సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో సామాజికవేత్తను అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి (83)ని ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, ఆదివాసీల హక్కుల కోసం స్టాన్ స్వామి గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన రోనా విల్సన్, అరుణ్ ఫెరారియతో స్తాన్ స్వామికి సంబంధం ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అయితే, ఎలాంటి వారెంట్ లేకుండా స్టాన్ స్వామిని అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment