London Bridge
-
ఊరి దారిలో టూరిజం
చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలనుకున్నా, ఇంజినీరింగ్ అద్భుతాలను చూడాలనుకున్నా ఈఫిల్ టవర్కో, లండన్ బ్రిడ్జ్కో ప్లాన్ చేసుకోవచ్చు! లేదంటే బుర్జ్ ఖలీఫానో, సిడ్నీ ఒపేరా హౌస్నో సందర్శించొచ్చు! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనీ చుట్టి రావచ్చు, డిస్నీల్యాండ్‌తో అబ్బురపడొచ్చు!దూరభారం అనుకునేవాళ్లు తాజ్‌మహల్, ఎర్రకోటతో సరిపెట్టుకోచ్చు! కాని, చల్లటి గాలిలో, పచ్చటి నేలమీద సేద తీరాలనుకుంటే, ట్రెడిషనల్ లైఫ్ స్టయిల్ని పరిచయం చేసుకోవాలనుకుంటే, పలు యాసలను వినాలనుకుంటే, స్థానిక రుచులను ఆస్వాదించాలనుకుంటే మాత్రం పల్లెలే ద బెస్ట్ హాలీడే స్పాట్స్! ఇప్పుడు చిన్నా పెద్దా అందరి వీకెండ్స్‌ను, సెలవులను అవే ఆక్యుపై చేస్తున్నాయి! వీళ్లకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానికులూ ఉత్సాహపడుతున్నారు. పరాయి ఊళ్లో సొంతింటి భావనను కలిగిస్తున్నారు!ఆ జర్నీనే రూరల్ టూరిజం. ఆ హాస్పిటాలిటీయే హోమ్ స్టేస్! ఆ ట్రెండ్ మీదే ఈ కథనం!సెలవుల్లో ఇదివరకైతే అమ్మమ్మ వాళ్లూరో, నానమ్మ వాళ్లూరో వెళ్లేవాళ్లు. చెట్లు– పుట్టలు, చేనులు– చెలకలు, చెరువులు– బావులు, కొండలు– గుట్టలు తిరగడం వల్ల ఆ ఊరి భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వనరుల మీద తెలియకుండానే ఒక అవగాహన ఏర్పడేది. అలాగే అక్కడి సంస్కృతీ సంప్రదాయాలూ తెలిసేవి. అక్కడి పిల్లలతో ఆటలు, ఈతలు, సరదాలు, కబుర్లు, కాలక్షేపాలతో రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ప్రత్యేకతలు, వైవి«ధ్యాలు అర్థమయ్యేవి. తెలివిడి వచ్చేది. నగరీకరణ పెరగడం, చదువుల ఒత్తిడి, మొదటి తరానికి, మూడో తరానికి కనెక్టివిటీ తగ్గడం వల్ల గ్రామీణ భారతం కథల్లో, సినిమాల్లో వినిపించే, కనిపించే ఫిక్షన్‌గా మారిపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు రోబోటిక్ లైఫ్ స్టయిలే లా ఆఫ్ లైఫ్‌గా మారిపోయింది. ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్లా వారంలో అయిదు రోజులు ఆఫీస్ పనితో కుస్తీ, వీకెండ్ షాపింగ్ మాల్స్‌లో వ్యాహ్యాళి. ఏడాదికి ఒకసారో, రెండుసార్లో లాంగ్ డెస్టినేషన్ టూర్స్ తప్ప ఆ షరా మామూలులో మార్పు లేదు. కోవిడ్ పుణ్యమా అని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలతో ఇంట్రడక్షన్ లేని, ట్రాఫిక్, టార్గెట్స్, ప్రాజెక్ట్స్‌తోనే డీప్ రిలేషన్షిప్లో పడిపోయిన నగర జనాభాలో కోవిడ్ ఒక రియలైజేషన్‌ను తెచ్చింది. పని, పొల్యూషనే కాదు ప్రకృతి, పల్లెలతో ఇంటరాక్షన్ చాలా అవసరమని, ఆ సమయం ఆసన్నమైందని! అందుకే కోవిడ్ ఇంట్రడ్యూస్ చేసిన (అంతకుముందు అరుదుగా ఉండే) వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. లాప్టాప్, బ్యాక్‌ప్యాక్‌తో పల్లెలకు చేరుకున్నారు. పచ్చని ఆవరణం, స్వచ్ఛమైన గాలితో సేదతీరారు. పని ఒత్తిడిని తగ్గించుకున్నారు. కొత్త ఉత్సాహాన్ని నింపు కున్నారు. ‘బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి? పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి? పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది? కూరగాయలను ఏ మార్కెట్లో తయారు చేస్తారు?’ లాంటి ప్రశ్నలు వేసే పిల్లలకూ పల్లెలతో ప్రత్యేక పరిచయం అవసరమని గుర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టాక పల్లె సందర్శనను జీవనశైలిలో భాగం చేసుకున్నారు. వీకెండ్స్ నుంచి వెకేషన్స్ దాకా ప్రతి సందర్భాన్నీ రూరల్ టూర్‌కే రిజర్వ్ చేసుకోవడం మొదలుపెట్టారు. సకుటుంబ సమేతంగా! క్యాంప్‌లు వేసుకునేవాళ్లు, ట్రెకింగ్ని ఇష్టపడేవాళ్లు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలనుకునే వాళ్లు, సాగు నేర్చుకోవాలనుకునే వాళ్లు, పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ను కోరుకునేవాళ్లు, నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్నవాళ్లు, గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు.. ఎట్సెట్రా ఎట్సెట్రా అభిరుచికి తగినట్టుగా గ్రామీణ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రావెల్ గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మొత్తంగా రూరల్ టూరిజాన్ని ఓ ఒరవడిగా మార్చారు. వాళ్లందరికీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు, వనాలు, నదీ, సముద్ర తీరప్రాంతాలు ఆతిథ్యమిస్తున్నాయి.ముందుగా ఉత్తరాంధ్రకు వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి, కొబ్బరి తోటలకు ఆలవాలమైన ఉద్దానం, సైబీరియా వలస పక్షుల విడిది కేంద్రాలు తేలుకుంచి, తేలినీలాపురాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా స్టడీ టూర్ పేరిట ఈ ప్రాంతాల్ని సందర్శిస్తుంటారు. తేలినీలాపురంలో సైబీరియ¯Œ పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. వారాంతాల్లో ఈ కేంద్రాలు టూరిస్ట్‌లతో బిజీగా ఉంటాయి. మన్యం పార్వతీపురం జిల్లా పరిధిలోని పాలకొండ ఏజెన్సీలో జలపాతాలకు, హిల్ వ్యూ పాయింట్లకు కొదువ లేదు. ఇది అరుదైన జంతుజాతులకూ నెలవు. దీనికి పరిశోధకుల తాకిడీ అధికమే!ఆంధ్రా ఊటీ అందాల అరకు..పచ్చటి లోయలు, అబ్బురపరచే గుహలు, అలరించే థింసా నృత్యాలు, వెదురు బొంగులో చికె¯Œ ఘుమఘుమలు, మైమరపించే కాఫీ కమ్మదనం, మేఘాలను ముద్దాడే పర్వతాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుతమైన ప్రదేశం. కోవిడ్‌లో కూడా బాగా కట్టడి చేస్తే తప్ప సందర్శకుల తాకిడి ఆగని ప్రాంతం. అరకు వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానిక గిరిజనులు రిసార్ట్స్ మాదిరి అతిథి గృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. మంచు ముసుగేసుకునే లంబసింగి, పాడేరు కూడా సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడికి అక్టోబర్ చివరివారంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కోస్తాకు వస్తే.. ఆంధ్రా కేరళగా పిలుచుకునే కోనసీమ రూరల్ టూరిజానికి అసలు సిసలైన కేంద్రం. ప్రకృతి అందాలు, పసందైన రుచులకు ఈ ప్రాంతాన్ని మించింది లేదు. సువిశాల గోదావరి, అది సముద్రంలో కలిసే అంతర్వేది, ఓడల రేవు, మడ అడవుల కోరంగి, ఫ్రెంచ్ కల్చర్‌తో ఆసక్తి రేకెత్తించే యానాం, పట్టునేత ఉప్పాడ, పూల వనాల కడియం, ప్రకృతి సోయగాల పాపికొండలు, ధవళేశ్వరం, మన్యప్రాంతాల రంపచోడవరం, మోతుగూడెం, మారేడుమిల్లి, సూర్యోదయాల గుడిసె, గలగలపాడే సెలయేరుల పింజరకొండ.. ఇలా అన్నింటినీ చుట్టిరావాల్సిందే.. పనసపొట్టు కూర నుంచి పులసల పులుసుదాకా, పూతరేకుల నుంచి కాకినాడ కాజా దాకా అన్నింటినీ రుచి చూడాల్సిందే! ఇంకా ఆంధ్రలో కృష్ణా పరీవాహక ప్రాంతాలు, హార్సిలీ హిల్స్, బెలూం కేవ్స్, గండికోట, కొండవీడు, ఉదయగిరి, ఒరవకల్లు, చంద్రగిరి, పెనుకొండ లాంటివాటినీ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. దక్షిణ భారతంలో కేరళ, ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య భారతంలో ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో మేఘాలయాలో రూరల్ టూరిజం ఎక్కువగా ఉంది. మనదేశంలో రూరల్ టూరిజం ద్వారా రూ. 4,300 కోట్ల అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇది గ్రామీణ భారతానికి, పట్టణ భారతానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందని, అందుకే దీన్నో ఇండస్ట్రీగా, భారీ ఆదాయ వనరుగా పేర్కొనవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు చేరితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం, రామప్ప, పాండవులగుట్ట, వాజేడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తే రాచకొండ, భువనగిరి ఫోర్ట్, కొలనుపాక, వైజాగ్ కాలనీ, మెదక్‌లో నర్సాపూర్, ఏడుపాయల ప్లాన్ చేసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నల్లమల ఉండనే ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రోజంతా గడపాలనుకునేవారికి ‘టైగర్ స్టే ప్యాకేజీ’ అందుబాటులోకి వచ్చింది. ఇదే దారిలో వటవర్లపల్లి సమీపంలో మల్లెలతీర్థం, ఆక్టోపస్ వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన్ననూర్, ఈగలపెంట ఊళ్లల్లో తిరిగి అక్కడివారి జీవన శైలిని పరిశీలించవచ్చు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లోని సుందర ప్రదేశాలనూ సందర్శించొచ్చు. వారాంతాల్లో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలూ రద్దీగా ఉంటున్నాయి. ఉత్తర తెలంగాణకు చేరితే.. వరంగల్ మినహా మిగిలిన ప్రాంతమంతా తెలంగాణ– ఆంధ్ర– మరాఠీ సంస్కృతి, గోదావరి ప్రవాహం, పచ్చని చేలతో భలే ఆకట్టుకుంటుంది. నిజామాబాద్‌లో నిజాంసాగర్, కందకుర్తి, శ్రీరాంసాగర్, పసుపు పంటల అంకాపూర్, ఆర్మూర్ ప్రాంతాలను చూడాల్సిందే.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకం ..ఇది వైవిధ్యాలకు నెలవు. పచ్చని ప్రకృతి, ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు, మహారాష్ట్ర ప్రభావం.. ఇవన్నీ కలిసి దీనికి స్పెషల్ అపియరెన్స్‌ను ఇస్తున్నాయి. ఈ వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి, అబ్జర్వ్చేయడానికి జనాలు ఇక్కడికి వస్తుంటారు. చలికాలంలో జీరో డిగ్రీకి వెళ్లే తిర్యాణిలాంటి ప్రాంతాలను చూసేందుకు, ఆ మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు భ్రమణకాంక్ష కలవారు ఇక్కడికి క్యూ కడుతుంటారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, కుంటాల, పొచ్చెర, సప్తగుండాలతో పాటు 30కి పైగా చిన్నా పెద్దా జలపాతాలు మరచిపోలేని అనుభూతులను పంచుతున్నాయి. వీటితోపాటు గోదావరి, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా, వెన్‌గంగా తీరాలు, సమీప గ్రామాలు, జోడే ఘాట్, ఇం్రదవెల్లి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గిరిజన కోటలు, పూర్వయుగం నాటి ఆనవాళ్లున్న ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి దేశవిదేశాల అధ్యయనకారులూ వస్తుంటారు. ఇలా రూరల్ టూరిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో డెస్టినేషన్స్ ఉన్నాయి. గ్రామీణ పర్యాటకం ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్‌ను నేర్పుతుంది. ప్రకృతి వనరుల మీద అవగాహన కల్పిస్తుంది. వాటి మీద గౌరవాన్ని పెంచుతుంది. శ్రమ విలువను చూపిస్తుంది. నిరాడంబర జీవన శైలి అవసరాన్ని తెలియజేస్తుంది. పరిణతినిస్తుంది. రూరల్ టూర్‌ని ఇంకా మొదలుపెట్టని వాళ్లు ఐటినరీ ప్రిపేర్ చేసేసుకోండి ఇక! ఇన్పుట్స్: కడారి రాజా, కిషోర్ కుమార్ పెరుమాండ్ల, పాదం వెంకటేశ్, తాండ్ర కృష్ణగోవింద్, ఆకుల రాజుపెద్దగా ఖర్చులేనిది..రూరల్ టూరిజాన్ని ఇష్టపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా! ఇలాంటి పర్యటనకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ప్రకృతికి నష్టం చేయకుండా గ్రామీణ, నేచర్ బేస్డ్గా ఉండే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రాల ఆర్థిక వృద్ధికీ మేలు కలుగుతుంది. – శ్యామ్‌సుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) తెలంగాణ చాప్టర్పల్లెల గురించి తెలియాలినాకు రకరకాల భాషలు, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్కిటెక్చర్‌ను తెలుసుకోవడం, పరిశీలించడం ఇష్టం. అందుకే చాలా తరచుగా దేశీ, విదేశీ యానాలు చేస్తుంటా. వీకెండ్స్‌లో కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటా. కరోనా తర్వాత రూరల్ టూర్స్ పెరిగాయి. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రిటైర్డ్ ఎంప్లాయ్సే ఎక్కువగా రూరల్ టూర్స్‌ని ఇష్టపడేవాళ్లు! ఇప్పుడు ఫ్యామిలీస్, యూత్, స్కూల్ పిల్లలూ వస్తున్నారు. శుభపరిణామం. మనదేశ సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అర్థంకావాలంటే మన గ్రామాల గురించి తెలియాలి. కాబట్టి పల్లెటూళ్లకు వెళ్లాలి. – గిరిజ పైడిమర్రి, విహంగ (వైహెచ్‌ఏఐ) వైస్ ప్రెసిడెంట్ -
లండన్‌లో కత్తిపోట్లు
లండన్: లండన్ బ్రిడ్జ్ వద్ద కత్తితో పలువురిని గాయపరిచిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనను ముందు జాగ్రత్త కోసం ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే లండన్ బ్రిడ్జ్ వద్ద ఓ వ్యక్తి కత్తితో పలువురిని గాయపరిచాడు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని మట్టుబెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు లండన్ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. -
7.5 టన్నుల ట్రక్కుతో దాడికి కుట్ర!
లండన్ బ్రిడ్జి ముష్కరుల ప్రణాళిక.. ట్రక్కు అద్దె చెల్లింపులో విఫలం లండన్: ఇటీవల లండన్ బ్రిడ్జిపై వ్యాన్‌తో, కత్తులతో దాడి చేసి 8 మందిని పొట్టనబెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదులు వాస్తవానికి భారీ మారణకాండకు తెగబడాలని పథకం వేసినట్లు తెలిసింది. వీరు ఈ నెల 3వ తేదీన 7.5 టన్నుల బరువైన ట్రక్కుతో దాడి చేసి, చాలామందిని చంపాలనుకున్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. ఉగ్రముఠా నాయకుడైన పాక్ సంతతి ముష్కరుడు ఖుర్రమ్ షాజాద్ బట్ 7.5 టన్నుల ట్రక్కును అద్దెకు తీసుకోవడానికి యత్నించాడని, అయితే అతని క్రెడిట్ కార్డు చెల్లింపు విఫలమైందని పోలీసులు తెలిపారు. దీంతో దుండగులు అదే రోజు ఒక వ్యాన్‌ను అద్దెకు తీసుకుని దాడి చేశారన్నారు. ట్రక్కుతో దాడి చేసి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయేవారని వెల్లడించారు. గత ఏడాది ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ప్రజలపై దాడికి ఉగ్రవాదులు వాడిన ట్రక్కులాంటి ట్రక్కునే వీరు వాడాలకున్నారని, నీస్ దాడిని పునరావృతం చేయాలనకున్నారని పేర్కొన్నారు. దాడికి వాడిన వ్యాన్ వెనుక భాగంలో పెట్రోల్ బాంబులు నకిలీ ఆత్మాహుతి జాకెట్లు తదితరాలు దొరికాయని పోలీసులు తెలిపారు. షాజాద్ భట్ సహా ముగ్గురు ఉగ్రవాదులు లండన్ బ్రడ్జిపై మొదట వ్యాన్‌తో పాదచారులపై దాడిచేసి, తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా పొడవడం, తర్వాత పోలీసులు కాల్పుల్లో హతమవడం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఇల్ఫోర్డ్, బార్కింగ్ లండన్ ప్రాంతాల్లో దాడులక కుట్రపన్నినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. -
లండన్‌పై ఉగ్రపంజా
► ఏడుగురు మృతి, 48 మందికి గాయాలు ►లండన్ బ్రిడ్జి వద్ద వ్యాన్‌తో ముష్కరుల బీభత్సం ►బోరో మార్కెట్లోకి చొచ్చుకెళ్లి కత్తులతో దాడి ►వారాంతాల్లో రద్దీగా ఉండే మార్కెటే లక్ష్యం ►ఒక యువతిపై ఏకంగా పదిహేనుసార్లు కత్తిపోట్లు ►భయభ్రాంతులతో చెల్లాచెదురై పారిపోయిన జనంl ►8 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు ►ఘటనను ఖండించిన థెరిసా మే, వివిధ దేశాధినేతలు ►మహిళ సహా 12 మంది అనుమానితుల అరెస్టు లండన్: శనివారం.. రాత్రి 10 గంటలు.. వారాంతం కావడంతో లండన్ బ్రిడ్జి ప్రాంతం సందడిగా ఉంది.. చుట్టుపక్కల బార్లు, రెస్టారెంట్లన్నీ జనంతో కిక్కిరిశాయి.. మార్కెట్లు కళకళలాడుతున్నాయి.. ఇంతలో ఘోరం..! థేమ్స్ బ్రిడ్జిపై నుంచి ఓ వాహనం 80 కి.మీ. వేగంతో పాదచారులపైకి దూసుకొచ్చింది.. భయంతో అంతా తలోదిక్కు పారిపోయారు.. ఆ వాహనం నుంచి కత్తులతో దిగిన ముగ్గురు ముష్కరులు సమీపంలోని బోరో మార్కెట్లోకి దూసుకెళ్లారు.. ‘అల్లా కోసం.. ’ అంటూ ఉన్మాదంతో దొరికినవారిని దొరికినట్టు పీకలు కోశారు.. ఏడుగురిని బలి తీసుకున్నారు! 75 రోజుల్లో బ్రిటన్‌లో జరిగిన మూడో ఉగ్రదాడి ఇది!! మొన్నటి మాంచెస్టర్ ఘటన మరవకముందే లండన్‌లో ముష్కర మూకలు రెచ్చిపోయాయి. శనివారం రాత్రి చారిత్రక లండన్ బ్రిడ్జి సమీపంలో, బోరో మార్కెట్‌పై పంజా విసిరాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. 48 మంది గాయాలపాలయ్యారు. జూన్ 8న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు 8 నిమిషాల్లోనే ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంతవరకు ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. ఉగ్రదాడిపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల నీచమైన సిద్ధాంతమే ఈ ఘటనకు కారణమన్నారు. దేశంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసిన మే పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎలా జరిగింది? లండన్ బ్రిడ్జి సమీపంలోని బోరో మార్కెట్లో బార్లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉంటాయి. వారాంతం కావటంతో శనివారం రద్దీ ఎక్కువగా ఉంది. రాత్రి పది గంటల సమయంలో ఓ తెలుపురంగు వ్యాన్ థేమ్స్ నది మీదుగా లండన్ బ్రిడ్జి దాటగానే 80 కిలోమీటర్ల వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. అక్కడున్న వారంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. ఇంతలో వాహనంలో నుంచి కత్తులతో దిగిన ఉగ్రవాదులు పక్కనున్న బోరో మార్కెట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు. కంటబడిన వారందరిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ‘అల్లా కోసం’ అని గట్టిగా అరుస్తూ ఓ ఉగ్రవాది అక్కడున్న ఓ యువతిని 15సార్లు దారుణంగా పొడిచాడు. వీలైనంత ఎక్కువమందిని మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో ముష్కరులు చెలరేగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బోరో మార్కెట్‌కు చేరుకున్నారు. ఉగ్రవాదులను గుర్తించి వెంటనే కాల్చి చంపారు. వారి వద్ద నకిలీ బెల్టుబాంబులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారిలో ఓ బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసు అధికారి, ఓ జర్నలిస్టు ఉన్నారు. కారుతో ఢీకొట్టాలనుకున్నా.. తోటివారి పీకకోస్తున్న ఓ ఉగ్రవాదిని క్రిస్ అనే క్యాబ్ డ్రైవర్ చంపేందుకు యత్నించాడు. ‘‘లండన్ బ్రిడ్జిపైనుంచి ఓ వ్యాన్ వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో చాలామంది భయంతో పారిపోగా కొందరికి గాయాలయ్యాయి. వ్యాన్‌లో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు పొడవైన కత్తులు తీసుకుని బోరో మార్కెట్ వైపు వెళ్తూ.. కనబడినవారిపై దాడి చేస్తున్నారు. అందులో ఒకడిని కారుతో ఢీకొట్టి చంపాలనుకుని వేగంగా అతని వైపు కారు నడిపించాను. కానీ అతను తప్పించుకున్నాడు’’ అని క్రిస్ తెలిపాడు. ఉగ్రదాడిపై అప్రమత్తమైన లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు థేమ్స్ నదిలోనూ బోట్లతో గాలింపులు జరిపారు. నగరమంతా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అటు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉగ్రదాడికి సంతాపసూచకంగా పార్లమెంట్ భవనం వద్ద బ్రిటన్ జాతీయ పతకాన్ని అవనతం చేశారు. నన్ను వేదనకు గురిచేస్తోంది: మోదీ న్యూఢిల్లీ: లండన్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఆయన ఓ ట్వీట్ చేస్తూ ‘లండన్‌లో జరిగిన దాడులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఈ విషయం నన్ను వేదనకు గురిచేస్తోంది. మృతులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా లండన్ ఉగ్రదాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన సోనియా... గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పోలీస్.. భేష్..! శనివారం నాటి లండన్ దాడి ఘటనలో మెట్రోపాలిటన్ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 10.08 గంటలకు ఘటన గురించి తెలియగానే.. పోలీసులు వెంటనే బోరో మార్కెట్ చేరుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టే పని ప్రారంభించారు. ఉగ్రవాదులను కనిపెట్టి వారిపై కాల్పులు జరిపారు. ఇదంతా కేవలం 8 నిమిషాల్లోనే జరిగింది. పోలీసులు రావటం ఆలస్యమై ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని దాడి నుంచి బయటపడిన వారు తెలిపారు. వందల ప్రాణాలు కాపాడిన బౌన్సర్లు మూడు కత్తిపోట్లకు గురైన ఓ బాధితుడు ఉగ్రవాదులపైకి ప్లేట్లు, కుర్చీలు విసిరి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఓ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో భయంతో అరుస్తూ బోరో మార్కెట్లోని పారిస్ బార్లోకి పరిగెత్తుకు వచ్చిం ది. చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ ఫైనల్స్‌ను వీక్షిస్తున్న వారం తా ఆమె అరుపులకు భయపడ్డారు. ఆమె గొంతు కోసినట్లు గుర్తించిన బౌన్సర్లు ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే బార్ తలుపులు మూసి వందల మంది ప్రాణాలు కాపాడారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోకి పోలీసులు ప్రవేశించి అందరినీ బల్లల కింద దాక్కోవాలని సూచించారు. 12 మంది అనుమానితుల అరెస్టు ఉగ్ర ఘటనపై విచారణ వేగవంతం చేసిన పోలీసు లు, కౌంటర్–టెర్రరిస్టు బలగాలు.. బార్కింగ్ ప్రాంతం లో ఓ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశాయి. బార్కింగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఈ అరెస్టు లు జరిగాయని బ్రిటీష్ కౌంటర్ టెర్రరిజం పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన గంటల్లోనే పోలీసులు అనుమానితులను పట్టుకున్నారు. నగరంలో మిగిలిన చోట్ల మరో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్లా గాలింపు జరుగుతోందన్నారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో జూన్ 8న జరగాల్సిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాలని అధికార కన్జర్వేటివ్ పార్టీ, విపక్ష లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీలు నిర్ణయించాయి. ఉగ్రదాడిలో గాయపడిన వారిలో విదేశీయులు ఉన్నట్లు తెలిసింది. బ్రిటన్‌లో రెండేళ్లలో ఉగ్రదాడులు ఇవీ.. 2017 జూన్ 3 లండన్ బ్రిడ్జి దగ్గర, అక్కడికి సమీపంలోని బోరో మార్కెట్ వద్ద జరిగిన దాడిలో ఏడుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు. 2017 మే 22 మాంచెస్టర్‌లో పాప్ సింగర్ అరియానా గ్రాండే సంగీత విభావరి నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, 116 మంది గాయపడ్డారు. 2017 మార్చి 22 బ్రిటిష్ పార్లమెంటు భవనం సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జి వద్ద ఓ దుండగుడు కారును పాదచారులపైకి పోనిచ్చి నలుగురిని పొట్టనబెట్టుకు న్నాడు. 40 మంది క్షతగాత్రులయ్యారు. 2016 జూన్ 16 బిర్ట్సాల్లో లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్‌ను తుపాకీతో కాల్చి, కత్తితో పొడిచి ఉగ్రవాదులు చంపేశారు. 2015 డిసెంబర్ 5 లీయ్టోన్స్టోన్ వద్ద ఓ ఉగ్రవాది ముగ్గురిని కత్తితో పొడిచాడు. ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రపంచ నేతల సంఘీభావం లండన్ ఉగ్ర దాడిని పలు దేశాల అధినేతలు ఖండించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో బ్రిటన్ పక్షాన నిలుస్తామని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బ్రిటన్‌కు సాయంగా అమెరికా ఏం చేయగలదో అదంతా చేస్తాం. మీతో మేం ఉన్నాం’ అని భరోసానిచ్చారు. రష్యా అధ్యక్షడు పుతిన్ దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బ్రిటన్ పక్షాన నిలుస్తామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. నిషేధాన్ని సమర్థించుకున్న ట్రంప్ లండన్ ఉగ్ర దాడి నేపథ్యంలో వలస నిషేధ ఉత్తర్వులను ట్రంప్ సమర్థించుకున్నారు. ‘మనం స్మార్ట్‌గా, అప్రమత్తంగా, కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. కోర్టులు మన హక్కులను మనకు వెనక్కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరు ముస్లిం దేశాల వారిపై విధించిన నిషేధం మనల్ని భద్రతలో మరోమెట్టు పైన ఉంచుతుంది’ అని ట్రంప్ ట్వీటర్లో చెప్పుకొచ్చారు. -
లండన్‌లో ప్రేమాయణం
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ యువకుడు లండన్ వెళ్లిన తర్వాత, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే అంశంతో అనిల్ .సి. మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘లండన్ బ్రిడ్జ్’. పృథ్వీరాజ్, ప్రతాప్ పోతన్, నందిత, ఆండ్రియా ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని యస్సీయస్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత సుంకేశుల రాజబాబు తెలుగులోకి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రం. 99 శాతం షూటింగ్ లండన్‌లోనే చేశారు. మలయాళంలో 18 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. వచ్చే నెల 15లోపు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. తెలుగులో ఈ చిత్రానికి ‘లవ్ ఇన్ లండన్’ టైటిల్‌ని పరిశీలిస్తున్నామని మాటల రచయిత మహేష్‌దత్ తెలిపారు. -
లండన్ బ్రిడ్జ్‌పై 8 గంటల షూటింగ్ చేశాం!
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి భారీ బడ్జెట్ చిత్రం తర్వాత లండన్ బ్రిడ్జ్‌ను దాదాపు 8 గంటల పాటు బ్లాక్ చేసి షూటింగ్ జరుపుకున్న ఏకైక చిత్రం ‘1’... ‘నేనొక్కడినే’. కథలో కీలక భాగాలను లండన్‌లో దాదాపు 60 రోజుల పాటు చిత్రీకరించాం’’ అని రామ్ ఆచంట చెప్పారు. మహేష్‌బాబు, సుకుమార్ కాంబినేషన్లో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించిన ‘1’... ‘నేనొక్కడినే’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గోపి ఆచంట మాట్లాడుతూ -‘‘సినిమా మొత్తం డిజిటల్ ఫార్మాట్లో తీశాం. రష్యన్, సౌత్ అమెరికన్, జపనీస్, ఫ్రెంచ్, కొరియన్ భాషల్లోకి సబ్ టైటిల్స్‌తో అనువదిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ సినిమాలో హీరో వాడిన బైక్‌ని ఎస్ఎమ్ఎస్ ద్వారా గెలుచుకునే ఏర్పాటు చేశామని అనిల్ సుంకర చెప్పారు.