాన్ స్వామి అంత్యక్రియలు ముంబైలో జరుగుతాయని కోర్టు తెలిపింది. ఎల్గార్ పరిషత్– మావోయిస్ట్ సంబంధాలకు సంబంధించిన కేసులో, కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2020 అక్టోబర్ నుంచి స్వామిని విచారణ ఖైదీగా మొదట తలోజా జైళ్లో నిర్బంధించారు. మొదట అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మే నెలలో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, జేజే ఆసుపత్రిలో తనను చేర్చడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి నా హృదయపూర్వక నివాళులు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీ హత్యను మోదీ, షా విజయవంతంగా ముగించారు. ఆయనకు బెయిల్ నిరాకరించిన జడ్జీలు ఇక రాత్రులు నిద్ర పోలేరనుకుంటా. వారికీ ఈ హత్యలో భాగం ఉంది’ అని సీపీఐఎంల్ పొలిట్‌బ్యూరో మెంబర్ కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. స్టాన్ స్వామి విషయంలో ఎన్ఐఏ వ్యవహరించిన తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న తనకు జైలులో ఆహారం తీసుకోవడానికి వీలుగా ఒక సిప్పర్‌ను, స్ట్రాను ఇవ్వాలని ఎన్ఐఏను ఆదేశించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు స్వామి మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. స్వామి చేసిన ఆ చిన్న అభ్యర్థనపై స్పందించడానికి ఎన్ఐఏ 4 వారాల గడువు కోరింది. అయితే, ఆ తరువాత స్వామికి సిప్పర్, స్ట్రాతో పాటు, వీల్ చెయిర్‌ను, చేతికర్రను, వాకర్‌ను, ఇద్దరు సహాయకులను సమకూర్చామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఆదివాసీల కోసం 30 ఏళ్ల పోరాటం ఫాదర్ స్టాన్ స్వామి పూర్తి పేరు స్టానిస్లాస్ లూర్దుసామి. జార్ఖండ్‌లో ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవిత పర్యంతం ఆయన కృషి చేశారు. నక్సలైట్లను ముద్రవేసి అక్రమంగా జైళ్లో మగ్గుతున్న ఆదివాసీల దుస్థితిపై ఆయన ఒక పరిశోధన గ్రంథం రాశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని తమపై తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని దాదాపు 97 శాతం విచారణ ఖైదీలు తనతో చెప్పినట్లు స్వామి అందులో పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన 3దశాబ్దాల పాటు కృషి చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో ఆయన జన్మించారు. ‘జంషెడ్పూర్ ప్రావిన్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్’లో చేరి, ప్రీస్ట్‌గా మారారు. 1970లలోనే యూనివర్సిటీ ఆఫ్ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు. బ్రసెల్స్‌లో చదువుకుంటున్న సమయంలో బ్రెజిల్‌లోని పేదల కోసం కృషి చేస్తున్న ఆర్చ్ బిషప్ హోల్డర్ కామరా సేవలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. 1975 నుంచి 1986 వరకు బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్‌గా పనిచేశారు. 30 ఏళ్లుగా జార్ఖండ్ గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. వారి భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్‌షిప్‌ల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువత విడుదలకి కృషి చేశారు. కేన్సర్‌తో, పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న స్టాన్ స్వామిని, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత అక్టోబర్ 8న రాంచిలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. -
విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: విరసం నేత, విప్లవ కవి వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కొరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక షరతులతో ఆరునెలల మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే (ముంబైలోనే) ఉండాలని, అలాగే గత ఎఫ్ఐఆర్కు దారి తీసిన కార్యకలాపాలు చేయగూడదంటూ షరతులు విధించింది. దీంతో వరవరరావు ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులకు భారీ ఊరట లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన భర్తకు బెయిల్ ఇవ్వాలన్న వరవరావు భార్య పిటీషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపడం సరికాదని భావించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు రావు విచారణకు హాజరుకావాలని, అయితే భౌతిక హాజరునుంచి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఉత్తర్వుపై మూడు వారాల పాటు స్టే విధించాలని కోరిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఇటీవల కరోనా సోకడంతోపాటు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త వరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత బొంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు ఓకే!
ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విప్లవ కవి వరవరరావును జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు సుముఖంగా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవరరావు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను డిశ్చార్జ్ చేయవచ్చని నానావతి హాస్పటల్ వర్గాలు గతవారం కోర్టుకు తెలిపాయి. డిశ్చార్జ్ అనంతరం ఆయన్ను నవీ ముంబైలోని తలోజా జైలుకు పంపాల్సిఉంటుంది. అయితే ఇందుకు బదులుగా ఆయన్ను జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది దీపక్ ధాకరే చెప్పారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన కుటుంబసభ్యులు ప్రొటోకాల్స్‌కు లోబడి ఆయన్ను కలవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం తరఫు ఈ సడలింపులకు ఓకేఅని, మిగిలిన అంశాలు ఎన్ఐఏ పరిధిలోనివని చెప్పారు. వరవరరావు పట్ల మానవీయ ధృక్పధాన్ని అవలంబించాలన్న కోర్టు సూచన మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఎన్ఐఏ న్యాయవాది అనిల్ సింగ్ వాదిస్తూ, రావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు సుముఖమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అప్రస్తుతమైన అంశమని చెప్పారు. బెయిల్ ఇవ్వండి వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన భార్య తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. జైల్లో సరైన వైద్యసదుపాయం లేకుండా ఆయన్నుంచడం రావు ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. జైల్లో ఉన్నవారికి ఆరోగ్య సదుపాయాలు అందించకపోవడం క్రూరత్వమన్నారు. తలోజా జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం మరలా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నట్లు నానావతి ఆస్పత్రి వర్గాలిచ్చిన రిపోర్టును న్యాయమూర్తులు గుర్తు చేశారు. డిశ్చార్జ్ అనంతరం జైల్లోకి మరలా వెళితే ఏమవుతుందో ఎవరూ చెప్పలేరని ఇందిరా వాదించారు. అందువల్ల కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే రావు బెయిల్‌కు ఎన్ఐఏ అభ్యంతరాలు చెప్పవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన్ను హైదరాబాద్ పంపితే తిరిగి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఎన్ఐఏ అభ్యంతరం చెప్పవచ్చని తెలిపింది. ప్రభుత్వాన్ని పడదోయడానికి యత్నించారన్నదే ఆయనపై అభియోగమని గుర్తు చేసింది. తాము బెయిల్ అడుగుతున్నది ఆరోగ్యకారణాలపై కనుక, ఎన్ఐఏ అభ్యంతరాలు వర్తించవని, అలాగే ఆయనపై అభియోగాలు నిజం కాదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రధాని హత్య గురించిన ఉత్తరం కనుగొన్నట్లు ఎన్ఐఏ చెబుతోందని, ఎవరైనా అలాంటి ఉత్తరాలు కంప్యూటర్లలో దాచుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కట్టుకధలన్నారు. కావాలంటే కఠిన నిబంధనలతో కూడిన బెయిల్‌నైనా మంజూరు చేయాలని కోరారు. అయితే రావుకు అన్ని రకాల వైద్యసాయం అందించేందుకు తాము కృషి చేశామని ధర్మాసనం గుర్తు చేసింది. ఉపా చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ ఇవ్వాలంటే పలు అభ్యంతరాలుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా మానవహక్కులపై పలు డిక్లరేషన్లను ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. రావు బెయిల్ పిటీషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి. -
జైల్లో స్టాన్ స్వామికి సిప్పర్
ముంబై : ఎల్గార్‌పరిషత్ కేసులో తలోజా జైలులో ఉన్న స్టాన్‌స్వామి(83)కి సిప్పర్‌తో పాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతోన్న ఆదివాసీ హక్కుల నేత స్టాన్‌స్వామిని మావోయిస్టులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అక్టోబర్ 8న అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), స్టాన్ స్వామి పట్ల అమానవీయం గా ప్రవర్తించడాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. అరెస్టు సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సిప్పర్‌ని తిరిగి అందజేయాల్సిందిగా కోరుతూ స్టాన్‌స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా చేతులు వణుకుతున్నందున సిప్పర్ ద్వారా ఆహారపదార్థాలను సేవించేందుకు అనుమతి నివ్వాలంటూ ఆయన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకి విన్నవించారు. శనివారం తలోజా జైలుని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీపీ చేరింగ్ దోర్జే, స్టాన్‌స్వామి అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనం తరం జైలు అధికారులు స్టాన్ స్వామికి సిప్పర్, స్ట్రా, వీల్ ఛైర్, వాకింగ్ స్టిక్, వాకర్తోపాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేశారు. -
వరవరరావుకి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు నిర్వహించాలి
ముంబై: బీమా కోరెగావ్ కేసులో తలోజా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విప్లవకవి వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వైద్య పరీక్షల నివేదికను నవంబర్ 16 లోపు కోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడి ఆరోగ్య పరిరక్షణకు నానావతి ఆసుపత్రి వైద్యుల పరీక్షలే ఉపయోగకరమని కోర్టు అభిప్రా యపడింది. వరవరరావు బెయిలు విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. వరవరరావు భార్య హేమలత, తన భర్తని మెరుగైన చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి మార్చాలని, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్వతంత్ర వైద్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని, వరవరరావుకు ఉన్న ఆరోగ్య సమస్యలరీత్యా ఆయన్ను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, అతను జైలులోనే చనిపోయే ప్రమాదం ఉన్నదని వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర వ్యాఖ్యానించారు. -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత రచయిత వరవరరావు (80)కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త నవరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్నా తన భర్త ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తలోజా జైలులో అమానవీయ పరిస్థితుల్లో వరవరావు మగ్గుతున్నారని ఆమె వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన హక్కులను ఉల్లంఘనకిందికి వస్తుందన్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. -
సుప్రీం కోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వరవరరావు భార్య హేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ముంబయి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. వరవరరావుకు చికిత్స అందజేస్తున్న హాస్పిటల్లో సౌకర్యాలను కూడా ముంబై హై కోర్టే పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వరవరరావు బెయిల్ అప్పీల్‌ను సరైన సమయంలో విచారించాలని సుప్రీం కోర్టు, ముంబయి హైకోర్టుకు సూచించించింది. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
వరవరరావుకు బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో అరెస్టయి, ముంబై జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ కవి, 81 ఏళ్ళ వరవరరావుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన భార్య పెండ్యాల హేమలత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయనను నిరవధికంగా కస్టడీలో ఉంచటం అమాన వీయం, క్రూరత్వమని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను అతిక్రమించడమేనని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. 2018 నవంబర్‌లో జ్యుడీషియల్ కస్టడీకి వెళ్ళేనాటికి 68 కేజీల బరువున్న వరవరరావు ఇప్పుడు 50 కేజీల బరువున్నారని, ఆయన 18 కేజీల బరువు తగ్గారని, వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారని వెల్లడించారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు, కోవిడ్ ప్రబలిన తరువాత తలెత్తిన ఇబ్బందుల కారణంగా వరవరరావుకి నిరంతర పర్యవేక్షణ అవసరమౌతోందని హేమలత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తెలిపారు. -
కోరెగావ్ కేసులో స్టాన్ స్వామి అరెస్ట్
ముంబై: భీమా కోరెగావ్ హింసకు సంబంధిం చి మానవ హక్కుల నేతలు గౌతమ్ నవ్లఖా, 82 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి సహా 8 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి వారు కుట్ర పన్నినట్లు అందులో ఆరోపించింది. ఇందులో మావోయిస్టులతో పాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉందని పేర్కొంది. ఫాదర్ స్టాన్ స్వామి సహా ఆ 8 మంది సమాజంలో శాంతిభద్రతలకు విఘా తం కల్పిస్తున్నారని 10 వేల పేజీల చార్జిషీట్లో ఎన్ఐఏ వెల్లడించింది. గౌతమ్ నవ్ల ఖాకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయంది. వీరంతా వ్యవస్థీకృత మావోయిస్టు నెట్‌వర్క్‌లో భాగమని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మావోలకు చేరవేసేవారని తమ దర్యాప్తులో తేలిం దని స్పష్టం చేసింది. స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఫాదర్ స్టాన్ స్వామిని రాంచీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చింది. శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీ షియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఎక్కువ వయస్సున్న వ్యక్తి 82 ఏళ్ల స్టాన్ స్వామినేనని అధికారులు తెలిపారు. మిలింద్ తెల్తుంబ్డే మినహా చార్జిషీట్లో పేర్కొన్న వారందరూ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్ దాఖలుచేయడం ఇది మూడోసారి. తొలిసారిగా పుణె పోలీసులు 2018 డిసెంబర్లో, రెండోసారి 2019ఫిబ్రవరిలో చార్జ్షీట్లు వేశారు. తర్వాత కేంద్రప్రభుత్వం ఈ కేసును ఈ ఏడాది జనవరిలో పుణే పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీచేసింది. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్ వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు రోజు, ఎల్గార్ పరిషత్ సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్ఐఏ పేర్కొంది. వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించా రని అభియోగాలు మోపింది.∙అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్ స్టాన్ స్వామి మావో కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను స్టాన్ స్వామి ఖండించారు. -
బీమా కోరేగావ్: స్టాన్ స్వామి అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో సామాజికవేత్తను అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి (83)ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, ఆదివాసీల హక్కుల కోసం స్టాన్ స్వామి గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన రోనా విల్సన్, అరుణ్ ఫెరారియతో స్తాన్ స్వామికి సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అయితే, ఎలాంటి వారెంట్ లేకుండా స్టాన్ స్వామిని అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!) ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించింది. ఎన్ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
మౌనం ఒక యుద్ధ నేరం
‘‘చిన్నప్పుడు మా అమ్మ నాకో కథ చెప్పింది / ఇంటి ముందు కుంపట్లోనో వంటింట్లో దాలిలోనో ఉన్నట్లుగానే / ప్రతిమనిషి గుండెలో నిప్పు ఉంటుంది’’ అంటారు ప్రసిద్ధ కవి వరవరరావు. ‘నిప్పు–మనిషి కనుగొన్న న్యాయం’ అని నమ్మిన వ్యక్తి ఆచరణ ఎట్లా ఉంటుందో ‘వివి’ని చూస్తే తెలుస్తుంది. మనిషి మనిషి గుండెలో నిప్పు చల్లారకుండా తన హృదయం, మేధస్సు, శ్రమ, ప్రతిభలతో నిలువెత్తు జ్వాలై ఎగసినవాడు, ఈ రోజు భీమా కోరేగావ్ కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నవీ ముంబై జైలులో ఉన్నారు. భారతదేశం గర్వించదగ్గ మేధావి, కవి, ఉపన్యాసకుడు, ప్రజాస్వామికవాది అయిన వరవరరావుని ఈ కేసులో ఇరికించి ఏడాదిన్నర దాటింది. పుణే నుంచి ముంబై తలోజా జైలుకి మార్చడం తప్ప కేసులో ఎటువంటి పురోగతి లేదు. నేరారోపణ ప్రక్రియ పూర్తి కాలేదు. కేసు విచారణకి రాలేదు. బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాజకీయ ఖైదీల కేసులలో వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వడం లేదు. కూర్చునేందుకు కుర్చీ, పడుకోటానికి మంచం కూడా ఇవ్వకుండా శరీరాన్ని హింస పెడుతూనే ఉన్నారు. వయసును, కరోనా విపత్తును, ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లను దృష్టిలో ఉంచుకొని వివి, తదితర భీమా కోరేగావ్ అండర్ ట్రైల్ ఖైదీలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి విడుదల చేయమని పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా నెలరోజుల నుండి అనారోగ్యానికి గురయిన వరవరరావుని విడుదల చేయమని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పదే పదే బెయిల్ నిరాకరిస్తున్నారు, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందించడం లేదు. శరీరంలో తగ్గుతున్న సోడియం నిల్వల స్థాయికి సరైన వైద్యం అందించకపోవడంతో తనవాళ్ళను గుర్తించలేని, పొంతన లేని మాటలు మాట్లాడే స్థితిలోకి ఆయనను తెచ్చింది ప్రభుత్వం. ఫాసిస్ట్ రాజ్యానికి మానవీయత కాదు కదా రాజ్యాంగ బద్ధత అనేది కూడా ఏ మాత్రం లేదని ఇటువంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వివికి కోవిడ్ పాజిటివ్ అని తేలటం మరీ ఆందోళన కలిగిస్తున్నది. తమ కస్టడీలో ఉన్న మనిషి ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం – చట్టబద్ధం, నైతికం కాదు. కేసు విచారణ ముగిసి, తీర్పు రాకుండానే విడుదల చేయడం చట్టబద్ధం కాకపోవచ్చు. కానీ ఇపుడున్న విపత్తు పరిస్థితుల్లోనూ వయసు రీత్యానూ ఆయన బెయిలు మంజూరు విషయంలో కాలయాపన చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. వరవరరావు ఆరోగ్యం విషయంలో ఇప్పటికైనా తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తక్షణం ఆయనను కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించి నిపుణుల పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో చికిత్స అందజేయాలి. వైద్యరంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కనుక మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించేలా సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలి. ప్రతి ఒక్క మనిషికి ఉన్నట్లుగానే వివికి కూడా ఆరోగ్యంగా, గౌరవంగా జీవించే హక్కు ఉన్నదని గుర్తించాలి. తెలంగాణ చారిత్రకత పట్ల ఎంతో గౌరవాన్ని ప్రకటించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, చరిత్రాత్మక వ్యక్తి అయిన వివిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేసు తెలంగాణ పరిధిలోనిది కాకపోయినా వివి రక్షణ విషయంలో కలగజేసుకుని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం ఇప్పుడు అవసరమైన సందర్భం. ఆరు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వివి వేసిన ముద్ర అనితరసాధ్యం. వివి విడుదలను కోరడం, దాని కోసం పోరాడడం అంటే అది ఒక వ్యక్తి కోసం చేసే పోరాటం కాదు. సుదీర్ఘ కాలం ప్రజాక్షేత్రంలో తమ జీవితాలను పణం పెట్టి, అసమాన త్యాగాలకు, సాహసాలకి సిద్ధపడినవారు, వ్యక్తులుగా కాక ప్రజల ఆశలకి, ఆశయాలకి ప్రతీకలుగా మారతారు. అటువంటి ప్రతీక అయిన వరవరరావుకి హాని తలపెట్టడం, అక్రమ నిర్బంధాలకి పాల్పడటం ద్వారా అటువంటి స్ఫూర్తిని దెబ్బతీయడం ఫాసిస్ట్ ప్రభుత్వాల లక్ష్యం. అందుకే వివి తదితర రాజకీయ ఖైదీల విడుదల కోసం మైనార్టీ స్వరాలైనా సరే.. గట్టిగా నినదిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో అటు నాగపూర్ అండా సెల్లో అనేక తీవ్ర ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న మరొక కవి, మేధావి, అనువాదకుడు, అధ్యాపకుడు అయిన సాయిబాబా విషయంలో అత్యవసర ఆరోగ్యపర చర్యలు చేపట్టడం ఇపుడు చాలా అవసరం. కోవిడ్ హానికి అనువుగా ఉన్న నాగపూర్ జైలు వాతావరణం నుండి ఆయనను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. జైళ్లు పరివర్తన కేంద్రాలు అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చెప్పే మాట. అవి మనదేశ మానవ వనరుల విధ్వంస కేంద్రాలు కాకూడదు. వివి, సాయిబాబా తదితరుల క్షేమం పట్ల అంతర్జాతీయంగా వస్తున్న విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసం ఎవరికి చేతనైన స్థాయిలో వారు కృషి చేయాలి. వరవరరావు స్వయంగా చెప్పినట్లుగా – ‘‘నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వెంటాడుతుంటే ఊరక కూర్చున్న /నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’’ కాత్యాయనీ విద్మహే, కె.ఎన్. మల్లీశ్వరి – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
ఆ ఇద్దరి అరెస్ట్ దారుణం..
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబే, జర్నలిస్ట్ గౌతమ్ నవ్లఖలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్(ఎఫ్ఎస్సీ) పేర్కొంది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ వీరిని నిర్బంధించారని ఆరోపించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆ ఇద్దరినీ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఎఫ్ఎస్సీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కన్వీనర్ అల్లం నారాయణ, రమణి, భూమన్, సాంబమూర్తి, ఆర్.వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, ఆశాలత, జిట్టా బాల్‌రెడ్డిలతో పాటు మరో 30 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా కోరేగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ప్రకాశ్ అంబేద్కర్, పౌరహక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ తెల్తుంబ్డే, నవలఖతో పాటు పలువురు పౌర కార్యకర్తల ఉపా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్చి 17న సుప్రీంకోర్టు కూడా వారి అభ్యర్థనలను తిరస్కరించి మూడు వారాలలోగా లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోవడానికి ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు మరో వారం గడువు పొడిగించింది. -
ఇలా చేయడం తప్పు..
కొల్హాపూర్/పుణే: మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ మొదటిసారి విమర్శలు చేశారు. కోరెగావ్–భీమా అల్లర్ల కేసును రాష్ట్ర పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీ చేయడంపై ఆయన శుక్రవారం మండిపడ్డారు. ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తూ పుణే కోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన ఈ విమర్శలు చేశారు. కేసును బదిలీ చేయడంపై తమకేమీ అభ్యంతరం లేదని ప్రాసిక్యూషన్ చెప్పడంతో కేసు బదిలీ అయింది. ఇలా చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదమని శరద్ పవార్ పేర్కొన్నారు. పుణే పోలీసులు విచారిస్తున్న కేసును కేంద్రం తీసుకోవడం కూడా సరికాదని అన్నారు. ఇది రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిన అంశమని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రిగా ఉన్న ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. కోరెగావ్–భీమా అల్లర్ల కేసును ఎన్ఐఏకు అప్పగించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. (చదవండి: ‘మాది స్వచ్ఛమైన హిందుత్వ’) -
ఎన్ఐఏకు కోరెగావ్ కేసు
పుణే: 2018 కోరెగావ్–భీమా అల్లర్ల కేసు పుణే పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. ఈ మేరకు తమకు కేంద్ర హోంశాఖ నుంచి శుక్రవారం సమాచారం వచ్చినట్లు మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ తెలిపారు. 2018లో చెలరేగిన కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో వామపక్ష నేతలు వరవరరావు, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొన్సాల్వెస్, సుధా భరద్వాజ్‌లను అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బీజేపీ ప్రభుత్వంలో కోరెగావ్–భీమాపై పెట్టిన కేసును తిరగదోడితే తమ బండారం బయటపడుతుందనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. -
‘విమర్శిస్తే.. అర్బన్ నక్సల్ ముద్రవేస్తారు’
న్యూఢీల్లీ: బీజేపీ అసమర్థ పాలనను, ద్వేషపూరిత ఎజెండాను విమర్శించినవారిపై అర్బన్ నక్సలైట్ అనే ముద్రవేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ట్విటర్ వేదికగా ఆయన బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. భీమా- కోరెగావ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసందే. ప్రతిఘటనకు చిహ్నమైన భీమా- కోరెగావ్ యుద్ధ స్మారకం ప్రాముఖ్యాన్ని కేంద్రానికి తొత్తుగా పనిచేసే ఎన్ఐఏ తగ్గించలేదని ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’) ఈ కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం పుణె సీనియర్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శివసేన ప్రభుత్వం భీమా- కోరెగావ్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్తలు, మేధావులపై కేసును ఉపసంహరించుకుంటున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. -
వరవరరావు కేసు: ఎఫ్‌బీఐకు హార్డ్‌డిస్క్!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్ హింసాకాండ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును నవంబర్ 17 ,2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని వరవరరావు ఇంట్లో సోదాలు చేసిన అనంతరం పోలీసులు స్వాధినం చేసుకున్న హార్డ్ డిస్క్ ధ్వంసం కావడంతో.. అందులోని డేటాను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డేటాను రాబట్టేందుకు పూణె పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)ను ఆశ్రయించారు. వరవరరావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్న హార్డ్ డిస్క్‌ను ఇప్పటికే నాలుగు ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. మొదట పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. ఎటువంటి డేటాను గ్రహించక పోవడంతో.. ఆ తర్వాత ముంబైలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ డైరెక్టరేట్‌కు చేరవేశారు. అక్కడనుంచి డేటాను తెరవలేకపోవడంతో.. అనంతరం గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో తెరిచే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ధ్వంసమయిన హార్డ్ డిస్క్ నుంచి డేటాను పొందడం కష్టతరమవడంతో.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐకు పంపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా 2017 డిసెంబర్ 31న పూణేలో మావోయిస్టుల మద్దతుతో ఎల్గర్ పరిషత్ సమావేశం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగం, కులాల మధ్య అల్లర్లకు కారణమై.. భీమా కోరెగావ్‌లో హింసాకాండ చెలరేగింది. ఇక భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎల్గర్ పరిషత్-కోరెగావ్ భీమా కేసులో.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే నెపంతో వరవరరావును అరెస్టు చేశారు. అదేవిధంగా విప్లవ సంఘాల నేతలకు మావోయిస్టులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే అభియోగాలతో సుధా భరద్వాజ్, సుధీర్ ధవాలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, షోమా సేన్‌పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. -
నవ్‌లఖాకు అరెస్టు నుంచి 4 వారాల రక్షణ
న్యూఢిల్లీ: కోరేగావ్– బీమా అల్లర్ల కేసులో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవ్‌లఖాను మరో నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవ్లఖా పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ముందస్తు బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందిగా కోరింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా నవ్‌లఖాను విచారించకుండా ఏడాది నుంచి ప్రభుత్వం ఏం చేసిందని ధర్మాసనం నిలదీసింది. నవ్‌లఖాను అక్టోబర్ 15 వరకు అరెస్టు చేయరాదంటూ అక్టోబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హక్కుల కార్యకర్త నవ్‌లఖాకు 2017లో జరిగిన కోరేగావ్–బీమా అల్లర్లకు, మావోయిస్టులతో సంబంధాలను రుజువు చేసేందుకు తగు ఆధారాలున్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆలోచనను శిక్షించడం సమంజసమా ?
రాజ్యం తమకు వ్యతిరేకమైన ఆలోచన చేసేవారిని శిక్షించడం లేదా ఆలోచన మారే విధంగా శిక్షణ ఇవ్వడం ఈ రోజు జరుగుతున్న కొత్త పరిణామం. రాజ్యం లక్ష్యాలు, మనుగడ, కొనసాగింపు నిరాటంకంగా ఉండాలంటే దానికి అడ్డుగా వున్న వ్యక్తులనైనా, వ్యవస్థలనైనా సంస్కరించే ప్రయత్నం చేయడం, కాకపోతే శిక్షించడం గతంలో జరిగింది. ఇక్కడ రాజ్యంకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. అవి దాని కొనసాగింపులో అలాగే ఉంటే ఆ శిక్షలు ఒకే రకంగా వుండే వీలుంది. కానీ దాని లక్ష్యాలు రాజ్యపాలకుడు మారినప్పుడల్లా మారుతూ ఉంటే శిక్షలు కూడా మారుతూ ఉంటాయి. ఈ కోవలోనే యుఏపీఏ చట్టం మార్చబడింది. దీనికి ముందు పోటా చట్టం అంతకంటే ముందు టాడా చట్టం తయారు చేశారు. ఇది ప్రధానంగా మావోయిస్టులను, ముస్లిం తీవ్రవాద కార్యక్రమాలను అడ్డుకోవడానికి వచ్చింది. కారణం ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు పరిశీలన చేసి దీన్ని తీసుకువచ్చారు. దీని కింద అరెస్ట్ అయినవారిలో కేవలం రెండు శాతం మందికే శిక్షలు ఖరారు అయ్యాయి. అంటే, అక్రమంగా అరెస్ట్ అయిన వేలాదిమంది జీవితాలు నాశనం అయినట్టే. ఆ తరువాత ఎన్డీయే ప్రభుత్వం పోటా తీసుకువచ్చింది. దీని క్రింద ఎక్కువగా రాజ్యం చాలా మందిని శిక్షించడం పేరుతో చంపివేసింది. దీని తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి బిల్లు సంస్థలనే కాకుండా వ్యక్తులను కూడా కేంద్రంగా చేసుకొని తెచ్చారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఎంత మొత్తుకున్నా హడావిడిగా బిల్లును తెచ్చారు. ఇది ఎంత ప్రమాదం అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా తీవ్రవాదిగా చూపించడానికి ఈ చట్టం వీలు కల్పి స్తుంది. ఒక సంస్థలో సభ్యులు కాకుండానే వ్యక్తిని కేంద్రంగా చూపిస్తూ తీవ్రవాదిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించవచ్చు. మనిషి ఆలోచనల ఆధారంగా అతనిపై చట్ట వ్యతిరేక ముద్ర వేయడానికి ఇది ఉపయోగ పడుతుంది. సంస్థలను కాకుండా, వ్యక్తులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటే.. సంస్థలను నిర్వీర్యం చేస్తే వ్యక్తులు మరొక సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నారనీ, కాబట్టి వ్యక్తులే లక్ష్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవడం వీలవుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా సంస్థలుగా రాజ్యంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చూపెడుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొనే కాకుండా వివిధ సామాజిక వర్గాలు రాజ్యంపై నిరసన ప్రకటించకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చట్టాన్ని సవరించారు. ఇప్పటికే సామాజిక సంస్థలు తమ గొంతు నొక్కడానికే ఈ చట్టం తెచ్చారని ఆరోపిస్తున్నాయి. 2018లో మహారాష్ట్ర భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే ఈ చట్టం క్రింద చాలా మందిని అరెస్ట్ చేశారు. దీని ప్రకారం ఇప్పట్నుండీ రాజ్యంను వ్యతిరేకిస్తున్న వంకతో తమను సామాజికంగా అణచివేస్తున్నారని, తమపై అత్యాచారాలు, హత్యలు సామూహిక దాడులు జరుపుతున్నారని అటువంటి వారిని రాజ్యం శిక్షించడం లేదని ఉద్యమాలు చేసే ప్రతి వ్యవస్థను, వ్యక్తులను ఈ చట్టం తో అరెస్ట్ చేసే అవకాశం వుంది. అంటే మొత్తంగా ఈ దేశ దళితులు, ఆదివాసీలు ఇక వారికి దక్కవలసిన కనీస హక్కులు అమలు చేయమని రాజ్యంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా అవకాశం లేనివిధంగా దీన్ని తీసుకువచ్చారు. సామాజిక అసమానతల ఆధారంగా రాబోయే ఉద్యమాలను అణచివేయడానికే ఈ చట్టం ప్రధానంగా తీసుకువచ్చారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లోని అన్ని క్లాజులను అవమానించే విధంగా వుంది. అంటే రాజ్యంకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాయకూడదు. కనీసం ఆలోచనలు కూడ చేయకుండా ఉండేందుకు ఇది వచ్చింది. అసలు ఆలోచన ఆధారంగా ఒక వ్యక్తిని చట్ట ప్రకారంగా శిక్షించడం ఏ కోణంలో సమంజసం? అలాగే ఈ సమాజంలో సామాజిక వ్యవస్థ వల్ల ఎన్నో అరాచకాలు, సామూహిక హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే వీటిని అడ్డుకునేందుకు కారణమైనవారిని శిక్షించడానికి రాజ్య మెందుకు మౌనంగా ఉంటుందని ఆందోళనలు చేసినా, ఈ రాజ్యం చర్యలు తీసుకునేట్టు లేదని ఆలోచించడం ఇప్పుడు నేరమౌతుంది. దొంతి భద్రయ్య వ్యాసకర్త న్యాయవాది, కరీంనగర్ మొబైల్ : 9966677149 -
దళిత ప్రొఫెసర్ ఆనంద్ అరెస్టు అక్రమం
పుణే: దళిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అరెస్ట్‌పై పుణే కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే శనివారం తెల్లవారు జామున కేరళ నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఎల్గార్ పరిషత్‌లో జరిగిన సమావేశానికి మావోయిస్టులు మద్దతు తెలిపారనీ, ఆ సమావేశంలో వివిధ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే కోరేగావ్–భీమా యుద్ధం స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయనేది పోలీసుల ఆరోపణ. తెల్తుంబ్డే మావోయిస్టుల మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు అక్రమమంటూ తెల్తుంబ్డే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. ఆలోగా న్యాయస్థానం నుంచి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, పుణే పోలీసులు ఈలోగానే అరెస్టు చేయడం అక్రమమని అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి కిశోర్ వదానే పేర్కొన్నారు. -
బీమాకోరేగావ్ అల్లర్ల కేసులో మరో అరెస్ట్
-
నగరాల్లో మావోయిస్టు పార్టీ నెట్‌వర్క్‌కు చెక్!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల వేట దిశ మారింది. అర్బన్ మావోయిజాన్ని అణచివేసే చర్యలు చేపట్టారు. అడవుల్లో మావోయిస్టుల కోసం వేట సాగించే పోలీస్ శాఖ ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో అనుబంధ సంఘాలపై దృష్టి పెట్టింది. బీమా కోరేగావ్ ఉదంతం మొదలు తాజాగా అరెస్టయిన మావోయిస్టు మహిళా సానుభూతిపరుల వ్యవహారం వరకు అర్బన్ హంటింగ్‌ను స్పష్టం చేస్తోంది. మావోయిస్టు పార్టీకి తోడ్పాటు... మావోయిస్టు పార్టీ తను చెప్పాలనుకున్న అంశాలు, జనాల్లోకి వ్యాప్తి చేయించాల్సిన కార్యకలాపాలను ఫ్రాక్షన్ కమిటీల ద్వారా పంపిస్తుంది. అయితే, అనుబంధ సంఘాలు వివిధ రూపాల్లో మావోయిస్టు పార్టీకి మద్దతుగా పనిచేస్తు న్నాయని ముందునుంచి పోలీస్ శాఖ ఆరోపిస్తూ వస్తోంది. కానీ, నేరుగా ఆ సంఘాల సభ్యులనుగానీ, బాధ్యులను గానీ మావోయిస్టులుగా గుర్తించి అరెస్ట్ చేయలేదు. బీమా కోరేగావ్ వ్యవహారంలో మావోయిస్టు అనుబంధ సం«ఘ సభ్యులుగా ఉన్న తెలంగాణకు చెందిన వరవరరావు, ఫరీదాబాద్‌కు చెందిన సుధా భరద్వాజ్, ముంబైకి చెందిన అరుణ్ ఫెరారియా, గన్సల్వేస్, న్యూఢిల్లీ జర్నలిస్టు నవలఖను పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా మావోయిస్టు పార్టీకి తోడ్పాటు అందిస్తూ నగరాల్లో, పట్టణాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ సాయిబాబా ఎపిసోడ్... ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా పౌర హక్కుల సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనతోపాటు జేఎన్‌యూ విద్యార్థి హేమా మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహీలను పోలీసులు అరెస్టు చేయగా.. వీరంతా నాగ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. వెంకట్రావ్, భవానీ, అన్నపూర్ణ, అనూష... రాడికల్ స్టూడెంట్ యూనియన్ విధానాలకు ఆకర్షితుడైన ఎన్జీఆర్ఐ ఉద్యోగి నక్కా వెంకట్రావ్ 33 ఏళ్లుగా మావో యిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ ఆరోపించింది. ఏపీలోని పాడేరు పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళలు(అక్కాచెల్లెళ్లు) ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా ఉండటంతోపాటు చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్)లో పనిచేస్తున్నారు. అనూష మావోయిస్టు పార్టీ దళసభ్యురాలిగా పనిచేస్తోందని తెలిపారు. వీళ్ల తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి అరెస్ట్ రెండు రాష్ట్రాల పౌర హక్కుల నేతలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. అనూష చేసిన నేరాలు... మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలిగా ఉన్న అనూష ఈ ఏడాది ఫిబ్రవరిలో తిక్కరపాడు వద్ద మాటువేసి పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఏడాది మేలో పాన్పోదార్, జుడంబో గ్రామంలో పోలీసు వాహనాలపై దాడులు, నవంబర్‌లో ఒడిశా సుర్మతి ఏవోబీ సరిహద్దులో రెక్కీ చేసి పోలీసులపై మందుపాతరలతో దాడి చేసింది. రిక్రూట్మెంట్ వెనుక అనుబంధ సంఘాలు? రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో నిరుద్యోగ యువతను ఉద్యమాల పేరుతో మావోయిస్టుపార్టీ వైపు మళ్లించేందుకు అనుబంధ సంఘాలు ప్రయత్నిస్తున్నా యని తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా గతంలో మావోయిస్టు పార్టీలో చేరేందుకు యత్నించిన 32 మందిని తెలంగాణ ఎస్ఐబీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చింది. వీరికి ఆంధ్రా ఒడిశా బార్డర్(ఏవోబీ) కమిటీ కారద్యర్శి హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ప్రోత్సాహం ఉందని బయటపడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన వ్యవహారంలో రామకృష్ణ యాక్షన్ ప్లానే అమలు చేశారని ని ఘా వ్యవస్థ గుర్తించింది. ఇలా 2 రాష్ట్రాల్లో ఎంతమందిని రిక్రూట్ చేశారు? వారిప్పుడు ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుబంధ సంఘాలను నియంత్రిస్తే గానీ రిక్రూట్‌మెంట్‌ను ఆపలేమని ఇరు రాష్ట్రాల పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మంగళవారం ఆరోపించారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని అనిశ్చితి నెలకొందన్నారు. చట్టబద్ధమైన, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధంగా నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తున్నారని విమర్శించారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ప్రజలపై నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గత ఐదేళ్లుగా అనుసరించిన నిర్బంధాన్ని తిరిగి కొనసాగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఈ నిర్బంధం వల్ల సమాజంలో హింస పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పాలనకు విరుద్దంగా రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా పరిపాలన ఉందని విమర్శించారు. ‘మా పిల్లలకు సంబంధం లేదు’ తమ పిల్లలకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన భవానీ, అన్నపూర్ణ, అనూషల తల్లిదండ్రులు రమణయ్య, లక్ష్మీనర్సమ్మలు అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పెద్ద కూతురు భవానీ టైలరింగ్ చేస్తుండగా, మిగతా ఇద్దరు అన్నపూర్ణ, అనూషలు మహిళా సంఘాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పిల్లలను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. -
ఆపరేషన్ అర్బన్ మావోయిజం
సాక్షి, హైదరాబాద్: అడవుల్లో పట్టుకోల్పోతున్నాం.. కంచుకోటలనుకున్న ప్రాంతాలపై పట్టు సడలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధాంతాన్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి? ఇదీ 14 ఏళ్లకు ముందే మావోయిస్టులు, వారి సిద్ధాంతకర్తల మధ్య జరిగిన మేధోమథనం. ఇందులో నుంచి పుట్టిందే ‘అర్బన్ మావోయిజం’. నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న సంఘటిత, అసంఘటిత వర్గాలను ఏకంచేసి ఉద్యమాలు నిర్వహించడమే ఈ వ్యూహం. 14 ఏళ్ల క్రితం మావో యిస్టులు రచించిన ఈ వ్యూహం.. గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం మాత్రం పోలీసుల రాడార్లోకి వచ్చింది ఈ ఏడాది జనవరిలోనే. భీమా–కోరేగావ్ ఘటన తర్వాత మహారాష్ట్ర పోలీసుల విచారణలో వెల్లడైన ఈ ‘గోల్డెన్ కారిడార్’వ్యవహారం.. ఏపీ, తెలంగాణ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మావోయిస్టులంటే అడువుల్లోనే ఉండాలి.. పోలీసులు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయాలన్న ఆలోచననుంచి కాస్త విభిన్నంగా.. నగరాలు, పట్టణాల్లో సైతం ఉద్యమాల నిర్వహణకు కార్యరూపం దాలుస్తున్నట్టు వరుసగా అర్బన్ మావోయిస్టుల అరెస్టులతో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యవహారంలో జరిగిన వరుస అరెస్టులతో.. పోలీస్ శాఖకు స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అర్బన్ మావోయిజం మావోయిస్టు పార్టీ 2004లో తీసుకున్న కీలక నిర్ణయం అర్బన్ నక్సలిజం. నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర వర్గాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం రూపంలో తమకు అనుకూలంగా మార్చుకోవలన్నది ఈ వ్యూహం వెనక ఉద్దేశమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయం 2018 వరకు బయటకు రాకపోవడం యావద్భారత పోలీసు వ్యవస్థను ఆందోళనకు గురిచేసింది. ఇటీవల గుజరాత్లో ప్రధాని మోదీ అ«ధ్యక్షతన జరిగిన అఖిలభారత డీజీపీల సదస్సులో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. భీమా–కోరేగావ్ వ్యవ హారంలో మావోయిస్టు పార్టీకి పౌర హక్కుల నేతలు సహకరిస్తున్నారని.. వీరి ద్వారా నగరాలు, పట్టణాల్లో విద్యార్థులు, కార్మికులు, దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపిస్తున్నారని పుణే (మహారాష్ట్ర) పోలీసులు ఆధారాలు సేకరిం చారు. అందులో భాగంగా మోదీ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలతో పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, అరుణ ఫెరీరాలపై వివిధ అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. చాపకింద నీరులా అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు నిధుల సమీకరణ, విప్లవ సాహిత్యం ప్రచురణ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని హెచ్చరించింది. ‘గోల్డెన్ కారిడార్’వ్యూహంతో.. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌చేసింది. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన వారు. వీరు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతమైన కామ్‌రాజ్‌నగర్, విక్రోలి, రాంబాయి అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటూ అక్కడ వలస కార్మికులుగా ఉన్న తెలంగాణ వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపించినట్టు గుర్తించారు. ఈ ఏడుగురికి.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సత్సంబంధాలున్నట్లు వెల్లడైంది. వీరి నుంచి భారీగా మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. అయితే వీరంతా అర్బన్ మావోయిజం వ్యూహంలో భాగంగా ఏర్పడిన గోల్డెన్ కారిడార్ కమిటీలో పనిచేస్తున్నారని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులను మావోయిస్టు పార్టీలో చేర్పించి.. ఉద్యమాలు, విధ్వంసకాండ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. తాజాగా.. నక్కా వెంకట్రావ్! అర్బన్ మావోయిజం వ్యవహారం ఏమాత్రం బయటకు పొక్కకుండా వ్యూహాత్మకంగా సాగుతోందని గుర్తించిన నిఘా వర్గాలు.. తాజాగా మరో తెలుగు వ్యక్తి, ఎన్జీఆర్ఐ(జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ)లో టెక్నికల్ ఉద్యోగి నక్కా వెంకట్రావ్‌ను అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటన తెలంగాణ, ఆంధప్రదేశ్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. వెంకట్రావ్ నుంచి డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన రాడికల్ స్టూడెంట్ యానియన్‌లో 80వ దశకం నుంచే క్రియాశీలకంగా ఉన్నారని.. ఇటీవల అరెస్టయిన మావోయిస్టు కీలక నేత కుమార్ సాయి అలియాస్ పహీద్ సింగ్‌తో వెంకట్రావ్‌కు సంబంధాలున్నట్టు గుర్తించామని దుర్గ్ ఐజీ జీపీ సింగ్ స్పష్టంచేశారు. అయితే వెంకట్రావ్ జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ల్లో అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు నెట్వర్క్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు గుర్తించారు. వరుసగా అర్బన్ మావోయిజం దేశవ్యాప్త లింకులు వెల్లడవడం.. దీనికితోడు అరెస్టయిన వారంతా తెలుగువారే కావడం ఈ రెండు రాష్ట్రాల పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మన సంగతేంటి? ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు, మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టవడంపై చర్చ జరుగుతుండగా, తెలంగాణలో పరిస్థితి ఏంటన్న దానిపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల వేళ అలజడులకు అవకాశం ఇవ్వకుండా పనిచేసిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్బన్ మావోయిజం వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, జీఆర్డీ (గ్రామ రక్షక దళాలు), మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న పలు కమిటీల కీలక సభ్యులపై దృష్టి సారించినట్టు తెలిసింది. యూనివర్సిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, దళిత సంఘాలు, కుల సంఘాల్లో ఉన్న కొంత మందిని ఉద్యమం వైపు ప్రేరేపించి నియామకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పీడిత, బాధిత వర్గాలను అర్బన్ మావోయిజం వైపు ఆకర్శించేదిశగా పలువురు అర్బన్ మావోయిస్టు మేధావులు పనిచేస్తున్నారని.. వారిపైనా నిఘా పెట్టామని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో పేర్కొన్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న ఈ వ్యవహారం కొంత ఆందోళన పెడుతున్నప్పటికీ.. కట్టడి చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆయన సోమవారం వెల్లడించారు. -
భీమా–కోరెగావ్ కేసులో పోలీసులకు ఊరట
న్యూఢిల్లీ: భీమా–కోరెగావ్ అల్లర్ల కేసులో మహారాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు డిసెంబర్ 1 వరకు పోలీసులకు సమయమిచ్చింది. అయితే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయలేకపోవడం వల్ల నిందితులకు బెయిల్ లభించే వరకు పరిస్థితిని తీసుకురావొద్దని కోర్టు ఆదేశించింది. నేర శిక్షా స్మృతి ప్రకారం తీవ్రమైన నేరారోపణలున్న కేసులు నమోదైన 90 రోజుల్లోపు పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేయలేకపోతే అరెస్టైన నిందితులకు బెయిలు లభిస్తుంది. భీమా–కోరెగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు సోమ సేన్, దళిత హక్కుల కార్యకర్త సుధీర్ ధావలే, సామాజిక కార్యకర్త మహేశ్ రౌత, కేరళకు చెందిన రోనా విల్సన్‌లను ఈ ఏడాది జూన్‌లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 2 నాటికి 90 రోజుల గడువు ముగియడంతో హక్కుల కార్యకర్తలకు బెయిలు రాకుండా ఉండేందుకు పుణేలోని ప్రత్యేక కోర్టు అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు పోలీసులకు మరో 90 రోజుల గడువిచ్చింది. హక్కు ల కార్యకర్తలు హైకోర్టుకు వెళ్లడంతో పుణే కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు మరింత సమయం కావాలనీ, అప్పటి వరకు నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో పుణే కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. -
గౌతమ్ నవ్‌లఖాకు విముక్తి
న్యూఢిల్లీ: గృహ నిర్బంధంలో ఉన్న హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. భీమా–కోరెగావ్ హింసకు కారణమంటూ గౌతమ్ నవ్లఖా సహా అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు మేరకు ఆయన తరఫున ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయెల్‌ల ధర్మాసనం విచారించింది. నవ్‌లఖాను ట్రాన్సిట్ రిమాండ్‌కు ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆగస్టు 29న వెలువరించిన ఉత్తర్వులను కోర్టు కొట్టి వేసింది. ‘రాజ్యాంగంలోని ప్రాథమిక నియమాలకు వ్యతిరేకంగా, నేర శిక్షా స్మృతికి వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. చట్ట ప్రకారం నవ్లఖా 24 గంటల గృహ నిర్బంధం పూర్తయింది. ఫలితంగా ఆయన గృహ నిర్బంధం ముగిసినట్లే. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాబోవు’ అని కోర్టు స్పష్టం చేసింది. -
బీమా- కోరెగావ్ కేసు: గౌతమ్ నవలఖాకు విముక్తి
సాక్షి, న్యూఢిల్లీ : బీమా- కోరెగావ్ అల్లర్ల కేసులో గృహ నిర్బంధం ఎదుర్కొంటున్న గౌతమ్ నవలఖాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గృహ నిర్బంధం నుంచి ఆయనను విముక్తుడిని చేస్తున్నట్లు జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా.. ‘ఈ కేసులో చీఫ్ మెట్రోపాలిటన్ రిమాండ్ ఆర్డర్ ఇవ్వలేదు. అలాగే పిటిషనర్ 24 గంటలకు మించి చాలా కాలం పాటు గృహ నిర్బంధం ఎదుర్కొన్నారు. ఇది చట్ట వ్యతిరేకం. అలాగే ఈ కేసులో రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలు కూడా విస్మరించబడ్డాయి. కాబట్టి ఈ అంశానికి స్వస్తి పలకాల్సి ఉంది. కాబట్టి ఈరోజుతో ఆయన గృహ నిర్బంధం నుంచి విముక్తులయ్యారు’ అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.(చదవండి : ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది!!) కాగా మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆగస్టు 28న విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరంతా కోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన పౌర హక్కుల నేతలు ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో గౌతమ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు అనుకూలంగా సోమవారం తీర్పు వచ్చింది. -
వరవరరావుపై ఒక్క కేసూ నిలువలేదు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విరసం నేత వరవరరావు, మరో నలుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు పలు అభియోగాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న భారీ అభియోగంతోపాటు నేపాల్, మణిపూర్‌ల నుంచి నక్సలైట్లకు ఆయుధాలను సరఫరా చేయడంలో సహకరిస్తున్నారని, అర్బన్ మావోయిస్టుల కార్యకలాపాలకు నిధులిస్తున్నారన్నది ఇతర అభియోగాలు. ప్రస్తుతం వీరంత గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం 78 ఏళ్ల వరవరరావు గత 48 ఏళ్ల కాలంలో దాదాపు 25 కేసులను ఎదుర్కొన్నారు. ఏ ఒక్క కేసుల్లోనూ ఆయన దోషిగా తేలలేదు. ఆయనపై అన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఒక్క 2005 సంవత్సరంలోనే వరవరరావుపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. చిలకలూరిపేట, అచ్చంపేట పోలీసు స్టేషన్లపై నక్సలైట్ల దాడి, ఒంగోలు వద్ద ఓ సీనియర్ పోలీసు అధికారి కాన్వాయ్‌పై నక్సలైట్ల దాడి, బాలానగర్‌లో ఓ పోలీసు కాల్చివేత సంఘటనల నేపథ్యంలో వరవరరావుపై ఈ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించిన చిలుకలూరి పేట పోలీసు స్టేషన్‌పై దాడికి నక్సలైట్లను వరవర రావు రెచ్చగొట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి డైరెక్షన్ ఇచ్చారని, ఇందులో ఇతర విరసం సభ్యుల పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ఆరోపణ. పోలీసు స్టేషన్ పేల్చివేతకు నక్సలైట్లకు సెల్‌ఫోన్ ద్వారా డైరెక్షన్ ఇచ్చినట్లు సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారి స్వయంగా ఆరోపణలు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించిన అచ్చంపేట పోలీసు స్టేషన్‌పై దాడిని కూడా వరవరరావు ప్రోత్సహించారని మరో కేసు దాఖలు చేశారు. ముగ్గురు పౌరుల మరణానికి దారితీసిన ఒంగోలు సమీపంలో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి వరవరరావుతోపాటు మరో విరసం నేత కళ్యాణ్‌రావు బాధ్యులని నేరారోపణలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లను విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న వరవరరావు ఇంట్లో జరిగిన రహస్య సమావేశంలో తాము పాల్గొన్నట్లు ఆ ఇద్దరు నక్సలైట్లు వెల్లడించారు. వరవరరావు కుట్ర కారణంగానే కానిస్టేబుల్‌ను కాల్చివేసిందనేది మరో కేసు. ఈ కేసుల్లోని లొసుగులను మీడియా పట్టుకొని వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో పోలీసులు విచారణకు ముందే మూడు కేసులను ఉప సంహరించుకున్నారు. ఒంగోలులో ఎస్పీ కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో మాత్రం వరవరరావుపై కొన్నేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఆ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. హత్యలకు, హత్యాయత్నాలకు ప్రోత్సహించారని, రెచ్చగొట్టారంటూ అంతకుముందు దాఖలైన నాలుగు కేసులు కూడా కోర్టు ముందు నిలబలేక పోయాయి. ఆయుధాల సరఫరా కేసులు ఆయుధాల డీలర్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయుధాల చట్టం–1959, పేలుడు పదార్థాల చట్టం–1908, కింద వరవర రావుపై దాదాపు తొమ్మిది కేసులను దాఖలు చేశారు. 1985లో ఆర్ఎస్యూ విద్యార్థి లాకప్ మరణానికి నిరసనగా చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయడం కోసం వరవరరావు స్వయంగా బాంబులు పంచారన్నది కూడా ఓ కేసు. 1974 నాటి సికిందరాబాద్ కుట్ర కేసు, 1986 నాటి నామ్‌నగర్ కుట్ర కేసు వీటిలో ప్రధానమైనవి. హత్య, హత్యాయత్నాలు, దోపిడీలను ప్రోత్సహించడం, కుట్ర పన్నడంతోపాటు దేశద్రోహం అభియోగాలను కూడా ఆయనపై మోపారు. వీటిలో ఏ ఒక్క కేసు కూడా కోర్టు ముందు నిలబడలేదు. దాదాపు ఇప్పుడు కూడా ఆయనపై ఇలాంటి కేసులనే పుణె పోలీసులు దాఖలు చేశారు. మావోయిస్టు కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తున్నారన్నది కాస్త కొత్త కేసు. 1998లో కాలేజీ అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసి, పింఛను డబ్బులతో బతుకుతున్న వరవరరావు, మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆయన కుటుంబ సభ్యుల ప్రశ్న. ఇదివరకటిలా ఈ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా విడుదలవుతారని వారు ఆశిస్తున్నారు. -
వారి అరెస్టుపై 2:1 మెజారిటీతో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి హక్కుల కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అరెస్టుల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో శుక్రవారం తీర్పు ఇచ్చింది. తమ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకు హక్కుల కార్యకర్తలకు ప్రస్తుతమున్న గృహనిర్బంధాన్ని 4 వారాల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు తీర్పునిస్తూ తమ కేసును ఎవరు విచారించాలో ఎంచుకునే అధికారం నిందితులకు ఉండదని తేల్చారు. అసమ్మతి, రాజకీయ భిన్నాభిప్రాయం కారణంగా పోలీసులు ఈ అరెస్టులు చేపట్టలేదనీ, నిందితులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలను పరిశీలించామనీ, విచారణ సందర్భంగా ఏదో ఒకపక్షం వైపు తాము ప్రభావితమయ్యే అవకాశమున్నందున వాటి లోతుల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న మహారాష్ట్రలోని పుణె సమీపంలో దళిత సంఘాలు ‘ఎల్గర్ పరిషత్’ పేరుతో సమావేశం నిర్వహించాయి. సదస్సు అనంతరం అక్కడి భీమా–కోరేగావ్ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి పుణె పోలీసులు గత నెల 28న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో వీరిని విడుదల చేసి, అరెస్టులపై సిట్ ఏర్పాటు చేయాలంటూ చరిత్రకారిణి రొమీలా థాపర్‌తో పాటు కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఐదుగురిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. తీర్పును స్వాగతించిన బీజేపీ.. దేశానికి వ్యతిరేకంగా, ప్రధాని మోదీ హత్యకు అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు విజయవంతంగా ఛేదించారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. గృహనిర్బంధం పూర్తయ్యాక వీరి కస్టడీ కోసం కోర్టుకెళతామన్నారు. ఈ ఐదుగురికి మద్దతు ఇచ్చి జాతీయ భద్రతతో చెలగాటమాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలని బీజేపీ విమర్శించింది. వీరికి మద్దతు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అసమ్మతి గొంతు నొక్కేస్తున్నారు ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ విభేదించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రభుత్వం అసమ్మతి గొంతును నొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి, భిన్నాభిప్రాయం అసలైన ప్రజాస్వామ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో, సరైన విచారణ జరపకుండా ఈ ఐదుగురిని వేధిస్తే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కుకు అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు రాసుకున్నట్లు భావిస్తున్న లేఖలను మహారాష్ట్ర పోలీసులు మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణపై అనుమానాలు తలెత్తేలా పోలీస్ అధికారులు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందనీ, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని తన 43 పేజీల తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి అన్నది ప్రెజర్ కుక్కర్‌కు ఉన్న సేఫ్టీ వాల్వ్ లాంటిదనీ, దాన్ని పోలీస్ బలంతో అణిచివేయలేరని పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసులు మీడియాను వాడుకోవడం ద్వారా విచారణ నిష్పాక్షికత దెబ్బతింటుందనీ, కేసుల్లో దోషులెవరో నిర్ధారించి తీర్పు చెప్పేందుకు పోలీసులు న్యాయమూర్తులు కాదని వ్యాఖ్యానించారు. ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనీ, కొత్తగా కేసును రిజస్టర్ చేయని విషయాన్ని ముగ్గురు జడ్జీలు తీర్పులో ప్రస్తావించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ -
బీమా కోరేగావ్ కేసులో సుప్రీం కీలక ఉత్తర్వులు
-
పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడిగింపు
న్యూఢిల్లీ: భీమ్-కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావు సహా పౌరహక్కుల నేతల గృహనిర్భందాన్ని సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు పొడిగించింది. సిట్ దర్యాప్తు జరిపించాలన్న పిటిషనర్ల డిమాండ్‌ను తోసిపుచ్చుతూ, పుణె పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టయిన నేతలు ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని కూడా తెలిపింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత నెల 28న విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా కోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్నారు. -
హక్కుల కార్యకర్తల అరెస్టుపై తీర్పు నేడే!
న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చే అవకాశముంది. మహారాష్ట్రలో గతేడాది జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం, ఆ తర్వాత చెలరేగిన భీమా–కోరేగావ్ అల్లర్ల నేపథ్యంలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్‌లను పుణె పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొ.సతీశ్ దేశ్‌పాండేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో తీర్పును ఈ నెల 20న రిజర్వు చేసిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. శుక్రవారం తుది తీర్పును వెలువరించే అవకాశముంది. -
వరవరరావు కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: కోరేగావ్–భీమా అల్లర్ల కేసులో గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావుతో పాటు మరో నలుగురు సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రముఖ చరిత్రకారుడు రొమిల్లా థాపర్‌తో పాటు మరికొందరు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్, పోలీసుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించి వివరాలను 24 లోపు తమ ముందుంచాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వరవరరావు, అరుణ్ ఫెర్రీరా, వెర్నాన్ గొన్సాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతం నవ్‌లఖాలు ఆగస్టు 29 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. -
బీమా కోరేగాం కేసు; ఆసక్తికర వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరేగాం కేసుపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. రోనా విల్సన్ ల్యాప్‌టాప్ నుంచి రికవర్ చేసిన లేఖలను అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి నివేదించారు. హార్డ్ డిస్క్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఫోర్జ్ చేసినవి కావని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ రిపోర్ట్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. ఈ లేఖలతో మొత్తం ఐదుగురు అరెస్టయినవారికి ఎలాంటి సంబంధం ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. నేర పరిశోధనలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల జోక్యం ఉండరాదని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అపరిచితుల ఆదేశాలతో దాఖలైన వ్యాజ్యం నిలబడదని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిష్పాక్షికంగా ఈ కేసు దర్యాప్తు జరిగిందని స్పష్టం చేశారు. ఎఫ్.ఐ.ఆర్‌లో ఫిర్యాదుదారుడి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే దర్యాప్తులో సంఘ విద్రోహ చర్యలు లేదా చట్ట వ్యతిరేక చర్యలున్నట్టు తేలితే, ఆ దర్యాప్తు కొనసాగించాల్సిందేనన్నారు. పిటిషనర్ల అభ్యర్థన మేరకు సిట్ ఏర్పాటు చేయడమంటే మన దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సీబీఐ మీద నమ్మకం లేదని అంగీకరించినట్టే అవుతుందన్నారు. ఇక పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ కేసులో దర్యాప్తు తీరును ఆక్షేపించారు. ఈ మొత్తం దర్యాప్తు ఉద్దేశమే ఒక భయానక వాతావరణం సృష్టించడమే. అందుకే మావోయిస్టు లేఖల కథలు అల్లుతున్నారని ఆరోపించారు. అదనపు సొలిసిటర్ జనరల్ సమర్పించిన లేఖల్ని ప్రెస్ కాన్ఫరెన్సులో పోలీసులు అందరికీ చూపించి, సర్క్యులేట్ చేశారని, మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఈ పీసీలో ఉన్నారని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ లేఖలన్నీ మీడియాకు ఎలా చేరాయని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. కేసు డైరీని తమకు అప్పగించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌ను సుప్రీం ఆదేశిస్తూ వాదోపవాదాల అనంతరం సిట్ దర్యాప్తు అవసరమా లేదా అన్న విషయంపై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది. -
ఆ కేసును డేగకళ్లతో పరిశీలిస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: కోరెగావ్–భీమా అలర్లకు సంబంధించి గృహనిర్బంధంలో ఉన్న ఐదుగురు హక్కుల కార్యకర్తలపై ఆరోపణలు వచ్చిన కేసును డేగ కళ్లతో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. వ్యతిరేకత–అసమ్మతిలకు, సమాజంలో కల్లోలం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని మహరాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలియజెప్పింది. హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ ఫెరీరా, వెర్నన్ గోన్సాల్వెజ్, సుధ భరద్వాజ్, గౌతమ్ నవ్లఖలను భీమా–కోరెగావ్ కేసులో తొలుత అరెస్టు చేసి అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో గృహనిర్బంధంలో ఉంచడం తెలిసిందే. వారి గృహ నిర్బంధం బుధవారంతో ముగుస్తున్నందున సుప్రీంకోర్టు గడువును మరోరోజు పొడిగించింది. ‘అసమ్మతి, వ్యతిరేకతలను కూడా పరిగణలోకి తీసుకునేలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలు దృఢంగా ఉండాలి. అది ఈ న్యాయస్థానమైనా సరే. ఊహలు, కల్పనల కారణంగా స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడటాన్ని మేం సహించం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాయిబాబా పేరుతో కథలు అల్లారు మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పేరును వాడుకుని ఐదుగురు హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా పోలీసులు కథలు అల్లుతున్నారని కొందరు ప్రముఖులు సుప్రీంకోర్టుకు తెలిపారు. -
19 వరకూ గృహనిర్బంధం
న్యూఢిల్లీ: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సెప్టెంబర్ 19 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అరెస్టు సందర్భంగా పోలీసులు పేర్కొన్న ఆధారాల్ని పరిశీలించాల్సిన అవసరముందని, ఆ ఆధారాలు కల్పితమని కనుగొంటే సిట్ విచారణకు ఆదేశిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘ఆరోపణల ఆధారంగానే ప్రతీ నేర దర్యాప్తు సాగుతుంది. తగినన్ని ఆధారాలు ఉన్నాయా లేదా అని మనం చూడాల్సి ఉంది. మహారాష్ట్ర పోలీసుల వాదన వినకుండా, ఆధారాల్ని పరిశీలించకుండా.. స్వతంత్ర దర్యాప్తుపై ఎలా నిర్ణయం తీసుకుంటాం. పోలీసుల వద్ద ఉన్న ఆధారాల్ని మేం చూడాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. గత నెల్లో మహారాష్ట్రకు చెందిన పుణే పోలీసులు హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల్ని అరెస్టు చేయగా.. వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడగింపు
న్యూఢిల్లీ: భీమ్-కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావు సహా పౌరహక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 19 వరకు పొడిగించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. దీనిపై దిగువ కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరహక్కుల నేతలకు గృహనిర్బంధం కేసు వరకే తాము విచారిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం, మావోయిజం అనేది చాలా తీవ్రమైన సమస్య అని తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు అసాంఘిక కార్యాకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. -
పౌర హక్కుల నేతల నిర్బంధం పొడిగింపు
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి ఐదుగురు పౌర హక్కుల నేతలకు విధించిన గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. నిర్బంధ గడువు సెప్టెంబర్ 12తో ముగిసిన నేపథ్యంలో సెప్టెంబర్ 17 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్వీల్కర్, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్లఖా, వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
‘కోరెగావ్’ పై పోలీసుల భిన్న స్వరాలు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరెగావ్ కేసులో ‘అర్బన్ మావోయిస్టులు’ అంటూ ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, మరో నలుగురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం నాడు విచారణ ప్రారంభించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పుణె పోలీసులు రెండు పరస్పర భిన్నంగా దాఖలు చేసిన అఫిడవిట్లపై కూడా సుప్రీం కోర్టు విచారణ కొనసాగనుంది. కోరెగావ్ కేసులో హైదరాబాద్‌లో వరవర రావుతోపాటు దేశవ్యాప్తంగా మరో నలుగురు సామాజిక కార్యకర్తలను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్ట్ చేయడం, రొమిల్లా థాపర్ నాయకత్వాన ప్రజాహిత పిటిషన్‌ను దాఖలు చేయడం, దానికి స్పందించి సెప్టెంబర్ మూడవ తేదీన పుణె పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. ఆ అఫిడవిట్ ప్రకారం భీమా కోరెగావ్ గ్రామానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణె నగరంలో ఎల్గార్ పరిషద్ పేరిట గతేడాది డిసెంబర్ 31వ తేదీన బహిరంగ సభ జరిగింది. ఆ సభను నిర్వహించిన నిషేధిత సీపీఐ (మావోయిస్టు) కార్యకర్తలు దళితులను రెచ్చగొట్టారు. ఫలితంగా ఆ మరుసటి రోజు అంటే జనవరి 1వ తేదీన భీమా కోరెగావ్ గ్రామంలో అల్లర్లు చెలరేగాయి. అందులో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. కోట్లాది రూపాయ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ నాడు దళితులను రెచ్చగొడుతూ ప్రసంగించారన్న కారణంగానే వరవర రావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ప్రజాహిత వ్యాజ్యం కారణంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడానికి వీల్లేదని, వారిని గృహ నిర్బంధానికి పరిమితం చేయాల్సిందిగా ఆదేశించింది. దేశంలోని దాదాపు 250 దళిత సంఘాలను ఏకతాటిపైకి తీసుకరావాలనే లక్ష్యంతో ఎల్గార్ పరిషద్ ఏర్పాటయింది. ఆ రోజు ఎల్గార్ పరిషద్ పేరిటనే బహిరంగ సభ జరిగినప్పటికీ సభ నిర్వహణలో కీలక పాత్ర వహించినదీ ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జీ, మరో మాజీ హైకోర్టు చీఫ్ జడ్జీలు. ఈ విషయాన్ని వారే (బీజీ కోస్లే–పాటిల్, పీబీ సావంత్‌లు) స్వయంగా చెప్పడంతోపాటు సభ నిర్వహణకు అరెస్టైన సమాజిక కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని కూడా వారు చెప్పారు. పుణె పోలీసులు భీమా కోరెగావ్ కేసులో రెండో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆరు నెలల ముందు ఫిబ్రవరి 13వ తేదీన మొదటి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో హిందూ అఘాది సంస్థ నాయకుడు మిలింద్ ఎక్బోటే అల్లర్లకు ప్రధాన కారకుడని ఆరోపించారు. ‘ఎక్బోటో అల్లర్లను సృష్టించేందుకు నేరపూరిత కుట్ర పన్నారని మా దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఆయన కర పత్రాలను పంచడం ద్వారా కలసిమెలసి ఉంటున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించి, అల్లర్లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి’ అని ఆ అఫిడవిట్లో పోలీసులు పేర్కొన్నారు. దళితులు నమ్ముతున్న భీమా కోరెగావ్ చరిత్రను వక్రీకరిస్తూ ఎక్బోటే కరపత్రాలను పంచారని, ఆయన అనుచరులు ఫేస్బుక్ ద్వారా అల్లర్లకు ఆజ్యం పోశారని పుణె డిప్యూటీ మేయర్ సిద్ధార్ట్ ధిండే కూడా ఆరోపించారు. మొదటి అఫిడవిట్లో మిలింద్ ఎక్బోటేనే అల్లర్లకు ముఖ్య కారకుడని పోలీసులు పేర్కొన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితుడవడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేయడానికి వారు సాహసించలేక పోయారు. ఆర్నెళ్లలో కథ పూర్తిగా మారిపోయింది. పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేశారు. మొదటి అఫిడవిట్లో నిందితులు హిందూ సంస్థ నాయకులు కాగా, రెండో అఫిడవిట్లో అర్బన్ మావోయిస్టులు నిందితులుగా మారారు. పరస్పర భిన్నమైన ఈ అఫిడవిట్లపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో, పోలీసులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి. -
‘మావో’ లింకులపై బలమైన సాక్ష్యాలు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలపై బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతోనే ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేశామని మహారాష్ట్ర బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవలం అసమ్మతి, అభిప్రాయభేదం కారణంగా ఈ అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా చెలరేగిన హింసకు మావోలతో కలసి కుట్రపన్నారంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల వంటి మానవహక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఐదుగురిని విడుదలచేసి గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా అసమ్మతి, భిన్నాభిప్రాయం అన్నది ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని కోర్టు పేర్కొంది. తాజాగా ఈ హక్కుల కార్యకర్తల అరెస్ట్‌ను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, సామాజికవేత్త సతీశ్ దేశ్‌పాండే, న్యాయ నిపుణుడు మజా దరువాలాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం విచారణ సాగుతుండగానే వీరు ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేశారు. మేం అరెస్ట్ చేసిన ఐదుగురు నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చురుగ్గా పనిచేస్తూ నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు. వీరు ఎల్గర్ పరిషత్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటుచేశారు. రాజకీయ సిద్ధాంతాలు, భావజాలాల మధ్య భిన్నాభిప్రాయంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేయలేదు. వీరు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి. తనిఖీల సందర్భంగా వీరి ఇళ్లలోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరి కార్డుల్లో లభ్యమైన సమాచారాన్ని బట్టి వీరు సమాజాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు తేలింది’ అని తెలిపారు. ‘రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, ఇతరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో దేశంతో పాటు భద్రతాబలగాలపై దాడికి ప్రణాళిక, ఇతర కార్యకర్తలతో సమన్వయం తదితరాలపై కీలక సమాచారం లభిం చింది. అంతేకాకుండా వీరు తమ పార్టీలోకి నియామకాలను చేపట్టడంతో పాటు వారిని అండర్‌గ్రౌండ్ శిక్షణకు పంపడం, నిధుల సమీకరణ–పంపకం, ఆయుధాల ఎంపిక, కొనుగోలు, వీటిని దేశంలోకి అక్రమరవాణా చేసేందుకు మార్గాలను ఎంపికచేయడంలో భాగస్వాములయ్యారు. అరెస్టయినవారిలో కొందరు కూంబింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులను మావోలకు అందజేస్తున్నట్లు ఆ పత్రాల్లో లభ్యమైంది’ అని పోలీసులు చెప్పారు. ధనరూపంలో వెలకట్టలేనిది జీవితం రేప్ బాధితులపై సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీః జీవితం అమూల్యమైనదని, ఏ కోర్టూ దాన్ని ధనరూపంలో వెలకట్టలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచార, యాసిడ్ దాడి బాధిత మహిళలకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) రూపొందించిన పరిహార పథకంపై విచారణ సందర్భంగా బుధవారం పైవిధంగా స్పందించింది. పైన పేర్కొన్న రెండు నేరాల్లో బాధిత మహిళకు కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా(మరణించిన పక్షంలో) రూ.10 లక్షలు చెల్లించాలని నల్సా సిఫార్సు చేసింది. ఈ పరిహార పథకాన్ని ఓ లాయర్ ప్రశ్నించగా..‘జీవితానికి వెలను నిర్ధారించలేం. దాన్ని ధనరూపంలో చెప్పలేం’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆమోదించిన నల్సా పరిహార పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఏపీలో 901 కేసుల్లో ఒక్కరికే... రేప్, యాసిడ్ దాడి బాధితుల్లో కేవలం 5 నుంచి 10 శాతం మందికే పరిహారం అందుతోందని నల్సా ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 901 కేసులు నమోదైతే ఒక బాధితురాలికే పరిహారం దక్కినట్టు వెల్లడించింది. పోక్సో చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1028 కేసులు నమోదైతే కేవలం 11 మంది బాధితులకే పరిహారం అందినట్లు తెలిపింది. -
అరెస్ట్‌లకు ఆధారాలు ఉన్నాయి: మహారాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తలు అరెస్ట్‌లపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సమాజంలో అశాంతి, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారన్న కారణంతో వారిని అరెస్ట్ చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్ట్ అయిన ఐదుగురిపై పోలీసుల వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అసమ్మతి, అభిప్రాయ భేదాల కారణంగా వారిని అరెస్ట్ చేయలేదని వెల్లడించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, భీమా కోరెగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర చేసారనే అభియోగాలతో విప్లవకవి వరవరరావుతోపాటు, సుధా భరద్వాజ్, గౌతం నావ్లాక్, తెల్తూంద్డే, వెర్నన్ గొన్జాల్వేస్‌ను పుణే పోలీసులు గతవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని.. సెప్టెంబరు 5 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. -
మహారాష్ట్ర పోలీసులకు బాంబే హైకోర్టు షాక్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పోలీసులకు మరోసారి షాక్ తగిలింది. దేశ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అయిదుగురు పౌరహక్కుల నేతల అరెస్టుల కేసులో రాష్ట్ర పోలీసుల వ్యవహరాన్ని కోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరంబీర్ సింగ్ మీడియా సమావేశంపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమర్ధించింది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు ఈ కేసును ఇన్ కెమెరా విచారణను కోరుతున్న పోలీసులు మరోవైపు మీడియా సమావేశంలో సాక్ష్యాలను బహిరంగ పర్చడటంపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కోరారు. దేశవ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లలో సోదాలు, అరెస్టుల పర్వాన్ని సమర్ధించుకున్న రాష్ట్ర ఏడీజీ పరంబీర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. వీరికి మావోయిస్టులకు సంబంధాలున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయనీ, అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. తమవద్ద వేలకొద్దీ సాక్ష్యాలున్నాయంటూ కొన్ని లేఖలను మీడియా ముందు ప్రదర్శించారు. కాగా భీమా కోరేగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర చేసారనే అభియోగాలతో విప్లవకవి వరవరరావుతోపాటు, సుధా భరద్వాజ్, గౌతం నావ్లాక్, తెల్తూంద్డే, వెర్నన్ గొన్జాల్వేస్‌ను పుణే పోలీసులు గతవారం అరెస్ట్ చేసింది. అయితే ఈ అరెస్టులపై వచ్చిన అభ్యంతరాలను సమర్ధించిన సుప్రీంకోర్టు వీరిని సెప్టెంబరు 6వరకు హౌస్ అరెస్ట్‌లోఉంచాల్సిందిగా ఆదేశించింది. గత జూన్‌లో మావోయిస్టు వ్యతిరేక దాడుల్లో పూణే పోలీసులు ముంబై కు చెందిన సుధీర్ దవాలేను, ఢిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర గడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, నాగపూర్ నుంచి ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్‌ను అరెస్టు చేసారు. మరోవైపు ఇది బీజేపీ రాజకీయ కుట్ర అని ఆ లేఖలన్నీ కల్పితాలనీ న్యాయమూర్తి సుధా భరద్వాజ్ ఖండించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేతకు యత్నమని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
వరవరరావు తదితరులు విడుదలయ్యేనా!
సాక్షి, న్యూఢిల్లీ : భీమ్ కోరెగావ్ కేసులో అరెస్టై ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు సామాజిక కార్యకర్తలకు సంబంధించి సుప్రీం కోర్టు తదుపరి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, రాంచీ, ఫరిదాబాద్, గోవాల్లో పుణె పోలీసులు ఆగస్టు 28వ తేదీన దాడులు నిర్వహించి విరసం సభ్యుడు వరవరరావుతోపాటు న్యాయవాది సుధా భరద్వాజ్, సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గోన్సాల్వ్స్, అరుణ్ ఫెరైరా, గౌతమ్ నౌలేఖలను అరెస్ట్ చేయడం ఆగస్టు 29వ తేదీన సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు వారికి గహనిర్బంధం విధించడం తెల్సిందే. సెప్టెంబర్ 6వ తేదీతో వారి గహ నిర్బంధం ముగిసి పోనుండడంతో ఏడవ తేదీన వారిని సుప్రీం కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంది. ఆ రోజున సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులను మంజూరు చేస్తుందన్నదే ప్రస్తుత చర్చ. వారిపై మొత్తానికి కేసునే కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసే విశిష్టాధికారం రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద సుప్రీం కోర్టుకు ఉంది. అయితే నిందితుల కేసుకు సంబంధించి దాఖలైన ప్రజాహిత (పిల్) వ్యాజ్యంలో వారిపై కేసును కొట్టివేయాల్సిందిగా కోరలేదు. వారిపై దాఖలైన కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని మాత్రమే డిమాండ్ చేశారు. ప్రజాహిత వ్యాజ్యంలో అలా డిమాండ్ చేయక పోవడానికి కూడా ఓ కారణం ఉంది. అది మొదటే డిమాండ్ చేసినట్లయితే కేసులో నిజానిజాల విచారణకు సుప్రీం కోర్టు, కేసును వాయిదా వేసి నిందితులను రిమాండ్‌కు పంపించే అవకాశం ఉంటుంది. పైగా నిందితులు తమపై తప్పుడు కేసును బనాయించారని, దాన్ని కొట్టి వేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ ఎప్పుడైనా దాఖలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం ప్రజాహిత వ్యాజ్యం స్ఫూర్తికే పరిమితం కావాలని భావించి పిటిషనర్లు మరో విషయం జోలికి పోలేదు. ప్రజాహిత వ్యాజ్యం డిమాండ్ చేయకపోయినా అన్యాయంగా కేసు బనాయించారనిపిస్తే దాన్ని ఏకపక్షంగా కొట్టివేసే అధికారాలను కూడా రాజ్యంగంలోని 142వ అధికరణ సుప్రీం కోర్టుకు కల్పించింది. కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా కేసును కొట్టివేస్తే అపార్థాలకు దారితీస్తుందన్న ఉద్దేశంతోను కేసును కొట్టివేయక పోవచ్చు. నిందితుల అరెస్ట్ ప్రక్రియ చట్టభద్దంగా జరిగిందా, లేదా? అన్న అంశాన్ని సుప్రీం కోర్టు ముందుగా పరిశీలిస్తుంది. అరెస్ట్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని నిందితుల తరఫు న్యాయవాదులు ఇప్పటికే వెల్లడించారు. అరెస్ట్ సందర్భంగా నిందితులకు చూపిన పత్రాలు మరాఠీ భాషలో ఉన్నాయి. కొందరు నిందితులకు మరాఠి రానందున చట్ట ప్రకారం వారికి అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసిన పత్రాలనే చూపించాలి. అది జరగలేదట. అలాగే పుణెకు నిందితుల ‘ట్రాన్సిట్ (తరలింపు)’ రిమాండ్ కోసం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను కోరినప్పుడు ఆయనకు కేసు డైరీ చూపించలేదట. ఈ విషయాలను నిరూపించడంలో న్యాయవాదులు సఫలీకృతమైతే నిందితుల అరెస్ట్‌పై స్టే విధించి వారిని విడుదల చేయవచ్చు! ఊరు, జిల్లా లేదా రాష్ట్రం వీడి వెళ్లరాదనే షరతులతోనైనా నిందితులను విడుదల చేయవచ్చు! నిందితులను పోలీసులు విచారించే ప్రక్రియే ఇంకా ప్రారంభం కానందున ‘స్వతంత్య్ర దర్యాప్తు’నకు సుప్రీం కోర్టు ఇప్పుడే ఆదేశించే అవకాశం లేదు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థకు అసమ్మతి అనేది భద్రతాపరమైన వాల్వ్ లాంటిది’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ ముందుగానే వ్యాఖ్యానించినందున నిందితులు విడుదల్యే అవకాశమే ఎక్కువగా ఉంది. నిందితులపై దాఖలైన కేసు మూలం ‘భీమా కోరెగావ్’ అల్లర్లే అయినప్పటికీ నిందితులు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారని, ఆ పార్టీకి నిధులు సమీకరించడమే కాకుండా ఆ పార్టీ తరఫున నియామకాలు జరుపుతున్నారని, మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘యాంటీ–ఫాసిస్ట్’ గ్రూపును కూడా ఏర్పాటు చేశారని పుణె పోలీసులు ఆరోపణలు చేశారు. అత్యంత వివాదాస్పద చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టమే కాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని పలు కఠిన నిబంధనల కింద కేసులను నమోదు చేశారు. -
రాజీవ్‌గాంధీ ఘటన తరహాలో మోదీ రాజ్ అంతం!
ముంబై: ఈ ఏడాది జూన్‌తోపాటు మూడ్రోజుల క్రితం అరెస్టు అయిన మావోయిస్టుల సానుభూతిపరులు, పౌర హక్కుల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తరహా సంఘటనకు వ్యూహరచన చేయాలి’ అని ఈ ఏడాది జూన్‌లో అరెస్టైన హక్కుల కార్యకర్త రోనా విల్సన్.. ఒక మావోయిస్టు నాయకుడికి లేఖ కూడా రాశారని మహారాష్ట్ర అదనపు డీజీ(శాంతి భద్రతలు) పరంబీర్ సింగ్ తెలిపారు. మూడ్రోజుల క్రితం ఐదుగురు పౌరహక్కుల నేతల అరెస్టులపై విమర్శల నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోరేగావ్–భీమా అల్లర్ల కేసుకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో.. అజ్ఞాతంలో ఉన్న మావోలకు, ఇతర మావోలకు మధ్య నడిచిన వేలాది లేఖల్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మావో నేత కామ్రేడ్ ప్రకాశ్‌కు రోనా విల్సన్ రాసిన లేఖలో.. ‘ఇక్కడ తాజా పరిస్థితిపై నువ్వు రాసిన చివరి ఉత్తరం మేం అందుకున్నాం. అరుణ్ (ఫెరారీ), వెర్నన్(గొంజాల్వేస్), ఇతరులు అర్బన్ ఫ్రంట్ పోరాటంపై అంతే ఆందోళనతో ఉన్నారు’ అని రాసినట్లు సింగ్ చెప్పారు. రైఫిల్స్, గ్రనేడ్ లాంచర్స్, నాలుగు లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి కోసం రూ.8 కోట్ల అవసరముందని లేఖలో విల్సన్ కోరారని ఆయన పేర్కొన్నారు. ‘కామ్రేడ్ కిషన్, కొందరు ఇతర కామ్రేడ్స్ ‘మోదీ రాజ్’ అంతానికి నిర్మాణాత్మక ప్రణాళికను ప్రతిపాదించారు. మరో రాజీవ్ గాంధీ (హత్య) సంఘటన తరహాలో మేం ఆలోచన చేస్తున్నాం’ అని పేర్కొంటూ ప్రకాశ్‌ను తన నిర్ణయం చెప్పమని విల్సన్ లేఖలో కోరారని పరంబీర్ సింగ్ తెలిపారు. ‘అరెస్టు అయిన వారికి, మావోయిస్టులకు మధ్య స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే పోలీసులు ముందడుగు వేశారు. మా వద్ద ఉన్న ఆధారాలు మావోయిస్టులతో వారికున్న సంబంధాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహా ఆధారాలతో 2014లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సైతం అరెస్టు చేశాం. అందరిని ఆకర్షించేలా ఏదో ఒక భారీ చర్యకు ప్రణాళిక రచిస్తున్నట్లు అరెస్టైన కార్యకర్తల మధ్య నడిచిన లేఖల ద్వారా స్పష్టమైంది. విధ్వంస చర్యలకు మావోలు ప్రణాళిక చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాం. కొరియర్ ద్వారా పాస్‌వర్డ్‌తో కూడిన సందేశాలతో కేంద్ర కమిటీ మావోలు ఈ హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపేవారు’ అని డీజీ తెలిపారు. ఆగస్టు 28న పుణే పోలీసులు దేశ వ్యాప్తంగా ప్రముఖ పౌరహక్కుల నేతల ఇళ్లలో దాడులు నిర్వహించి.. హైదరాబాద్‌లో వరవరరావును, ముంబైలో గొంజాల్వేస్, ఫెరీరా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్‌ను, ఢిల్లీలో నవలఖాను అరెస్టు చేయడం తెల్సిందే. గతేడాది డిసెంబర్ 31న ఎల్గార్ పరిషద్ నిర్వహించిన సదస్సు సందర్భంగా కోరెగావ్–భీమా వద్ద చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. అయితే అరెస్టైన ఐదుగురిని సెప్టెంబర్ 6 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్‌లో పుణే పోలీసులు ముంబైలో సుధీర్ ధావలే, ఢిల్లీలో పౌరహక్కుల కార్యకర్త రోనా విల్సన్, నాగ్‌పూర్‌లో న్యాయవాది గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్‌లను అరెస్టు చేశారు. -
భీమా-కోరేగావ్ కేసు: విజయవాడలో లాయర్ల ఆందోళన
-
భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో ట్విస్ట్!
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా- కోరెగావ్ అల్లర్ల కేసు మరో మలుపు తిరిగింది. భీమా- కోరెగావ్ అల్లర్లు సహా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర ఆరోపణలతో.. విరసం నేత వరవరరావు సహా మరో నలుగురు పౌర హక్కుల నేతలను పుణె పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వారందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో భీమా- కోరెగావ్ హింసాకాండపై మహారాష్ట్ర ప్రభుత్వం రహస్య నివేదికను తెరపైకి తెచ్చింది. పది మంది సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ రూపొందించిన రహస్య నివేదిక జనవరి 20నే ప్రభుత్వానికి అందజేసింది. వారిద్దరే ప్రణాళికలు రచించారు.. భీమా- కోరెగావ్ హింసాకాండకు హిందుత్వ సంస్థలకు చెందిన నేతలే కారణమని రహస్య నివేదిక వెల్లడించింది. వివాదాస్పద హిందుత్వ నేత శంభాజీ బిడే, మిలింద్ ఎక్బోటేలు కలిసి అల్లర్లకు ప్రణాళికలు రచించారని పేర్కొంది. ఈ మేరకు జనవరి 20న షోలాపూర్ రేంజ్ ఐజీ విశ్వాస్నాంగ్రే పాటిల్‌కు నిజనిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించింది. అయితే ఇన్నాళ్లుగా ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించని మహారాష్ట్ర ప్రభుత్వం.. పౌర హక్కుల నేతల అరెస్టు తర్వాత నివేదికను తెరపైకి తీసుకురావడం.. మరోవైపు దీనికి అంతటికీ మావోయిస్టులే కారణం అంటూ మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలకు దిగడంతో.. ఈ కేసులో గందరగోళం నెలకొంది. కాగా గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?) -
పౌర హక్కుల నేతల అరెస్టు: సంచలన ఆరోపణలు
ముంబై: దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ హింసాకాండకు సంబంధించి దేశవ్యాప్తంగా హక్కుల నేతల ఇళ్లపై దాడులు, అరెస్టులపై చెలరేగిన విమర్శలు, కోర్టు మొట్టికాయల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం స్పందించారు. మహారాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరమ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే తాము ఈ అరెస్టులు చేశామన్నారు. మావోయిస్టులు, పౌర హక్కుల నేతలకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుర్తాలకు సంబంధించిన లేఖలు తమకు లభించాయన్నారు. ఈ లేఖలను ఏడీజీ తన ప్రెస్మీట్లో మీడియా ముందు ప్రదర్శించారు. ఇప్పటివరకు తాము సేకరించిన లేఖలు కొన్ని వేలు ఉన్నాయనీ, అందులో ముఖ్యమైన వాటినే మీడియా ముందు ఉంచుతున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కుట్రలకు పౌర హక్కుల నేతలు సహకరించారన్నారని ఈ లేఖలు స్పష్టం చేస్తున్నాయని పరమ్ బీర్ సింగ్ చెప్పారు. ముఖ్యంగా సుధా భరద్వాజ్ కామ్రేడ్ ప్రకాశ్‌కు ఒక లేఖ రాశారనీ, హక్కుల దుర్వినియోగంపై సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అందులో రాశారన్నారు. శత్రువులకు వ్యతిరేకంగా తమ పని మొదలైందని కూడా ఆమె రాశారని ఏడీజీ పేర్కొన్నారు. మావోయిస్టు నేతలు, ఇతర సంస్థలతో కలిపి మయన్మార్‌లో రహస్యంగా సమావేశమయ్యారనీ, జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో భారీ ఎత్తున కుట్ర చేశారని, గ్రెనేడ్ లాంచర్స్ లాంటి ఆయుధాల కొనుగోలుకు నిధులు సేకరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీమా కోరేగావ్ అల్లర్లలో అరెస్టయిన కేడర్ కోసం మావోయిస్టు సెంట్రల్ కమిటీ రూ.15 లక్షల మంజూరు చేసిందన్నారు. 2017, డిసెంబర్ 31వ తేదీన బీమా కోరేగావ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన కేసును జనవరి 8వ తేదీన నమోదు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్ల కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఏడీజీ తెలిపారు. కాగా, భీమా కోరెగావ్ హింసాకాండ కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావు, అరుణ్ పెరీరా, గౌతమ్ నవ్లఖా, వెర్నాన్ గొంజాల్విస్, సుధా భరద్వాజ్ లను పుణే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ తేదీ (సెప్టెంబరు 6) వరకు వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని బుధవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరంతా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది!!
సాక్షి, న్యూఢిల్లీ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం నేత వరవరరావు, పౌర హక్కుల కార్యకర్తలు గౌతం నవలఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, న్యాయవాది సుధా భరద్వాజ్‌లను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వారిని జైలుకు పంపకుండా.. గృహ నిర్బంధంలో ఉంచితే చాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే పౌర హక్కుల నేతల అరెస్టు సమయంలో, వారికి గృహ నిర్బంధం విధించిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గౌతమ్ నవలఖా స్నేహితురాలు సభా హుస్సేన్... మీడియాకు తెలిపిన విషయాలు చర్చనీయాంశమయ్యాయి. బెడ్రూం తలుపులు కూడా వేయొద్దంటున్నారు.. గౌతమ్ నవలఖాకు గృహ నిర్బంధం విధించిన నాటి నుంచి.. ఢిల్లీలోని నెహ్రూ ఎన్‌క్లేవ్‌లో ఆయనతో పాటు కలిసి ఉంటున్న సభా హుస్సేన్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు. ‘బెడ్ రూం తలుపులు తెరిచే పడుకోవాలని పోలీసులు మాకు చెప్పారు. దాంతో నాకు కోపం వచ్చింది. ముందు మాకు క్షమాపణ చెప్పండి అని వారిని అడిగానంటూ’ సభా తెలిపారు. ఇలా ప్రతీ గదిపై పోలీసులు నిఘా వేసి ఉంచడం.. గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించారు. ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది.. నవలఖా ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారన్న సభా... ‘ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం. పొద్దున లేచింది మొదలు నిద్ర పోయే వరకు వారు(పోలీసులు) మమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. దీంతో మనశ్శాంతి కరువయ్యింది. ఇంటి చుట్టూ ఎర్రని వస్త్రం కట్టారు. బంధువులు, స్నేహితులలెవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు. కనీసం బ్యాంకు పనులు కూడా చేసుకోనివ్వడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లేందుకు తనకు అనుమతిని ఇచ్చారని, కానీ పోలీసుల మధ్య గౌతమ్‌ను ఒంటరిగా వదిలి వెళ్లేందుకు భయంగా ఉందని సభా వ్యాఖ్యానించారు. అరెస్టులు, గృహ నిర్బంధం.. ఇదంతా కేవలం విచారణలో భాగమని.. ఇవి వారికి(పౌర హక్కుల నేతలు) ఎటువంటి చేటు చేయలేవని ఆమె పేర్కొన్నారు. చదవండి : ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!! -
సొంతిళ్లకు హక్కుల కార్యకర్తలు
ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హక్కుల కార్యకర్తల్లో ముగ్గురిని సొంతిళ్లకు పంపారు. విచారణ జరిగే సెప్టెంబర్ 6 వరకు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. గురువారం పుణే నుంచి వరవరరావును హైదరాబాద్‌కు విమానంలో, వెర్నన్ గొంజాల్వేస్, అరుణ్ ఫెరీరాను ముంబైకి తరలించారు. ఉదయం ఇంటికి చేరుకున్న గొంజాల్వేస్కు ఆయన భార్య స్వాగతం పలికారు. పుణే సమీపంలో జరిగిన ఘర్షణల్లో అసలు కారకులను కాపాడేందుకే తప్పుడు పత్రాలతో తనను కేసులో ఇరికించారని గొంజాల్వేస్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ నాయకురాలు, లాయర్ సుధా భరద్వాజ్‌ను ఫరీదాబాద్‌లో, పౌరహక్కుల కార్యకర్త నవలాఖాను ఢిల్లీలో వారివారి ఇళ్లలోనే నిర్బంధించారు. గృహ నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తల ఇళ్ల వద్ద మహారాష్ట్ర పోలీసులతో పాటు స్థానిక పోలీసులను మోహరిస్తున్నట్లు పుణే అసిస్టెంట్ కమిషనర్ చెప్పారు. ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో నిందితులపై వచ్చిన కీలక ఆరోపణలు చేర్చనట్లు తెలిసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, భీమా–కోరెగావ్ ఘర్షణల్లోనూ వారి పాత్ర ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన ఆరోపణలు ఈ నివేదికలో కనిపించలేదు. వారిని కస్టడీకి ఎందుకు అప్పగించాలో పోలీసులు 16 కారణాలు పేర్కొన్నా, పైన పేర్కొన్న రెండు ఆరోపణల్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఖండించిన మేధావులు, కార్యకర్తలు.. పౌరహక్కుల కార్యకర్తల అరెస్ట్‌లు, గృహనిర్బంధంపై దేశవ్యాప్తంగా మేధావులు, పౌరసంఘాల కార్యకర్తలు మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసుల తీరును ఖండించారు. రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని రచయిత అరుంధతి రాయ్, లాయర్ ప్రశాంత్ భూషణ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, జిగ్నేశ్ మేవానీలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తారు. అరెస్టుల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అణగారిన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తున్న వారి గొంతుకను కేంద్రం నొక్కేస్తోందని సామాజిక కార్యకర్త స్థన్ స్వామి ఆరోపించారు. మరోవైపు, గౌతమ్ నవలాఖా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో విచారణ జరపడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. -
ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!
‘బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ - ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేధావులు.. ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌరహక్కుల నేతలపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వరవరరావు అల్లుడు, ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) ప్రొఫెసర్ సత్యనారాయణ.. తన ఇంట్లో సోదాలు చేసిన సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అది అరెస్టు వారెంటు కాదు.. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు పవన, అల్లుడు సత్యనారాయణ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ విషయం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ... వరవరరావుకు అల్లుడినైన నేరానికే పోలీసులు తన పట్ల ఈ విధంగా ప్రవర్తించారేమో అంటూ సోదాలు నిర్వహించిన తీరును మీడియాకు వివరించారు. ‘ ఆరోజు(మంగళవారం) ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో.. సుమారు 20 మంది పోలీసులు (10 మంది మహారాష్ట్ర, 10 మంది తెలంగాణ పోలీసులు)ఇఫ్లూ స్టాఫ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మరాఠీ భాషలో ఉన్న ఓ కాగితాన్ని సర్చ్ వారెంట్ అంటూ నా చేతిలో పెట్టి ఇంట్లోకి వచ్చి, సోదాలు మొదలుపెట్టారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. మా దగ్గర ఉన్న మొబైల్స్, ల్యాప్టాప్స్ తీసేసుకున్నారు. ఈ- మెయిల్ ఐడీలు బ్లాక్ చేశారు. అయితే పోలీసులు నాకు ఇచ్చింది సెర్చ్ వారెంట్ కాదని, ఓ పోలీసు ఉన్నతాధికారి రాసి ఇచ్చిన స్టేట్మెంట్ అని తర్వాత తెలిసిందని’ సత్యనారాయణ చెప్పారు. బాత్రూం డోర్ తెరచి ఉంచాలంటూ.. ‘బ్రష్ చేసుకునేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ అంటూ తన భార్య పవనను మనోవేదనకు గురిచేశారని సత్యనారాయణ ఆరోపించారు. ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క మచ్చ కూడా లేదు.. 30 ఏళ్ల సర్వీసులో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కేవలం వరవరరావు అల్లుడనే ఒకే ఒక్క కారణం చేత తనను టార్గెట్ చేశారని విమర్శించారు. తనలాంటి అమాయకుల మీద లేనిపోని నిందలు మోపి, గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుంటే ఏ కోర్టులకు కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు మేధావి అవ్వాలని ఎందుకు అనుకున్నావ్. నీ గదిలో అంబేద్కర్, ఫూలే దంపతుల ఫొటోలు ఎందుకున్నాయి. ప్రొఫెసర్‌గా సంపాదిస్తున్నది సరిపోవడం లేదా? మావో సాహిత్యం ఎందుకు చదువుతున్నావ్? వేరే పనులేమీ లేవా అంటూ ఒక ఉగ్రవాదిని ప్రశ్నించినట్లు తనను కూడా ప్రశ్నించారంటూ’ పోలీసుల తీరుపై సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఘటనతో క్యాంపస్ అంతా ఉలిక్కి పడింది. సత్యనారాయణ ఇంట్లో సోదాలు జరపటానికి పోలీసులు రావడంతో క్యాంపస్‌లోని విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారని ఇఫ్లూ ప్రొఫెసర్ సుజాత ముకిరి అన్నారు. సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. -
వరవరరావుకు గృహనిర్బంధం..
న్యూఢిల్లీ: భీమా–కోరేగావ్ హింస కేసులో అరెస్టయిన ఐదుగురు మానవహక్కుల కార్యకర్తలకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేసిన వారిని సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. భిన్నాభిప్రాయాన్ని వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని, దీన్ని అణగదొక్కడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. భీమా–కోరేగావ్ హింస జరిగిన 9 నెలల తర్వాత వీరిని అరెస్టు చేయడంపై మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. ‘ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు సేఫ్టీ వాల్వ్ వంటిది. దీన్ని మీరు అణచాలని చూస్తే ఎప్పుడో ఓసారి అది బద్దలవుతుంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ.. చరిత్రకారురాలు రోమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవికా జైన్ సహా ఐదుగురు వేసిన పిటిషన్ ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా, నవలఖా అరెస్టుపై ఇచ్చిన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సరైన ఆధారాలు చూపకుండానే నవలఖాను ఎలా అరెస్టు చేశారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు ఎన్‌హెచ్చార్సీ కూడా ఈ అరెస్టులపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేసిన వారందరినీ వారి ఇళ్లకు పంపించాలని పుణే కోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోర్టుకు మహా విన్నపం అరెస్టయిన ఐదుగురిని విడుదల చేయాలంటూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు అంగీకరించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇప్పటికే పలువురు ఈ అంశంపై వివిధ హైకోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో మహా సర్కారు ఈ అంశాన్ని లేవనెత్తింది. హైదరాబాద్ నుంచి వరవరరావు, ముంబై నుంచి అరున్ ఫెరీరా, వెర్నాన్ గంజాల్వేస్, హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి సుధా భరద్వాజ్, ఢిల్లీ నుంచి గౌతమ్ నవలఖాలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. డిసెంబర్ 31న భీమా–కోరేగావ్ గ్రామంలో జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ సభ కారణంగానే దళితులు, అగ్రవర్ణాల మధ్య హింస ప్రజ్వరిల్లిందనే కేసులో ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నవలఖా అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు.. హక్కుల కార్యకర్త నవలఖా అరెస్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన దస్తావేజులను మరాఠీలోనే ఉంచడాన్ని ప్రశ్నించింది. ‘తననెందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటప్పుడు అరెస్టు పేపర్లను ఇంగ్లిషులోకి తర్జుమా చేసి నవలఖాకు ఎందుకు ఇవ్వలేదు?’ అని కూడా ప్రశ్నించింది. దస్తావేజులు వేరే భాషలో ఉన్నప్పటికీ మెజిస్టీరియల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఎలా జారీ చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసు దస్తావేజులను వెంటనే ఇంగ్లిష్‌లోకి మార్చాలని కోర్టు ఆదేశించింది. నవలఖా అరెస్టులో న్యాయపరమైన అంశాలు, పుణే కోర్టుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివిన తర్వాతే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భీమా–కోరేగావ్ వివాదానికి సంబంధించి మిగిలిన అరెస్టులు సరైనవే అని వెల్లడైతే.. నవలఖా విషయంలోనూ స్పష్టత వస్తుందని కోర్టు పేర్కొంది. కాగా, మరాఠీలో ఉన్న పత్రాలను ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి నవలఖా లాయర్లకు ఇస్తామని మహారాష్ట్ర పోలీసుల తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ కోర్టుకు తెలిపారు. ప్రజాగొంతుక నొక్కేస్తున్నారు: అంబేడ్కర్ ప్రజల గొంతుకను నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. భారతీయ రిపబ్లిక్ పార్టీ బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. వామపక్ష భావజాలమున్న నేతలను అరెస్టు చేయడం.. ప్రజల గొంతుకను నొక్కడమేనన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ఎన్జీవోలు, రాజకీయేతర సంస్థలు లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ముంబైలో విమర్శించారు. సనాతన్ సంస్థపై దాడులు జరుగుతున్న సమయంలో కావాలనే ఎల్గార్ పరిషత్ సభ్యులపైనా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. అటు శివసేన కూడా భీమా–కోరేగావ్ హింసకు అసలైన సూత్రధారులను ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాన్ని అంటగడుతూ అరెస్టులు జరిపే సంస్కృతి దేశవ్యాప్తంగా జరుగుతోందని విమర్శించింది. భారతీయ శిక్షాస్మృతి 153 (ఏ) కింద (మతం, జాతి, పుట్టిన ప్రాంతం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా వ్యాఖ్యానించడం) ఐదుగురిని పుణే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అరెస్టులకు ముందు చట్టపరమైన అన్ని నిబంధనలు అమలుచేశామని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దీపక్ సర్కార్ తెలిపారు. అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్టులు జరిగాయన్నారు. -
ఆ అరెస్టులే అసలైన కుట్ర
ఈ దేశంలో ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కులను కాలరాసినప్పుడు, వరవరరావు, గౌతం నవ్లఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయటపడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కుల, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటించారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు మద్దతునిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదు. హత్యలు, అత్యాచా రాలూ, అవమానాలూ భరిస్తూ ఉన్నంతకాలం ఏ విధమైన ఘర్షణ లేదు. సరిగ్గా ఇదే మహారాష్ట్రలో భీమా కోరేగావ్ స్ఫూర్తియాత్ర సందర్భంగా జరిగిన ఘటనలకు వర్తిస్తుంది. పీష్వాల అకృత్యాలు సహిం చిన మహార్, చమార్ లాంటి నాటి అంటరాని కులాలు 1818 జనవరి 1న ప్రతిఘటనా దాడికి పూనుకున్నాయి. కేవలం అయిదు వందల మంది కొన్నివేల మంది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి విజయగాథను మననం చేసుకొని, స్ఫూర్తి పొందడానికి లక్షలాది మంది దళితులు దేశం నలుమూలల నుంచి కోరేగావ్ జైత్రయాత్రకు బయలుదేరారు. భీమా నదికి దక్షిణం వైపున ఉన్న భీమాకోరేగావ్ స్తూపం వద్ద దళితులు ఎంతో ప్రశాంతంగా పది కిలోమీటర్లకు పైగా నడిచివెళ్లి నివాళులర్పించారు. భీమా నదికి రెండోవైపు అంటే ఉత్తరం వైపు భీమాకోరేగావ్ యాత్రకు కదలివస్తోన్న దళితులపై దాడి జరిగింది. వధూబద్రుకా గ్రామంలో కొంత మంది ఆధిపత్య కులాలు కాషాయజెండా లతో, ఇనుపరాడ్లు, రాళ్లతో పొలాల్లో దాగి దాడికి దిగారు. ఊహించని ఈ దాడికి తట్టుకోలేని దళితులు చెల్లాచెదురయ్యారు. అక్కడ ఉన్న వాహనాలను తగు లబెట్టారు. ఈ గ్రామాల అగ్రకులాలకు తోడుగా పొరుగున ఉన్న సన్నావాడి, శిఖరాపూర్ గ్రామాల ఆధిపత్య కులాలు దాడిలో భాగమయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ పతంగే ఆసుపత్రిలో మరణించారు. ఈ దాడి హఠాత్తుగా జరిగింది కాదని, ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు చెప్పారు. రెండు రోజుల ముందే డిసెంబర్ 29న వధూబద్రుకా గ్రామంలో అక్కడి దళితులు నిర్మిం చుకున్న ఒక అమరవీరుని సమాధిని ఆధిపత్య కులాలు కూల్చివేశాయి. అంతకు ముందు మూడు నెలలుగా భీమాకోరేగావ్ విజయయాత్రపై చర్చ జరుగుతోంది. భీమాకోరేగావ్ దళితులు తలెత్తుకొని నిలబడటం ఆధిపత్య కులాలకు కంటగింపుగా తయారైంది. అదే ఈ దాడికి కారణం. దీనికిపై దేశంలోని అనేక ప్రాంతాలు నిరసనలతో భగ్గుమ న్నాయి. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోని దళితులు, ఆదివాసీలు రాష్ట్రం మొత్తాన్ని దిగ్బంధనం చేశారు. ముంబైని స్తంభింపజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది దళిత యువకులు భీమా కోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా జరిగిన దాడిని ప్రతిఘటించడం మనకు కనిపిస్తుంది. పూనా– ముంబై ప్రాంతమే కాకుండా మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాలు కూడా అట్టుడికిపోయాయి. ఈ ప్రతిఘటనను అణచడానికి వేలాది మంది పోలీ సులను రంగంలోకి దింపారు. కానీ రాహుల్ పతం గేని హత్య చేసిన సంభాజీ భీడే, మిలింద్ ఎగ్బోటేను మాత్రం అరెస్టు చేయలేదు. ఈ విషయమై పార్ల మెంటులో సైతం చర్చ జరిగింది. తర్వాత కేవలం మిలింద్ ఎగ్బోటేను మాత్రమే అదుపులోకి తీసుకొని బెయిల్‌పై విడిచిపెట్టారు. హిందూ సంఘ నాయ కుడు సంభాజీ భీడేను ఇప్పటి వరకు అరెస్టు చేయ లేదు. విచారించనూ లేదు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ గురువు అంటారు. మరో విచిత్రం ఏమిటంటే జనవరి ఒకటవ తేదీన హత్యకు గురైన దళిత యువ కుడు రాహుల్‌ని చంపింది హిందూ సంఘ కార్య కర్తలు కాదని, దళిత యువకులే హత్యచేశారని పోలీ సులు మరో కథ అల్లారు. సుప్రీం ఆదేశంతో దళితుల్లో ఆందోళన మహారాష్ట్రలో ఈ ఉద్యమ జ్వాలలు చల్లారకముందే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ప్రభు త్వోద్యోగులనూ, ఇతరులనూ ముందస్తుగా అరెస్టు చేయకూడదని మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామం దేశంలోని మొత్తం దళితులను ఆందో ళనకు గురిచేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏప్రిల్ రెండున దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ దళిత ఉద్యమ శక్తిని నిరూపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకకంఠంతో దళితులు సుప్రీంకోర్టు తీర్పుని నిరసించారు. భారత్ బంద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్, మ«ధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది యువకులు అరెస్టయ్యారు. రోడ్ల మీదకు వచ్చిన యువతీయువ కులను వారి కులం పేరు అడిగి మరీ వ్యాన్లలోకి ఎక్కించి జైళ్ళలోకి తోశారు. ఈ రెండు సంఘటనలతో ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ∙ఉద్య మాన్ని అణచివేయాలని ఆలోచించింది. నేరుగా దళి తులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధం ప్రయోగిస్తే ఎన్నికల్లో తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించిన పాలకులు దానికి మరో మార్గం అన్వే షించారు. అందుకు భీమాకోరేగావ్ హింసాకాండ అనే పదం సృష్టించారు. మీడియా ద్వారా దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎల్గార్‌పరిషత్ జరిపిన సమా వేశాన్ని దానికి మద్దతుగా చూపించారు. భీమా కోరే గావ్ ద్విశత వార్షికోత్సవ స్ఫూర్తియాత్ర సందర్భంగా కొన్ని ప్రజాసంఘాలు కలిసి డిసెంబర్ 31న పుణే లోని శనివార్వాడలో సభ ఏర్పాటు చేశాయి. కోరే గావ్ స్ఫూర్తి కొనసాగించాలనే లక్ష్యంతో ఈ సభను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ముందే చెప్పారు. గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ, జేఎ న్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, రోహిత్ వేముల తల్లి రాధిక సహా కొంత మంది దళిత నాయకులు ఈ సభకు హాజరయ్యారు. జనవరి ఒక టిన దళితులపై దాడి తర్వాత జరిగిన దళితుల నిరసన ప్రదర్శనలకు ఈ సభకు సంబంధం ఉందని, ఎల్గార్ పరిషత్ సభలో చేసిన ఉపన్యాసాలే హింసా కాండకు కారణమయ్యాయని పోలీసులు ముందుగా ప్రకటించారు. ఈ ఎల్గార్ పరిషత్ సభలకు ఆర్థిక సహకారాన్నీ మావోయిస్టు్టలు అందించారని ప్రచా రం చేసిన పోలీసులు జూన్ నెలలో ఐదుగురు కార్య కర్తలను మావోయిస్టుల పేరుతో అరెస్టు చేశారు. దాడి చేసింది దళితులు కాదు! భీమాకోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా భీమా నదికి ఉత్తర భాగంలో దాడి చేసింది దళితులు కాదు. కాషాయజెండాలతో, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడిచే సిన వారు స్థానిక ఆధిపత్య కులాల వ్యక్తులేనని పత్రికలూ, మీడియా ఘోషించాయి. ఒకవేళ ఎల్గార్ పరిషత్ ఉపన్యాసాలే హింసాకాండకు కారణమైతే భీమా నదికి దక్షిణ భాగంలో వెల్లువెత్తిన జనసంద్రం మొత్తం పుణేనే భస్మీపటలం చేయగలిగేది. కోరేగావ్ భీమా నదికి దక్షిణభాగంలో దళిత యువకుడు రాహుల్ హత్యానంతరం కూడా దళితులు హింసకు పాల్పడలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలిపారు. లక్షలాది మంది దళితుల స్ఫూర్తికార్య క్రమాన్ని నిర్వహించింది అఖిల భారత సమతాసైనిక్ దళ్. ఎల్గార్ పరిషత్‌కు, భీమా కోరేగావ్ స్ఫూర్తి కార్యక్రమానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఎల్గార్ పరిషత్ సమావేశం జరిగింది డిసెంబర్ 31 సాయం త్రం. దళిత యువకుడు రాహుల్ హత్య జరిగిన గ్రామంలో డిసెంబర్ 29వ తేదీన దళితులు నిర్మిం చిన స్మారక చిహ్నాన్ని ఆధిపత్య కులాలు ధ్వంసం చేశాయి. అంటే ఆ సమావేశానికి ముందే దళితులపై పరోక్ష దాడులు ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఆధారంలేని ఎల్గార్ పరిషత్ కార్య క్రమాన్ని ఆసరా చేసుకొని మానవ హక్కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన పోలీసులు దాడులు చేశారు. ఆ దాడుల్లో ప్రధాని మోదీని హత్యచేయడానికి కుట్ర పన్నుతున్నారన డానికి ఆధారం లభ్యమైందని పోలీసులు ఢిల్లీలోని రోమా విల్సన్ గది నుంచి ఒక ఉత్తరం దొరికినట్టు ప్రకటించారు. ఇదే సందర్భంగా ముంబైలో సుధీర్ ధవలేను, నాగ్‌పూర్‌లో సోమాసేన్, మహేష్ రావత్, సురేంద్ర గాడ్లింగ్‌ను ఏప్రిల్ 17న అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో విరసం నేతlవరవరరావు, ఢిల్లీలో న్యాయవాది, పౌర హక్కుల నాయకుడూ, జర్నలిస్టు, రచయిత గౌతం నవ్లఖా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్, రాంచీ నుంచి ఆదివాసీ హక్కుల నాయ కుడు స్టాన్ స్వామి, ముంబై నుంచి అరుణ్ ఫెరీరాను అరెస్టు చేశారు. ఏప్రిల్ 2న భారత్ బంద్ తర్వాత ఈ అరెస్టులు జరగడం, దానికి భీమాకోరే గావ్‌ను ముడి పెట్టడం చూస్తే ఈ చర్యల వెనుక దాగి ఉన్న కుట్ర బహిర్గతమవుతోంది. విప్లవకవి వరవరరావు అరవై ఏళ్లుగా విప్లవో ద్యమంలో ఉంటూ ప్రజాఉద్యమాల్లో మమేకమ య్యారు. ఆదివాసీల పక్షాన పోరాడుతున్నారు. ధిక్కారస్వరమైన వరవరరావుని బయటలేకుండా చేయడమే లక్ష్యంగా ఈ అరెస్టుల తతంగం జరిగిం దన్నది వాస్తవం. ఈ దేశంలో ఆదివాసీలను ఎన్ కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కు లను కాలరాసినప్పుడు, వారిపై అత్యాచారాలు చేసి నప్పుడు వరవరరావు, గౌతం నవ్లాఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయట పడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కులు, ప్రజాసంఘాల నాయ కులనూ అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటిం చారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు సమాజంలో మద్దతు నిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా దళితులు, ఆదివాసీలు పోరాడుతోంటే వారికి మావోయిస్టులతో సంబంధాలను అంటగట్టి అణచివేయడం కూడా రెండో ప్రయోజనంగా భావి స్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో భీం ఆర్మీ ఉద్యమానికి మావోయిస్టుల అండ ఉందనే నెపంతో ఆ సంస్థ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ని ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. దళితులు, ఆదివాసీలు ఎదురు తిరిగినప్పుడల్లా వారిని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ఇదెంత మాత్రం వాంఛనీయం కాదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
జైలు కాదు.. గృహ నిర్బంధం చాలు..
-
పౌరహక్కుల నేతల అరెస్ట్; సుప్రీం కీలక వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ : విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అరెస్టైన ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలందరిని సెప్టెంబరు 5 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురిని తమ తమ సొంత ఇళ్లలోనే ఉండనివ్వాలని, బయటికి వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ సందర్భంగా.. అసంతృప్తి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ వంటిదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. కాగా పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రధాని హత్యకు కుట్ర’ కేసు పెడతారా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం పుణె పోలీసులు పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టారు ? ఎలాంటి కేసులు పెడుతున్నారు ? ఏ చట్టం కింద? ఏ సెక్షన్ కింద? అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో జనవరి ఒకటవ తేదీన జరిగిన దళితుల మహార్యాలీ సందర్భంగా తలెత్తిన అల్లర్ల విచారణలో భాగంగానే వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రాథమిక వార్తలు తెలియజేశాయి. ఇదే అల్లర్లకు సంబంధించి జూన్ 6వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యంత వివాదాస్పదమైన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 (వీఏపీఏ)’ను దాఖలు చేశారు. 2012లో ఈ చట్టాన్ని కేంద్రం సవరించినప్పటికీ ప్రమాదకర సెక్షన్లు, అంశాలు ఇంకా అందులో అలాగే ఉన్నాయి. హైదరాబాద్‌లో అరెస్టయిన వరవరరావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలపై కూడా వీఏపీఏ చట్టాన్నే దాఖలు చేసే అవకాశం ఉంది. పుణెలోని జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి రాంచి పోలీసు స్టేషన్‌కు అందిన ఉత్తర్వుల్లో ‘నెంబర్ 4–2018’ కేసులో విచారణ కోసం అరెస్ట్ చేయాల్సిందిగా ఉంది. అంటే ఆ నెంబర్ కేసు వీఏపీఏదే. అయితే గతంలో అరెస్టై ప్రస్తుతం పుణె పోలీసుల నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త రోనా విల్సన్ వద్ద దొరికినట్లు పోలీసులు చెబుతున్న ఓ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని ఉంది. దీంతో ప్రధాని హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలపై కేసు పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వమే ఇలాంటి కుట్రలు పన్నుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, మోదీ హత్య కుట్రకు ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కేసును దాఖలు చేయక పోవచ్చు. వరవరరావు, ఆనంద్ టెల్టుంబ్డే, రోనా విల్సన్ వీఏపీఏ చట్టం ఎంతో ప్రమాదకరమైనది ఈ చట్టంలోని 13, 16, 17, 17బీ, 20, 38, 39, 40 సెక్షన్ల కింద నిందితులను విచారిస్తున్నారు. ఇందులోని 13వ సెక్షన్ ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న, వాటితో సంబంధం ఉన్నా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించివచ్చు. మిగతా సెక్షన్లు దీనికంటే ప్రమాదరకమైనవి. టెర్రరిస్టు కార్యకలాపాలను సూచించేవి. టెర్రరిస్టు కార్యకలాపాలతో ఎవరి చావుకు కారణమైన, టెర్రరిస్టు చర్యకు ఆర్థిక సహాయం అందించినా, టెర్రరిస్టు చర్యకు పాల్పడినా, టెర్రరిస్టు సంస్థకు నియామకాలు జరిపినా, అందులో సభ్యుడిగా కొనసాగినా, ఆ సంస్థ తరఫున విరాళాలు వసూలు చేసినా ఐదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష విధించే సెక్షన్లు వీటిలో ఉన్నాయి. మహాయిస్టు చర్యలను టెర్రరిస్టు చర్యలుగా పోలీసులు పరిగణిస్తున్న విషయం తెల్సిందే. హర్యానాలోని ఫరిదాబాద్‌లో అరెస్ట్ చేసిన న్యాయవాది సుధా భరద్వాజ్‌పై వీఏపీఏ చట్టంలోని కొన్ని సెక్షన్లతోపాటు మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, వదంతలు వ్యాప్తి చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని.. ఇలా పలు ఆరోపణలు చేస్తూ భారతీయ శిక్షా స్మృతిలోని 34, 153 ఏ, 505 (1బీ), 117, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెల్సింది. ఆమె వద్ద దొరికిన ఓ లేఖలో కశ్మీరు వేర్పాటువాదులకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. ఇంతకు వీరిపై కేసులెందుకు? ఈ ఏడాది జనవరి 1వ తేదీన పుణెకు సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోని భీమా కోరెగావ్‌లో ఏటా జరిగే దళితుల మహార్యాలీ జరిగింది. దాదాపు మూడు లక్షల మంది హాజరైన ఆ ర్యాలీ సందర్భంగా విధ్వంసకాండ చెలరేగింది. అందులో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్లను డిసెంబర్ 31వ తేదీన ఓ బహిరంగ వేదిక నుంచి ప్రసంగించిన సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలతోపాటు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారన్నది పోలీసుల అభియోగం. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?) ప్రధాని నరేంద్ర మోదీతో సంభాజి భిడే నాడేమి వార్తలొచ్చాయి? కాషాయ జెండాలు ధరించిన ఆరెస్సెస్ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం వల్లనే విధ్వంసకాండ చెలరేగిందని నాడు వార్తలు వచ్చాయి. ర్యాలీకి కొన్ని రోజుల ముందు ర్యాలీని అడ్డుకోవాల్సిందిగా హిందూ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపే అల్లర్లకు కారణమైందని ఆ వార్తలు సూచించాయి. దాంతో ఆరెస్సెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడినా ‘హిందూ ఏక్తా మంచ్’ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటే, ‘శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్’ సంస్థ చీఫ్ సంభాజీ భిడేలపై పుణె పోలీసులు జనవరి 3వ తేదీన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిద్దరికి ఆరెస్సెస్ అధినాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారిని కనీసం పోలీసులు అరెస్ట్ చేసేందుకు సాహసించలేక పోయారు. ఆ విషయమై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిని తీవ్రంగా నిలదీసింది. అరెస్ట్‌లు చూపించాక కోర్టుకు రావాలని కూడా ఆదేశించింది. దాంతో మిలింద్ ఎక్బోటేను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన గురువుగా భావించే సంభాజి భిడేను అరెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. హఠాత్తుగా మలుపు తిరిగిన కేసు హిందూ సంఘాలపై నుంచి కేసు దృష్టి ఒక్కసారిగా సామాజిక కార్యకర్తల వైపు మళ్లింది. ఎక్బోటే, భిడేలాంటి హిందూ నాయకుల ప్రసంగాల వల్ల అల్లర్లు చోటు చేసుకోలేదని, సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లనే అల్లర్లు జరిగాయని అభిప్రాయపడిన పుణె పోలీసులు జూన్ ఆరవ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నాడు విద్వేషాలను రెచ్చగొట్టారంటూ హిందూత్వ నాయకులపై భారతీయ శిక్షాస్మృతిలోని సాధారణ సెక్షన్లను నమోదు చేయగా, ఆ తర్వాత సామాజిక కార్యకర్తలపై మాత్రం అత్యంత వివాదాస్పదమైన ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ కింద కేసులు పెట్టారు. -
‘అర్బన్ మావోయిస్టులు’ అంటే ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం ఉదయం పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపి వారిలో వరవరరావు సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఐదుగురు సామాజిక కార్యకర్తలతోపాటు భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో జూన్‌లో అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలను కూడా పోలీసులు అర్బన్ మావోయిస్టులు లేదా అర్బన్ నక్సలైట్లుగా వ్యవహరించారు. ఇంతకు ఈ అర్బన్ మావోయిస్టులంటే ఎవరు? వారిని ఎందుకు అలా పిలుస్తున్నారు? ఆ పదం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? బాలివుడ్ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత వివేక్ అగ్నిహోత్రి ‘అర్బన్ నక్సల్’ శీర్షికతో స్వరాజ్య పత్రికలో 2017, మే నెలలో ఓ వ్యాసం రాశారు. ‘అర్బన్ నక్సలైట్లంటే పట్టణాల్లో ఉండే మేధావులు. ప్రభావశీలురు. ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలు, వారు భారత దేశానికి కనిపించని శత్రువులు. రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వీరిని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ ‘హాఫ్ మావోయిస్ట్స్’గా వర్ణించారు. రహస్య కేటగిరీకి చెందిన వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా ఆయన ట్వీట్ కూడా చేశారు. బహుశ ఆయన కూడా వివేక్ వ్యాసాన్ని చదివి ఉండవచ్చు! భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో జూన్ ఆరవ తేదీన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, సామాజిక కార్యకర్తలు మహేశ్ రౌత్, సుధీర్ ధావ్లే, రోనావిల్సన్లను అరెస్ట్ చేసినప్పుడు వారిని పోలీసులు ‘అర్బన్ మావోయిస్టులు’గా పేర్కొన్నారు. బాలీవుడ్ అగ్నిహోత్రి రాసిన వ్యాసాన్ని పోలీసులు చదివి ఉన్నారా? పట్టణాల్లో నివసిస్తున్న మావోయిస్టులుగా భావించి కాకతాళీయంగానే అలా పిలిచారోమో వారికే తెలియాలి. అప్పటి నుంచి మాత్రం ‘అర్బన్ మావోయిస్టులు’ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. -
బీమా కొరెగావ్ అల్లర్ల వెనుక..
సాక్షి, పూణే : బీమా కొరెగావ్ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నిందితుల విచారణలో పలు అంశాలు వెలుగుచూస్తున్నాయి. వీరు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో పలుమార్లు ఉపన్యాసాలు ఏర్పాటు చేశారని, తమ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు విద్యార్థులను నియమించకునేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. నిందితులు సుధీర్ ధావలె, మహేష్ రౌత్, షోమా సేన్, రోనా విల్సన్‌లు ఓ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్‌కు సంబంధించి స్మారక ఉపన్యాసాల పేరిట పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారని పూణే పోలీసులు గురువారం కోర్టుకు నివేదించినట్టు తెలిసింది. నిషేధిత సీపీఐ(మావోయిస్టు)లో చేరేందుకు విద్యార్థులను ప్రేరేపించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో చేరాల్సిందిగా విద్యార్థులను కోరడం కుట్రపూరితమని నిందితుల కస్టడీని కోరుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్ అడిషనల్ సెషన్స్ జడ్జ్ కేడీ వధానే దృష్టికి తీసుకువచ్చారు. వీరి చర్యలు జాతీయ భద్రతకు పెను విఘాతమని, దీనిపై లోతైన విచారణ అవసరమని ఆయన న్యాయమూర్తికి నివేదించారు. నిందితులందరూ జాతి విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తాము స్వాధీనం చేసుకున్న పత్రాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టేందుకు నిధులు సమకూర్చుకున్నారని, ఢిల్లీలోని నిందితుడు విల్సన్ ఇంటిలో సోదాలు నిర్వహించిన క్రమంలో పోలీసులు రూ 80,000 నగదు స్వాధీనం చేసుకున్నారని కోర్టుకు వివరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు వివరాలను వెల్లడించేందుకు విల్సన్ నిరాకరిస్తున్నాడని చెప్పారు. బీమా కోరెగావ్ అల్లర్లకు సంబంధించి నలుగురు నిందితులను ఈనెల 6న పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. -
పవార్ వ్యాఖ్యలపై సేన ఫైర్
సాక్షి, ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై శివసేన విరుచుకుపడింది. పవార్ రాజకీయాలు మహారాష్ట్రకు ప్రమాదకరమని, సమాజంలో సామరస్యానికి ఇవి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా కోరెగావ్ హింసపై జరుగుతున్న పోలీసు విచారణకు పవార్ వ్యాఖ్యలు అవరోధం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటనపై జరుగుతున్న విచారణను తప్పుదోవ పట్టించడం ద్వారా పవార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించింది. బీమా కోరెగావ్ అల్లర్లకు సంబంధించి ఇటీవల పూణే పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయడంపై పవార్ స్పందిస్తూ ఘర్షణల వెనుక ఉన్న వారిని విడిచిపెట్టి, వాటితో ఏమాత్రం సంబంధం లేని వారిని అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగమేనని వ్యాఖ్యనించారు. ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఇటీవలి హింసాకాండను ప్రస్తావిస్తూ మహారాష్ట్రలోనూ మతపరంగా ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. శరద్ పవార్ రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. బీమా కోరేగావ్ ఘటనపై విచారణను పక్కదారి పట్టించేందుకు శరద్ పవార్, భరిప బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాష్ అంబేడ్కర్లు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు బీమా కోరెగావ్ అల్లర్లతో సంబంధం లేదని పవార్ ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీసింది. పోలీసులు అసలైన నిందితులను పట్టుకోలేదని చెప్పడం ద్వారా పవార్ ఎవరిని రక్షించదలుచుకున్నారని శివసేన ప్రశ్నించింది. టీవీ ఛానెళ్ల కెమేరాలకే పరిమితమవకుండా పవార్ ప్రజల్లోకి వచ్చి శాంతిసామరస్యాలు నెలకొనేలా చొరవ చూపాలని హితవు పలికింది. -
‘చట్టాల’తో దళితులను కుమ్ముతున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ‘భీమ్ ఆర్మీ’ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఏడాది దాటి పోయింది. 2017, మే నెలలో సహరాన్‌పూర్‌లో జరిగిన హింసాకాండకు కారకుడన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. ఆ నెలలో దళితుల ఇళ్లపై అగ్రవర్ణాల వారు దాడి చేయడంతో మొదలైన ఇరు వర్గాల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనలకు సంబంధించి ఇతరులతోపాటు ఆజాద్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం నవంబరు నెలలో ఆజాద్ కేసు అలహాబాద్ కోర్టుకు రాగా, ఆజాద్‌పై ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవంటూ ఆక్షేపించిన జడ్జీలు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేశారు. ఆజాద్‌ను బేషరతుగా విడుదల చేయాల్సిన పోలీసులు వెంటనే ఆయనపై భయానకమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ఎలాంటి చార్జిషీటు, విచారణ లేకుండా ఎవరినైనా ఏడాది పాటు ఈ చట్టం కింద జైలు నిర్బంధంలో ఉంచవచ్చు. ఏడాది కాగానే మళ్లీ అదే చట్టాన్ని మరో ఏడాది పొడిగించవచ్చు. ఈ చట్టం కింద ఉన్న కాస్త భద్రత ఏమిటంటే....ముగ్గురు హైకోర్టు జడ్జీలతో కూడిన సలహా సంఘం ముందు మూడు నెలల నిర్బంధం అనంతరం నిందితుడు అప్పీల్ చేసుకోవచ్చు. మరి ఆజాద్‌కు అలాంటి అవకాశాన్ని కల్పించినదీ, లేనిది తెలియదు. ఆజాద్‌పై పోలీసులు చేసిన నేరారోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినంటూ హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ మరింత కఠినమైన చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు మళ్లీ జడ్జీల ముందు ఆజాద్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారని అనుకోలేం. హింసాకాండ కేసులోనే అగ్రవర్ణాలకు చెందిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారిలో ఒక్కరిపై కూడా ఈ జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించలేదు. వారంతా బెయిల్‌పై బలాదూర్ తిరుగుతున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కూడా ఈ జాతీయ భద్రతా చట్టం లాంటిదే. ‘బ్యాటిల్ ఆఫ్ బీమా కోరెగావ్ (1818, జనవరి ఒటటవ తేదీన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి దళిత సైనికులు పేశ్వా బాజీ రావు సేనలను ఓడించారు)’ 200 వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 31, 2017న ఘర్షణలు చెలరేగి ఒకరు మరణించడంతో మహారాష్ట్ర పోలీసులు టాప్ మావోయిస్టులను ‘చట్ట విరుద్ధ కార్యకలాపాలా నిరోధక చట్టం’ కింద అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఆ రోజు దళితులకు అడ్డంపడి గొడవ చేసిందీ కాషాయ దళాలు. కాషాయ జెండాలు ధరించి వారు దాడులు చేయడంతో ఘర్షణ జరిగింది. ఘర్షణ కారణమంటూ ప్రముఖ హిందూత్వ నాయకులు మిలింద్ ఎక్బోటే, సంబాజీ భిడేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిపై మాత్రం ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రయోగించలేదు. ఈ చట్టాన్ని కూడా ఎవరిపైనైనా సరే, ప్రయోగించవచ్చు. ఎలాంటి చార్జిషీట్లు, విచారణ లేకుండా నెలల తరబడి జైళ్ళలో ఉంచవచ్చు. యూపీలో ఘర్షణలు జరిగినందుకు దళితుల చీఫ్ ఆజాద్‌పై మొదటి చట్టాన్ని ప్రయోగించగా ఇక్కడ మహారాష్ట్రలో దళితుల కోసం పోరాడున్న మావోయిస్టులపై రెండో చట్టాన్ని పోలీసులు ప్రయోగించారు. ఈ రెండు చట్టాల్లో కూడా నిందితులు నేరం చేసినట్లుగా రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైన లేదు. తాము నేరం చేయలేదంటూ నిందితులే రుజువు చేసుకోవాలి. ఇంతటి రాక్షస చట్టాలను ఎత్తివేసేందుకు ఉద్యమాలు రావాలి. కానీ ఆ ఉద్యమాలను కూడా ఈ చట్టాలతోనే అణచివేస్తారేమో! -
మోదీ హత్యకు కుట్ర?
పుణె: ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారా? మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారా? అవుననే అంటున్నారు పుణె పోలీసులు. ప్రధానిని హత్య చేసేందుకు మావోయిస్టులు పెద్ద ప్రణాళిక రచించారంటూ వారు సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా–కోరెగావ్‌లో జరిగిన అల్లర్లతో సంబంధమున్న ‘ఈల్గర్ పరిషద్’కు చెందిన ఒక వ్యక్తి అరెస్టుతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చిందని పుణె సెషన్స్ కోర్టుకు పోలీసులు తెలిపారు. భీమా–కోరెగావ్ కేసులో ఈ వారంలో ముంబై, నాగపూర్, ఢిల్లీల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా.. వారిలో ఒకరైన రోనా విల్సన్ ఇంటి నుంచి పోలీసులు 3 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆ ఐదుగురిని సెషన్స్ కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా ఒక లేఖలోని అంశాల్ని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్ కోర్టుకు వెల్లడించారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసిన తరహాలో రోడ్‌షోల్లో మోదీని లక్ష్యంగా చేసుకోవాలని లేఖలో ఉంది. తనను తాను ‘ఆర్’గా పేర్కొన్న ఒక వ్యక్తి.. మావోయిస్టు ప్రకాశ్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. హత్య కోసం ఎం–4 రైఫిల్, 4 లక్షల రౌండ్ల మందుగుండు సమకూర్చుకునేందుకు రూ. 8 కోట్లు అవసరముందని లేఖలో పేర్కొన్నారు’ అని పవార్ కోర్టుకు వెల్లడించారు. విల్సన్‌తో పాటు మరో నలుగురికి కోర్టు జూన్ 14 వరకు రిమాండ్ విధించింది. అరెస్టైన వారిలో విల్సన్‌తో పాటు లాయర్ సురేంద్ర గాడ్లింగ్, దళిత కార్యకర్త సుధీర్ ధావలే, షోమా సేన్, మహేశ్ రౌత్ ఉన్నారు. విల్సన్ ఇంటి నుంచి పోలీసులు మరో 2 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒకదాంట్లో విప్లవ రచయిత వరవరరావు పేరు ఉంది. ఆయన మార్గదర్శకత్వం ఆధారంగా గడ్చిరోలి, చత్తీస్‌గఢ్, సూరజ్‌గఢ్‌లో జరిపిన దాడులతో మనకు దేశవ్యాప్తంగా పేరొచ్చిందని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. అసలు లేఖలో ఏముంది.. ‘హిందూ అతివాదాన్ని ఓడించడం మన ప్రధాన అజెండానే కాకుండా పార్టీ ముఖ్య కర్తవ్యం. సీక్రెట్ సెల్స్‌కు చెందిన పలువురు నేతలు, ఇతర సంస్థలు ఈ విషయాన్ని చాలా గట్టిగా నొక్కిచెప్పాయి. స్థానిక ఆదివాసీల జీవితాల్ని మోదీ నేతృత్వంలోని హిందూ అతివాద పాలన నాశనం చేస్తోంది. బిహార్, పశ్చిమ బెంగాల్‌ల్లో ఓడినా 15కిపైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్ని మోదీ ఏర్పాటు చేయగలిగారు. ఇదే వేగం కొనసాగితే అన్ని వైపులా నుంచి మన పార్టీకి భారీ నష్టం తప్పదు. మోదీరాజ్ను అంతమొందించేందుకు కామ్రేడ్ కిషన్, మరికొందరు సీనియర్ కామ్రేడ్స్ నిర్మాణాత్మక చర్యల్ని ప్రతిపాదించారు. రాజీవ్ హత్య∙తరహాలో మేం ఆలోచిస్తున్నాం’ అని లేఖలో ఉంది. మే 21, 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో మహిళా ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయారు. ‘అయితే ఇది ఆత్మహత్యాసదృశ్యమే. దీని అమలులో మనం విఫలమయ్యే అవకాశమున్నా పార్టీ పీబీ(పోలిట్ బ్యూరో/సీసీ(సెంట్రల్ కమిటీ)ఈ ప్రతిపాదనపై ఆలోచన చేయాలని మనం కోరుకుంటున్నాం. మోదీ రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకోవడం ఉత్తమ వ్యూహం. అన్ని త్యాగాల కంటే పార్టీ మనుగడే ముఖ్యమని మనమంతా నమ్ముతున్నాం’ అని లేఖలోని అంశాల్ని పవార్ కోర్టుకు వివరించారు. రెండో లేఖలో ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ప్రస్తావన ఇక రెండో లేఖను కామ్రేడ్ ఆనంద్‌ను ఉద్దేశిస్తూ కామ్రేడ్ ప్రకాశ్ రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పకుండా గొడవలకు దారి తీస్తుంది. మనం మూడు నెలల క్రితం ఒక రాష్ట్రంలో ప్రారంభించాం. అది మరో మూడు రాష్ట్రాలకు వ్యాపించింది. దళిత ప్రచారం విషయంలో మీరు చేసిన కృషి పట్ల సీసీ(సెంట్రల్ కమిటీ) ఆనందంగా ఉంది. దళిత అంశాలపై సెమినార్లు, ప్రసంగాల కోసం ఏడాదికి రూ. 10 లక్షలు ఇచ్చేందుకు సీసీ అంగీకరించింది’ అని లేఖలో ఉంది. మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు లేఖలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు మావోల నుంచి 2 బెదిరింపు లేఖలొచ్చాయి. ‘నన్ను, నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తూ మావోలు సీఎం కార్యాలయానికి ఈ లేఖలు పంపారు. ఇంతవరకూ నక్సల్స్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరించారు’ అని ఫడ్నవిస్ చెప్పారు. ఈ లేఖల్లో గడ్చిరోలి ఎన్కౌంటర్లలో 39 మంది మావోలు మరణించిన అంశాన్ని ప్రస్తావించారని, వారం క్రితం ఈ లేఖలు సీఎం కార్యాలయానికి వచ్చాయని, దర్యాప్తు కోసం వాటిని పోలీసులు అందచేసినట్లు మహారాష్ట్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మూడో లేఖలో వరవరరావు ప్రస్తావన.. ‘గత 4 నెలల్లో నక్సల్ సానుభూతిపరుడు వరవర రావు, కామ్రేడ్ సురేంద్ర గాడ్లింగ్ అందించిన మార్గనిర్దేశకత్వం ఆధారంగా మనం చేసిన దాడులతో జాతీయ స్థాయిలో పేరొచ్చింది. గడ్చిరోలి, చత్తీస్‌గఢ్, సూరజ్‌గఢ్‌లో చేసిన దాడులు పేరు తీసుకొచ్చాయి. వచ్చే కొద్ది నెలలు వీటిని కొనసాగించాలి. ఇదే తరహా దాడుల్ని విజయవంతంగా కొనసాగించే బాధ్యతను వరవర రావుకు అప్పగించారు. వాటి కోసం సురేంద్రకు వరవర రావు నిధులు సమకూర్చారు. నిధులు సురేంద్ర మీకిస్తారు. మార్చి, ఏప్రిల్‌లో జరిగే సమావేశాల కోసం వరవర రావు, సురేంద్ర వ్యక్తిగతంగా మార్గనిర్దేశకత్వం చేస్తారు’ అని కామ్రేడ్ ‘ఎం’ ఈ లేఖ రాశారని పోలీసులు చెప్పారు. ఈ కథలు మోదీకి మామూలే ప్రజాదరణ తగ్గినప్పుడల్లా ఇలాంటి కథలు అల్లడం సీఎంగా ఉన్నప్పటి నుంచి మోదీకి అలవాటేనని కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ నిరుపమ్ అన్నారు. లేఖల కల్పితమని చెప్పట్లేనని, విల్సన్ ఇంట్లో దొరికినట్లు చెపుతున్న లేఖలపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మమ్మల్ని కలచివేశాయి: రవిశంకర్ మోదీని హత్య చేసేందుకు మావోలు కుట్ర పన్నారన్న కథనాలు తీవ్రంగా కలచివేశాయని, మావోయిస్టులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. మావోల కుట్రను బయటపెట్టేలా నిజాయతీగా దర్యాప్తు జరగాలని, దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. -
భీమా-కోరేగావ్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు
పుణె: ఈ జనవరి ఒకటో తేదీన చోటుచేసుకున్న భీమా-కోరేగావ్ ఘటనలో ప్రధాన నిందితుడు మిలింద్ ఎక్‌బోతేను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్‌బోతే ముందస్తు బెయిల్‌కు చేసుకున్న దరఖాస్తును సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిందితుల్ని పట్టుకోకుండా వారికి కొమ్ము కాస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ బీజేపీ ప్రభుత్వం స్పందించింది. ఘటన సందర్భంగా నమోదైన చిన్న చిన్న కేసుల్ని ఉపసంహరించుకున్నామని సర్కార్ ప్రకటించింది. తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు అడిషనల్ డీజీపీతో కమిటీ వేస్తున్నట్లు తెలిపింది. ఆ ఘటనలో జరిగిన రూ.13 కోట్ల ఆస్తుల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించింది. హిందుత్వ నినాదాలతో దాడి.. భీమా-కోరేగావ్ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 200వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్న దళితులపై కోరేగావ్‌లో జనవరి 1న దాడి జరిగింది. కొందరు హిందూత్వ నినాదాలు చేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. ‘సమస్త హిందూ ఏక్తా అఘాదీ’ ఛీఫ్ మిలింద్ ఎక్‌బోతే అతని అనుచరులు ఈ దాడికి నేతృత్వం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డ విషయం విదితమే. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ : పూణేలో తాను ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని దళిత నేత, గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవాని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తనను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ర్టలో భీమా - కొరేగావ్ ఘటనల నేపథ్యంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 31న జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మెవాని, జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, మహారాష్ర్ట బంద్‌లోనూ పాల్గొనలేదని మెవాని స్పష్టం చేశారు. తనను ఆర్ఎస్ఎస్, బీజేపీలు లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు మహారాష్ర్ట ఘటనలను నిరసిస్తూ దళితులు చేపట్టిన నిరసనలు గుజరాత్, యూపీలనూ తాకాయి. పూణేలో దళిత యువకుడి హత్యను ఖండిస్తూ యూపీలోని ముజఫర్‌నగర్‌లోనూ దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
‘వాట్సాప్’ సందేశాలతో సమాధి కూల్చారు
సాక్షి, న్యూఢిల్లీ : పుణెకు సమీపంలోని ‘భీమా కోరేగావ్’లో ఘర్షణలు చెలరేగినప్పుడే ఆ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘వాడు బుద్రుక్’ గ్రామంలో కూడా ఘర్షణలు చెలరేగాయి. బుద్రుక్ గ్రామానికి కూడా చారిత్రక విశేషం ఉంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు సంభాజీ మహరాజ్ సమాధి ఈ గ్రామంలో ఉంది. (సాక్షి ప్రత్యేకం) వారి ప్రగతిశీల భావాలకుగాను ఈ ఇద్దరు రాజులను మరాఠాలతోపాటు దళితులు కూడా సమంగా ఆరాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రచారంలో ఉన్న ఓ చారిత్రక కథ ప్రకారం మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్‌కు బద్ద శత్రువైన సంభాజీ మహరాజ్‌ను 1689లో హత్య చేయగా, ఆయన శరీర భాగాలు వాడు ముద్రుక్ గ్రామంలో చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ రాజుకు ఎవరు దహన సంస్కారాలు కూడా చేయకూడదంటూ ఢిల్లీ సుల్తాన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులకు స్థానిక ప్రజలు కూడా ఎక్కువ మంది భయపడి పోయారు. (సాక్షి ప్రత్యేకం) అప్పుడు బుద్రుక్ గ్రామానికే చెందిన మహర్ అనే దళితుడు గోవింద్ గైక్వాడ్ ముందుకు వచ్చి ధైర్యంగా మహరాజ్‌కు దహన సంస్కారాలు నిర్వహించారు. అందుకని ఆయన పేరిట గ్రామంలో ఓ స్మారక గహం వెలిసింది. భీమా కోరేగావ్ స్థూపాన్ని సందర్శించే వారంతా ఈ వాడు బుద్రుక్ గ్రామాన్ని కూడా సందర్శిస్తారు. ముందుగా సంభాజీ మహరాజ్ సమాధిని సందర్శించి, ఆ తర్వాత గైక్వాడ్ స్మారక భవనాన్ని సందర్శకులు సందర్శిస్తారని స్థానికులు తెలియజేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి తమ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను చూశామని పూర్తి పేరు వెల్లడించడానికి ఇష్టపడని గ్రామానికి చెందిన ఓ గైక్వాడ్ తెలిపారు. ఆరెస్సెస్ లాంటి సంస్థలు వాట్సాప్ ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయని తాము గ్రహించామని ఆయన చెప్పారు. (సాక్షి ప్రత్యేకం) ఘర్షణలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా డిసెంబర్ 28వ తేదీనే గ్రామంలో ఓ శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఎట్టి పరిస్థితుల్లో గొడవలు జరుగకుండా చూడాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేతుల్లోకి రాళ్లు, ఇతర ఆయుధాలు తీసుకోరాదని యువకులకు పిలుపునిచ్చామని గైక్వాడ్ తెలిపారు. శివప్రతిష్టాన్ నాయకుడు మనోహర్ అలియాస్ సంభాజీ భిడే (గురూజీ–85 ఏళ్లు), సమస్త హిందూ అఘదీ నాయకుడు మిలింద్ ఎక్బోటే (60) పిలుపుతో కొంత మంది ఆరెస్సెస్ కార్యకర్తలు డిసెంబర్ 30వ తేదీన వాడు ముద్రుక్‌లోని గోవింద్ గైక్వాడ్ సమాధిని ధ్వంసం చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానుల చేతుల్లో మరణించిన సంభాజీ మహరాజ్‌కు దళితుడైన గోవింద్ గైక్వాడ్ అంత్యక్రియలు నిర్వహించారని, అందుకే అక్కడ ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని జీర్ణించుకోలేకనే ఈ ఇద్దరు వద్ధ హిందూ నాయకులు గోవింద్ గైక్వాడ్ సమాధి ధ్వంసానికి ఆరెస్సెస్ కార్యకర్తలను వాట్సాప్ సందేశాల ద్వారా రెచ్చగొట్టినట్లు తెలుస్తోందని గైక్వాడ్ అభిప్రాయపడ్డారు. (సాక్షి ప్రత్యేకం) బీసీ నాయకుల డిమాండ్ మేరకు మహారాష్ట్ర పోలీసులు ఈ ఇరువురు హిందూ నాయకులపై కేసులు పెట్టారు. అయితే వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎక్బోటే, బిడేలు ఆరెస్సెస్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్నవారు. అల్లర్లు నివారించేందుకు తాము ఎంత కషి చేసినా ఫలితం లేకపోవడం బాధాకరంగా ఉందని గైక్వాడ్ అన్నారు. దళితులే ముందుగా దాడికి దిగారని, అందుకే తాము ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని మరాఠాలు చెబుతున్నారని, తమ గ్రామంలో వంద మంది దళితులు ఉండగా, ఏడువేల మంది మరాఠాలు ఉన్నారని, అలాంటప్పుడు దళితులు దాడి చేయడం అటుంచి, రెచ్చగొట్టే పరిస్థితి కూడా లేదని గైక్వాడ్‌తోపాటు గ్రామంలో శాంతిని కోరుకుంటున్న కొందర పెద్దలు మీడియాతో వ్యాఖ్యానించారు. (సాక్షి ప్రత్యేకం) -
గుజరాత్లో హై అలర్ట్!
అహ్మదాబాద్: మహారాష్ట్రలోని ‘భీమా–కోరేగావ్’ ఘటన సంబంధిత అల్లర్లు తాజాగా గుజరాత్‌కు పాకాయి. దీంతో గుజరాత్లో హైఅలర్ట్ ప్రకటించారు. రాజ్‌కోట్-సోమ్‌నాథ్ జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి రోడ్డును నిర్బంధించారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతుండటంతో పోలీసులు గుజరాత్ అంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. భీమా-కోరేగావ్ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ వర్గం చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారటంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. భీమా-కోరేగావ్ ఘటన సందర్భంగా దళితులపై దాడిని నిరసిస్తూ.. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) బహుజన మహాసంఘ్, దళిత నేత ప్రకాశ్ అంబేడ్కర్ బుధవారం ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముంబై, పుణే సహా రాష్ట్రమంతా స్తంభించిన సంగతి తెలిసిందే. గురువారం మహారాష్ట్రలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండగా.. ఆ ప్రకంపనలు తాజాగా గుజరాత్‌ను తాకాయి. అఖిల భారత జాతీయ విద్యార్థుల సదస్సుకు బ్రేక్..! భీమా-కోరేగావ్ హింస, తాజా పరిస్థితుల నేపథ్యంలో ముంబైలో తలపెట్టిన అఖిల భారత జాతీయ విద్యార్థుల సదస్సుకుపోలీసులు అనుమతి నిరాకరించారు. గుజరాత్ దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని, జేఎన్టీయూ విద్యార్థి ఉమర్ ఖలీద్ హాజరవుతుండటంతో ఈ సదస్సుకు చివరినిమిషంలో అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ సదస్సు కోసం వచ్చిన విద్యార్థులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తలపెట్టిన ఛాత్ర భారతి సభ్యులు జుహూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. -
‘మహా’ బంద్ హింసాత్మకం
ముంబై/పుణే: మహారాష్ట్రలో ‘భీమా–కోరేగావ్’ ఘటన తాలూకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ముంబై, పుణే సహా మహారాష్ట్రలోని పలు సున్నిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత హింసాత్మకంగా మారింది. ముంబైలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థతోపాటుగా జనజీవనం స్తంభించింది. హార్బర్ లైన్ సహా రెండుచోట్ల రాళ్లురువ్విన ఘటనలూ చోటుచేసుకున్నాయి. భీమా–కోరేగావ్ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ వర్గం చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారటంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) బహుజన మహాసంఘ్, దళిత నేత ప్రకాశ్ అంబేడ్కర్ బుధవారం ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. ముంబై, పుణేల్లో వందలమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఆందోళలు జరిగాయని ప్రకాశ్ అంబేడ్కర్ తెలిపారు. నవీ ముంబై, థానే, పుణే, ఔరంగా బాద్, నాందేడ్, పర్భణీ, వాషిం, అకోలా, సింధుదుర్గ్, రాయ్‌గఢ్, కోల్హాపూర్ ప్రాంతాల్లోనూ పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఉద్రిక్తతలకు కారకులైన వారిని వదిలిపెట్టబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. బాంబే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామన్నారు. స్తంభించిన ముంబై చెంబూర్, ఘాట్కోపర్, కామ్రాజ్ నగర్, దిందోషి, కాందివలి, జోగేశ్వరి, కళానగర్, మాహిమ్‌లలో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. హార్బర్ లైన్‌లోని గోవండీ, మార్‌ఖుర్ద, కుర్లా, నాలా సోపారా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నిరసనకారులు బైఠాయించారు. దీంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్నినస్‌కి రావాల్సిన రైళ్లు శివారు స్టేçషన్లలోనే నిలిచిపోయాయి. ముంబైకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన డబ్బావాలాలు కూడా తమ సేవలను నిలిపివేశారు. స్కూలు బస్సులు నడవకపోవటంతో బుధవారం కూడా పాఠశాలలు మూసే ఉంచారు. పుణేలోనూ విధ్వంసం పుణేలోనూ నిరసనకారులు బస్సులు, రైళ్లపై రాళ్లు రువ్వారు. రెండ్రోజులుగా పుణేలో జరుగుతున్న ఆందోళనల్లో 42 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇవి కాకుండా నగరంలో బంద్ ప్రశాంతంగానే జరిగిందన్నారు. కాగా, ‘భీమా–కోరేగావ్’ సంస్మరణ సంబరాలను వ్యతిరేకించిన సమస్త హిందూ అఘాడీ చీఫ్ మిలింద్ ఎక్బోటే ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన దళిత సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, డిసెంబర్ 31న పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ, జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్‌లు విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఫిర్యాదు రావటంతో పుణే పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ట్రాఫిక్‌ను అడ్డగిస్తున్న ఆందోళనకారులు -
ఈ ఘర్షణలు మొట్టమొదటిసారి..
సాక్షి, న్యూఢిల్లీ : దళితుల ఆందోళనతో మహారాష్ట్ర దద్దరిల్లడానికి దారితీసిన ‘బీమా కోరేగావ్’ యుద్ధం స్మారక దినోత్సవానికి 200 ఏళ్లు. అగ్రవర్ణమైన పెషావర్లకు, మహర్లతో (దళితులు) కూడిన బ్రిటిష్ సైన్యానికి మధ్యన 1818లో యుద్ధం జరిగింది. స్మారక స్థూపాన్ని మాత్రం కోరేగావ్‌లో 1851లో నిర్మించారు. దళితుల నాయకుడు డాక్టర్ అంబేడ్కర్ 1927లో ఆ స్మారక స్థూపాన్ని సందర్శించి కోరేగావ్ రెజిమెంట్ సైన్యం సేవల గురించి గ్రామస్థులనుద్దేశించి ప్రసంగించారు. దాంతో 1927 నుంచే అధికారికంగా స్మారకోత్సవం ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన దేశం నలుమూలల నుంచి దళితులు అక్కడికెళ్లి స్మారకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఆరేడు ఏళ్లుగా స్మారక స్థూపం వద్ద సందర్శకుల సందడి పెరగ్గా, ఈ రెండేళ్ల కాలంలో మరింత పెరిగింది. మరాఠాలు, దళితుల మధ్య సామరస్యపూర్వకంగానే ఎప్పుడూ ఈ కార్యక్రమం సజావుగా సాగుతూ వస్తోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవు. సందర్శకుల కోసం మరాఠీలే ఉచితంగా తాగునీటి స్టాళ్లను ఏర్పాటు చేసి ఆహారాన్ని కూడా ఉచితంగానే అందించే వారు. తమ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాల్సిందిగా, ఇంట్లో భోజనం చేయాల్సిందిగా దళిత పర్యాటకులను మరాఠాలు ఇళ్లలోకి ఆహ్వానించేవారు. గ్రామంలోని గణేశ్ ధీరేంజ్ లాంటి ప్రముఖ మరాఠా కుటుంబీకులు దూరం నుంచే స్థూపాన్ని స్మరించేవారు ఈ సారే మొట్టమొదటిసారిగా సామరస్య కార్యక్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తలు జరుగుతాయని ముందే ఊహించినట్లున్నారు స్థానిక భీమా పంచాయతీ సర్పంచ్ పర్యాటకులకు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఎస్సీ మహిళ ఈసారి సర్పంచ్‌గా గెలిచారు. -
మహారాష్ట్రలో చిచ్చు పెట్టిన ‘ఫేస్బుక్ పేజీ’
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర దళితుల ఆందోళనతో దద్ధరిల్లిపోవడానికి దారితీసిన భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు? కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన భీమా కోరేగావ్ స్థూపం వద్ద ప్రశాంతంగా జరిగే సైనిక సంస్మరణ కార్యక్రమం ఎందుకు ఉద్రిక్తతలకు దారితీసింది? కాషాయ వస్త్రాలు, జెండాలు ధరించిన మరాఠా మూకలు దాడి చేశారంటూ నీలి రంగు జెండాలతో దేశం నలుమూలల నుంచి వచ్చిన దళితులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఊరూరు నుంచి తరలి వచ్చింది దళితులేనని, ఒక్క ఊరి వారమైనా తాము పరిమిత సంఖ్యలో ఉండి దాడులకు ఎలా సాహసిస్తామని అంటున్న స్థానిక మరాఠాల మాటల్లో నిజమెంత? మహారాష్ట్రలోని పుణె నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భీమా నది ఒడ్డునున్న కోరేగావ్ గ్రామంలో నాటి నుంచి నేటి వరకు మరాఠాలు, పెషావర్లు, దళితులు ఎక్కువే. 200 సంవత్సరాల క్రితమ అగ్రవర్ణానికి చెందిన పెషావర్ల సైన్యాన్ని బ్రిటీష్ సైన్యంతో కలసి దళితులైన మహర్లు తరిమికొట్టారు. దళితులైనప్పటికీ నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం వారిని తమ సైన్యంలో చేర్చుకొంది. (సాక్షి ప్రత్యేకం) అప్పటికే సామాజిక న్యాయం కోరుతున్న దళితులు తమకు ఉద్యోగం ఇచ్చిందన్న కతజ్ఞతతో, పెషావర్లపై నున్న ఆగ్రహంతో బ్రిటీష్ సైన్యంతో కలిసి యుద్ధం చేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన దళిత హీరోల స్మారకార్థం భీమా కోరేగావ్‌లో 1851లో స్థూపం వెలిసింది. కాషాయ జెండాలు కలిగిన హిందూ సంఘాలు తమపై దాడి చేశాయంటూ ఇటు దళితులు, నీలి జెండాలు కలిగిన దళితులే దాడులు చేశారంటూ మరాఠా, ఇతర హిందూ సంస్థల నాయకులు పరస్పరం ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు ఇవిగో అంటూ ఇరువర్గాల వారు వీడియో రికార్డింగ్‌లను చూపిస్తున్నారు. వాటిల్లో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడం, ఘర్షణ పడడం కనిపిస్తోంది. స్థానికంగా ఇరువర్గాల ఇళ్లు, దుకాణాలు తగులబడుతూ కనిపిస్తున్నాయి. పోలీసులకు ఇరువర్గాల వారు ఘర్షణ పడుతున్నారని చెబుతున్నారుగానీ, అసలు ఉద్రిక్తతలకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. మొత్తంగా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ ఉద్రిక్తలకు వారం రోజుల క్రితమే బీజాలు పడ్డాయని, వ్యూహం ప్రకారం గత వారం రోజులుగా ‘ఫేస్బుక్’లో జరుగుతున్న ప్రచారమే ఈ ఉద్రిక్తతలకు దారితీసిందని స్పష్టం అవుతోంది. కొంత మంది ఔత్సాహిక చరిత్రకారులు ఫేస్బుక్లో నడుపుతున్న ‘ఇతిహాస ఫాల్ఖుదా’ అనే మరాఠా పేజీ నేటి ఉద్రిక్తతలకు కారణమైంది. ‘భీమా కోరేగావ్’ చరిత్రతో దళితులైన మహర్లకు ఎలాంటి సంబంధం లేదని, భీమా కోరేగావ్ యుద్ధం కేవలం పెషావర్లకు, బ్రిటీష్ సైన్యానికి మధ్య జరిగినది మాత్రమేనని ఆ మరాఠా పేజీలో ఔత్సాహిక చరిత్రకారులు వాదించారు. ఆ యుద్ధం గురించి ప్రస్తావించిన బ్రిటిష్ డాక్యుమెంట్లను సాక్షంగా చూపారు. మహర్లు నిజంగా యుద్ధం చేసి ఉంటే బ్రిటిష్ డాక్యుమెంట్లలో వారి ప్రస్తావన ఉండేదని తర్కం తీసుకొచ్చారు. మహర్ రెజిమెంట్ ఏర్పాటు కాకముందే దాదాపు 500 మంది మహర్లు బ్రిటిష్ తరఫున పోరాటం చేశారని, (సాక్షి ప్రత్యేకం) అందుకు భారత చరిత్రలో సాక్ష్యాధారాలు ఉన్నాయని సావిత్రిభాయ్ ఫూలే పుణే యూనివర్శిటీలో చరిత్ర విభాగం ప్రొఫెసర్ శ్రద్ధా కుంభోజ్కర్ తెలిపారు. బ్రిటీష్ డాక్యుమెంట్లు తమ సైన్యం చేసిన యుద్ధాల గురించి చెబుతుందిగానీ, ఆ యుద్ధంలో మహర్లు పాల్గొన్నారా? మరొకరు పాల్గొన్నారా? అన్న విషయాన్ని ఎందుకు పేర్కొంటుందని ఆమె ప్రశ్నించారు. అగ్రవర్ణాలపై యుద్ధం చేయడానికి భీమా కోరేగావ్ దళితులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, అంతటి స్ఫూర్తినిచ్చిన యుద్ధంతో వారికి సంబంధం లేదంటూ చరిత్రకు మరోరూపం ఇచ్చేందుకు ఈ ఫేస్బుక్ పేజి ప్రయత్నించినట్లు అర్థం అవుతోందని ప్రొఫెసర్ వివరించారు. దేశంలో గత రెండు, మూడేళ్లుగా చరిత్రకు మరో భాష్యం చెప్పే ప్రయత్నాలు ఎక్కువగానే కొనసాగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రో పెషావర్లు చేసిన అన్ని యుద్ధాలతోపాటు భీమా కోరేగావ్‌లో మహర్లతో పెషావర్లకు మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా ‘మంత్రవేగ్ల’ పుస్తకంలో రచయిత ఎన్ఎస్ ఇనాంధర్ వివరించారు. (సాక్షి ప్రత్యేకం) ఫేస్బుక్ మరాఠా పేజీలో వారం, పది రోజుల నుంచి జరుగుతున్న చర్చను చదువుకున్న నేటి దళిత యువతలో కొంత మంది తీవ్రంగానే ఖండించారు. ఈసారి పెద్ద ఎత్తున స్మారక దినోత్సవం జరుపుకోవాలని కూడా దళిత సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఎక్కువ మంది దళితులు కోరేగావ్ తరలి వచ్చారు.