Pratap Pothen
-
బ్లాక్ అండ్ వైట్ స్పై థ్రిల్లర్.. ఆసక్తి పెంచుతోన్న 'గ్రే'
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'గ్రే: ద స్పై హూ లవ్డ్ మి'. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీని అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మించగా.. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26న విడుదల కానుంది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ.. 'ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్. అందులో నుంచి పుట్టిన ఐడియానే ఈ గ్రే మూవీ. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే ఈ స్పై డ్రామా' అని అన్నారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) మా ‘గ్రే’ చిత్రం 2022లో పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు ఎంపికైంది. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫిలిం ఫెస్టివల్ 2022 లో విన్నర్‌గా నిలిచింది. 2022 ఆసియన్ ఫిలిం ఫెస్టివల్, బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు గ్రే చిత్రాన్ని కొనియాడారు. -
మరణాన్ని ముందే ఊహించిన నటుడు !.. చివరి పోస్ట్ వైరల్
Prathap Pothen Last Posts About Death Goes Viral: ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు హాఠాత్తుగా మరణిస్తున్నారు. తాజాగా శుక్రవారం (జులై 15) ఉదయం ప్రముఖ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతెన్ (70) కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మరణానికి ముందు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రతాప్ పోతెన్ గురువారం ఉదయం 9:38 గంటలకు జార్జ్ కార్లిన్ కోట్తో కూడిన ఫొటోను పోస్ట్ చేశారు. 'చాలా కాలంగా చిన్న మొత్తంలో లాలాజలం మింగడం వల్ల మరణం సంభవిస్తుంది' అని ఈ పోస్ట్‌లో రాసి ఉంది. తర్వాత ఆయన మరణానికి 16 గంటల ముందు 'ఒక సమస్య మూల కారణానికి చికిత్స చేయకుండా దాని లక్షణాలకు చికిత్స చేసినప్పుడు మీరు ఫార్మసీపై ఆధారపడటం ప్రారంభిస్తారు' అని పోస్ట్ పెట్టారు ప్రతాప్ పోతెన్. దీంతోపాటు 'జీవితం అనే ఆటలో ప్రతీ జనరేషన్ ఒకేలా ఆడుతుంది' అని రాసుకొచ్చారు. అనంతరం ఆయన తుదిశ్వాస విడవటానికి 15 గంటల ముందు పెట్టిన జిమ్ మోరిసన్ కోట్లో 'నేను కళల్లో గుర్తింపు ఉందనుకున్నాను. ఇంకా చెప్పాలంటే చలనచిత్రాల్లో ఉందనుకున్నాను. కానీ ప్రజలు తమకు నచ్చినవాటిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ఉంది. ఈ కోట్స్ చూస్తుంటే ప్రతాప్ పోతెన్ తన మరణాన్ని ముందే ఊహించారా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారి, ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాగా ప్రతాప్ పోతెన్ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాలతో కలిపి సుమారు 100 సినిమాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాకుండా 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే విడాకులు తీసుకుని విడిపోయారు. -
‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్, సీనియర్ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్‌గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. -
స్పై థ్రిల్లర్‌గా గ్రే మూవీ, ఆలోచనలకు అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్..
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ.. ‘ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్ అవన్ని. అందులో నుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ..మనం సాధారణంగా మంచిని తెలుపుగాను, చెడును నలుపుగాను చూస్తుంటాం. కాని ఆ రెండు కలర్స్ మధ్యలో కొన్ని వందల షేడ్స్ ఉంటాయి. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే గ్రే..ఒక స్పై డ్రామా. అరవింద్ కృష్ణతో రెండు సినిమాలు చేశాను. మళ్లీ అతనితో కలిసి చేయడం హ్యాపీ. ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేశారు. అలీ రెజాని బిగ్‌బాస్ తర్వాత కలిశాను. చాలా మంచి నటుడు. వీరిద్దరితో పాటు ప్రతాప్ పోతన్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఒక రకంగా సూత్రధారి క్యారెక్టర్. ఊర్వశీ రాయ్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆమెది లీడింగ్ లేడీ క్యారెక్టర్. సినిమా ఫస్ట్ కాపీ చూశాం. చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరికీ నచ్చింది. ఆడియన్స్ కి కూడా తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. దానికోసం అన్ని అంశాలను రీసెర్చ్ చేయడం జరిగింది’ అన్నారు. ఈ సినిమాలో ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్, రాజ్ మదిరాజు, షాని సాల్మోన్, నజియా, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు. -
సిమెంట్‌పై జీఎస్టీని 18%కి తగ్గించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో సిమెంట్ పరిశ్రమ ప్రధాన భాగస్వామి అని ఫస్ట్ కన్స్ట్రక్షన్ కౌన్సిల్ (ఎఫ్‌సీసీ) తెలియజేసింది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎస్టీని వెంటనే 18 శాతానికి తగ్గించాలనే అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని.. త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడుతుందని ఎఫ్‌సీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ప్రతాప్ పడోడే తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన రెండు రోజుల 10వ సిమెంట్ ఎక్స్పో సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో అందుబాటు గృహాలు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక రంగాల్లో సిమెంట్ వినియోగం పెరుగుతుందని చెప్పారు. దేశ వృద్ధి కంటే సిమెంట్ పరిశ్రమ వృద్ధి జోరుగా ఉందన్నారు. ప్రపంచ సిమెంట్ ఉత్పత్తిలో మన దేశానిది రెండో స్థానంలో ఉందని, థర్మల్ ప్రాసెస్ సామర్థ్యాల పరంగా సిమెంట్ ఉత్పత్తిని చేయడంలో మన దేశానిది స్థానం ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో రహదారులు, పట్టణాభివృద్ధి, విద్యుత్ వంటి మౌలిక రంగాల్లో 454 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో అదనంగా10–15 మిలియన్ టన్నులు.. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10–15 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యం జత అవుతుందని ప్రతాప్ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50–60 సిమెంట్ కంపెనీలున్నాయని.. 75 మి.టన్నుల సామర్థ్యం ఉందన్నారు. ముడి పదార్థాల ధర, విద్యుత్, రవాణా చార్జీలపై సిమెంట్ బ్యాగ్ ధర ఆధారపడి ఉంటుందన్నారు. 2 రోజుల సిమెంట్ ఎక్స్పో ప్రదర్శనకు భారతీ సిమెంట్ సిల్వర్ పార్టనర్ గా వ్యవహరించింది. ఎక్స్‌పోలో ఏబీబీ, ఏసీసీ, అం బుజా వంటి 80కి పైగా సిమెంట్ కంపెనీలు, 1,200 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సిమెంట్, కన్స్ట్రక్షన్, ఎక్విప్మెంట్, టెక్నాలజీ కంపెనీలు పాల్గొన్నాయి. రెండేళ్లకొకసారి ప్రాంతీయ మార్కెట్లలో సిమెంట్ ఎక్స్పో ప్రదర్శను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
లండన్‌లో ప్రేమాయణం
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ యువకుడు లండన్ వెళ్లిన తర్వాత, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే అంశంతో అనిల్ .సి. మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘లండన్ బ్రిడ్జ్’. పృథ్వీరాజ్, ప్రతాప్ పోతన్, నందిత, ఆండ్రియా ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని యస్సీయస్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత సుంకేశుల రాజబాబు తెలుగులోకి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రం. 99 శాతం షూటింగ్ లండన్‌లోనే చేశారు. మలయాళంలో 18 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. వచ్చే నెల 15లోపు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. తెలుగులో ఈ చిత్రానికి ‘లవ్ ఇన్ లండన్’ టైటిల్‌ని పరిశీలిస్తున్నామని మాటల రచయిత మహేష్‌దత్ తెలిపారు.