Fact Check: Image Of Stan Swamy Tied On Hospital Bed Is Real Or Fake? - Sakshi
Sakshi News home page

Fact Check: స్టాన్‌ స్వామి పేరుతో ఫొటో వైరల్‌

Published Tue, Jul 6 2021 11:05 AM | Last Updated on Tue, Jul 6 2021 12:47 PM

Fact Check On Unrelated Image Shared As Stan Swamy Tied To Hospital Bed - Sakshi

ఆక్సిజన్‌ సపోర్ట్‌ మీద ఉన్న ఫాదర్‌ స్టాన్‌ స్వామి.. 84 ఏళ్ల వయసులో.. పైగా కాళ్లు చేతులు గొలుసులతో బంధించి ఉంటాయి. ఇంత కంటే దారుణం ఉంటుందా? అంటూ ఓ ఫొటోను నెట్‌లో వైరల్‌ చేస్తున్నారు కొందరు. ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితుడిగా శిక్ష అనుభవించిన స్టాన్‌ స్వామి.. గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కొందరు ఓ ఫొటోను వైరల్‌ చేస్తున్నారు.  

వైరల్‌.. గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి ఆక్సిజన్‌ సపోర్ట్‌ మీద ఉన్నారు. అలాంటి వ్యక్తిని సంకెళ్లతో బంధించి మరీ చికిత్స అందించారు. ఈ వయసులో ఆయనను అంతలా కష్టపెట్టడం దారుణం. వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో.. అంటూ కొందరు నెటిజన్స్‌ ఆ ఫొటోను వైరల్‌ చేస్తున్నారు. 

ఫ్యాక్ట్‌ చెక్‌.. అయితే గూగుల్‌​ రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో అది మే నెలలో బాగా వైరల్‌ అయిన ఫొటోగా తేలింది. ఆ వ్యక్తి పేరు బాబురామ్‌ బల్వాన్‌(92). ఓ హత్య కేసులో యూపీ ఉటా జైళ్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో అతన్ని ఆస్పతత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. అయితే ఈ ఫొటో కూడా వివాదాస్పదం కాగా.. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు అప్పుడు. అయినా ఆ వివాదం సర్దుమణగపోకపోవడంతో వార్డెన్‌ను సస్పెండ్‌ చేశారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement