Actor Prathap Pothen Last Posts About Death Goes Viral, Details Inside - Sakshi
Sakshi News home page

Prathap Pothen Last Posts: ఆలోచింపజేసేలా నటుడి చివరి పోస్ట్‌.. నెట్టింట వైరల్‌

Published Fri, Jul 15 2022 9:29 PM | Last Updated on Sat, Jul 16 2022 9:15 AM

Actor Prathap Pothen Last Posts About Death Goes Viral - Sakshi

Prathap Pothen Last Posts About Death Goes Viral: ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు హాఠాత్తుగా మరణిస్తున్నారు. తాజాగా శుక్రవారం (జులై 15) ఉదయం ప్రముఖ నటుడు, డైరెక్టర్‌ ప్రతాప్‌ పోతెన్‌ (70) కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మరణానికి ముందు సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ప్రతాప్‌ పోతెన్‌ గురువారం ఉదయం 9:38 గంటలకు జార్జ్‌ కార్లిన్‌ కోట్‌తో కూడిన ఫొటోను పోస్ట్‌ చేశారు. 'చాలా కాలంగా చిన్న మొత్తంలో లాలాజలం మింగడం వల్ల మరణం సంభవిస్తుంది' అని ఈ పోస్ట్‌లో రాసి ఉంది. తర్వాత ఆయన మరణానికి 16 గంటల ముందు 'ఒక సమస్య మూల కారణానికి చికిత్స చేయకుండా దాని లక్షణాలకు చికిత్స చేసినప్పుడు మీరు ఫార్మసీపై ఆధారపడటం ప్రారంభిస్తారు' అని పోస్ట్‌ పెట్టారు ప్రతాప్‌ పోతెన్. దీంతోపాటు 'జీవితం అనే ఆటలో ప్రతీ జనరేషన్‌ ఒకేలా ఆడుతుంది' అని రాసుకొచ్చారు. అనంతరం ఆయన తుదిశ్వాస విడవటానికి 15 గంటల ముందు పెట్టిన జిమ్‌ మోరిసన్ కోట్‌లో 'నేను కళల్లో గుర్తింపు ఉందనుకున్నాను. ఇంకా చెప్పాలంటే చలనచిత్రాల్లో ఉందనుకున్నాను. కానీ ప్రజలు తమకు నచ్చినవాటిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ఉంది. 

ఈ కోట్స్‌ చూస్తుంటే ప్రతాప్‌ పోతెన్‌ తన మరణాన్ని ముందే ఊహించారా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారి, ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాగా ప్రతాప్ పోతెన్‌ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాలతో కలిపి సుమారు 100 సినిమాల్లో నటించారు. ప్రతాప్‌ పోతెన్‌ నటుడిగా మాత్రమే కాకుండా 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్‌ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే విడాకులు తీసుకుని విడిపోయారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement