న్యూఢిల్లీ: భీమ్-కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావు సహా పౌరహక్కుల నేతల గృహనిర్భందాన్ని సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు పొడిగించింది. సిట్ దర్యాప్తు జరిపించాలన్న పిటిషనర్ల డిమాండ్‌ను తోసిపుచ్చుతూ, పుణె పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టయిన నేతలు ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని కూడా తెలిపింది.
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత నెల 28న విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా కోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్నారు.
పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడిగింపు
Published Fri, Sep 28 2018 12:26 PM | Last Updated on Fri, Sep 28 2018 4:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment