లండన్‌లో ప్రేమాయణం | london bridge to be released next month | Sakshi
Sakshi News home page

లండన్‌లో ప్రేమాయణం

Published Wed, Jun 18 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

లండన్‌లో ప్రేమాయణం

లండన్‌లో ప్రేమాయణం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఓ యువకుడు లండన్ వెళ్లిన తర్వాత, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే అంశంతో అనిల్ .సి. మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘లండన్ బ్రిడ్జ్’. పృథ్వీరాజ్, ప్రతాప్ పోతన్, నందిత, ఆండ్రియా ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని యస్‌సీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సుంకేశుల రాజబాబు తెలుగులోకి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రం. 99 శాతం షూటింగ్ లండన్‌లోనే చేశారు. మలయాళంలో 18 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. వచ్చే నెల 15లోపు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. తెలుగులో ఈ చిత్రానికి ‘లవ్ ఇన్ లండన్’ టైటిల్‌ని పరిశీలిస్తున్నామని మాటల రచయిత మహేష్‌దత్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement