
లండన్: లండన్ బ్రిడ్జ్ వద్ద కత్తితో పలువురిని గాయపరిచిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనను ముందు జాగ్రత్త కోసం ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే లండన్ బ్రిడ్జ్ వద్ద ఓ వ్యక్తి కత్తితో పలువురిని గాయపరిచాడు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని మట్టుబెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు లండన్ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment