terrarist attack
-
పాక్‌లో ఉగ్ర దాడులు.. 8 మంది సైనికుల మృతి
కరాచి: పాకిస్తాన్‌లోని ఉత్తర వజీరిస్తాన్‌లో రెండు ఉగ్రవాద దాడుల్లో ఎనిమిది మంది సైనికులు మరణించారు. గిరిజన జిల్లా దతఖేల్‌లో భద్రతా బలగాల వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు, రాకెట్ గన్లతో మెరుపు దాడి చేసి ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారు. జిల్లాలోని ఇషామ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కాల్పుల్లో మరో సైనికుడు చనిపోయాడు. చదవండి: Russia-Ukraine war: మాస్క్వా మునిగింది -
భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు
-
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. పుల్వామా తరహాలో మరో దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నగా ఆర్మీ, పుల్వామా పోలీసులు, పారామిలటరీ బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పి కొట్టారు. వాహనంలో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉంచి దాడికి యత్నించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సరైన రీతిలో స్పందించాయి. బుధవారం రాత్రి 20 కేజీల ఐఈడీతో వెళుతున్న వైట్ హ్యూండాయ్ శాంట్రో కారును ఆపాయి. (హిజ్బుల్ టాప్ కమాండర్ దిగ్బంధం) అయితే అందులోని వ్యక్తి బారికేడ్‌ను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లటానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అతడు బలగాలపై ఎదురు కాల్పులు జరుపుతూ అక్కడినుంచి పరారయ్యాడు. కారునుంచి పరారైన సదరు వ్యక్తిని హిజ్బుల్ ఉగ్రవాదిగా వారు గుర్తించారు. కాగా, గత సంవత్సరం పుల్వామాలో జరిగిన ఐఈడీ వాహన దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. -
లండన్‌లో కత్తిపోట్లు
లండన్: లండన్ బ్రిడ్జ్ వద్ద కత్తితో పలువురిని గాయపరిచిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనను ముందు జాగ్రత్త కోసం ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే లండన్ బ్రిడ్జ్ వద్ద ఓ వ్యక్తి కత్తితో పలువురిని గాయపరిచాడు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని మట్టుబెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు లండన్ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. -
ఆర్మీ వాహనంపై ఉగ్ర దాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అరిహల్‌లో ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు శక్తిమంతమైన ఇంప్రొవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని వినియోగించారు. ఫిబ్రవరి 14న ఓ సూసైడ్ బాంబర్ 40 మంది సీఆర్పీఎఫ్ అధికారులను బలితీసుకున్న ప్రాంతానికి ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఈ ఆర్మీ వాహనం బుల్లెట్, మైన్ ప్రూఫ్ కావడంతో సైన్యానికి పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అరిహల్ లస్సిపురా రోడ్డు మీద ఈ దాడి జరిగింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తేవడానికి మరికొంత మంది సిబ్బందిని రప్పించి, గాల్లోకి కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. చిన్నగాయాలు మినహా ఏ నష్టమూ జరగలేదని, ఉగ్రవాదులు చేసిన దాడి విఫలమైందని కల్నల్ రాజేష్ కలియా అన్నారు. బాంబుదాడి అనంతరం కూడా సోదాలు కొనసాగాయని అన్నారు. అయితే పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పాకిస్తాన్ ముందే హెచ్చరించడం గమనార్హం. పాక్ చెప్పడానికి కారణాలేంటి? అల్‌కాయిదాకు అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది జకీర్ మూసాను చంపినందుకు ప్రతీకారంగా భారత్‌లో దాడులు చేయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం అందిందని పాక్ ఇటీవల భారత ప్రభుత్వానికి తెలిపింది. ఈ దాడులు అమర్నాథ్ యాత్రకు ముందుగానీ, తర్వాతగానీ దాడులు చేసేందుకు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నారంది. 2016లో కూడా పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాంజువా అప్పటి భారత జాతీయ భద్రతా సలహాదారు ధోవల్‌కు గుజరాత్లో 26/11 లాంటి దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు పథకం పన్నారని తెలిపారు. పాక్ ఇలాంటి హెచ్చరికలు చేయడంపై పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో తాము ఉగ్రవాదానికి వ్యతిరేకులమన్న సందేశాన్ని వ్యాప్తి చేయడమే పాక్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
మళ్లీ నెత్తురోడింది
కొలంబో/వాషింగ్టన్: ద్వీప దేశమైన శ్రీలంక మరోసారి నెత్తురోడింది. నిఘావర్గాల సమాచారంతో సోదాలు జరుపుతున్న భద్రతాబలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, అనంతరం తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన తన అత్యవసర అధికారాలతో ఉగ్రసంస్థలు నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే), జమాతే మిల్లతూ ఇబ్రహీం(జేఎంఐ)లపై నిషేధం విధించారు. ఏప్రిల్ 21న ఈస్టర్ రోజు చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 253 మంది చనిపోవడం తెల్సిందే. ఎన్టీజే స్థావరంలో తనిఖీలు.. ఉగ్రవాదుల విషయమై నిఘావర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త బలగాలు శుక్రవారం రాత్రి కల్మునయ్ పట్టణంలోని సైంతమురుతు ప్రాంతంలో ఎన్టీజే స్థావరంగా భావిస్తున్న ఓ ఇంటిని చుట్టుముట్టాయి. సైన్యం కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఇరువర్గాల కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోయాడు. ఓవైపు ఇరువర్గాల మధ్య కాల్పులు భీకరంగా కొనసాగుతుండగానే, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాబలగాలకు ప్రాణాలతో చిక్కకూడదన్న ఉద్దేశంతో తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)కు స్థావరంగా ఉన్న ఈ ఇంటిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఆత్మాహుతి కిట్లు, ఐసిస్ జెండాలు, ఆర్మీ దుస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు భావిస్తున్నామని పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. గాయపడిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఉగ్రదాడులపై విచారణలో శ్రీలంక అధికారులకు సహకరించేందుకు అమెరికా ముందుకొచ్చింది. తమ అధికారులతో ఓ బృందాన్ని కొలంబో పంపినట్లు ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే తెలిపారు. తమ పౌరులకు భారత్, అమెరికా సూచన అత్యవసరమైతే తప్ప భారత పౌరులెవరూ శ్రీలంకకు ప్రయాణాలు పెట్టుకోవద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సివస్తే కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం, జాఫ్నా, హంబన్తోటలోని కాన్సులేట్లు, కండిలోని అసిస్టెంట్ హైకమిషన్‌ను సంప్రదించాలని చెప్పింది. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లాలనుకునే అమెరికా పౌరులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అగ్రరాజ్యం కోరింది. శ్రీలంకలో ఉగ్రదాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ శనివారం లెవల్–3 ప్రయాణ సూచికను జారీచేసింది. వారందరినీ చంపాలి శ్రీలంకలో వరుసబాంబు పేలుళ్లు జరిగిన కొన్ని గంటలకే ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న జహ్రన్ హషీమ్ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఇందులో శ్రీలంక యాసతో తమిళంలో హషీమ్ మాట్లాడుతూ.. ‘మతవిశ్వాసాలు, నమ్మకం ఆధారంగా మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరిలో ఒకరు ముస్లింలు. మరొకరు ముస్లింల అభిప్రాయాలను అంగీకరించేవారు. ఇక మూడోవర్గం ఉంది చూశారా.. వీళ్లందరిని చంపేయాలి. ఈ మాట చెప్పేందుకు చాలామంది భయపడతారు. ఈ వ్యాఖ్యలను ఉగ్రవాదంగా ముద్రవేస్తారు. ఇస్లాం సిద్ధాంతాలతో అంగీకరించని వాళ్లందరినీ చంపేయాలి’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు శ్రీలంక ఉగ్రదాడిని ఐసిస్ తమ పత్రికలో ‘ప్రత్యేక కథనం’గా ప్రచురించింది. కాగా, హషీమ్ విద్వేష ప్రసంగాలపై తాము ప్రభుత్వానికి 2015, 2018లో ఫిర్యాదు చేశామనీ, అయినా అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ తెలిపారు. ఖురాన్ తరగతుల పేరుతో యువతకు విద్వేషం నూరిపోసిన హషీమ్, గౌతమబుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసేలా యువతను ప్రేరేపించాడని విమర్శించారు. తమిళనాడులోనే ఉగ్ర శిక్షణ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులంతా తమిళనాడులో శిక్షణ పొందినట్లు ఆ దేశానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్టీజేకు అధ్యక్షుడిగా ఉన్న జహ్రన్ హషీమ్ వీరందరికీ శిక్షణ ఇచ్చాడన్నారు. ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడిలో హషీమ్సహా 9 మంది బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారని వెల్లడించారు. హషీమ్ రూపొందించిన ఆత్మాహుతి దళంలో మహిళా బాంబర్ కూడా ఉందని పేర్కొన్నారు. హషీమ్ తొలుత శ్రీలంకలోని మట్టకళప్పు ప్రాంతం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నడిపేవాడనీ, కానీ ఇతని వ్యవహారశైలిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పారు. ఘటనాస్థలిలో లభ్యమైన బాంబులు, బ్యానర్లు -
ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా, షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో భద్రతాబలగాలు శుక్రవారం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు హజిన్‌ను చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన అలీ, హుబైబ్ అనే ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. వీరిద్దరూ పాకిస్తాన్ పౌరులని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి మందుగుండు సామగ్రితో పాటు నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు షోపియాన్ జిల్లాలోని ఇమామ్‌సాహిబ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు కాల్చిచంపాయి. అయితే వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. బారాముల్లా జిల్లాలో గురువారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన బలగాలు శుక్రవారం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దీంతో గత మూడ్రోజుల్లో కశ్మీర్లో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య ఏడుగురికి చేరుకుంది. కాగా, బారాముల్లాలో అతీఫ్ అహ్మద్(12) అనే బాలుడిని బందీగా చేసుకున్న ఉగ్రవాదులు అతడిని తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రచెరలో ఉన్న అబ్దుల్ హమీద్‌ను మాత్రమే తాము కాపాడగలిగామన్నారు. బారాముల్లాలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. -
న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ సిటీలో ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో ఇకపై దాడిలో వాడే తుపాకులపై ఆ దేశం గురువారం తక్షణ నిషేధం విధించింది. తుపాకులు, సైన్యం వాడే గన్ల మాదిరి ఉండే సెమీ–ఆటోమేటిక్ తుపాకులను అన్నింటినీ తక్షణం నిషేధిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదులపై ఓ శ్వేతజాతీయుడు గత శుక్రవారం కాల్పులు జరిపి 50 మంది చంపేయడం తెల్సిందే. ‘శుక్రవారం నాటి దాడి కోసం ఉగ్రవాది వాడిన రకం తుపాకులపై నిషేధం విధిస్తున్నాం. వాటిని కొనాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. గతంలో కొన్నవాటికి వెనక్కిఇస్తే డబ్బు చెల్లిస్తాం’ అని ప్రధాని చెప్పారు. ఇక అమెరికాలో తుపాకులపై నిషేధం విధించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉండటం తెలిసిందే. న్యూజిలాండ్ నిర్ణయంతో తాజాగా అమెరికాలో ఆ డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. పలువురు అమెరికా రాజకీయ నేతలు సహా తుపాకుల విచ్చలవిడి వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా అమెరికా కూడా తుపాకులపై నిషేధం విధించాలని కోరుతున్నారు. బతికున్న వ్యక్తిని చనిపోయాడన్నారు.. బతికున్న ఓ వ్యక్తి పేరును క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి జాబితాలో పోలీసులు పొరపాటున చేర్చారు. కాల్పులు జరిపిన బ్రెంటన్ టారంట్‌పై పోలీసులు తయారుచేసిన అభియోగప త్రంలో బతికున్న ఓ వ్యక్తి పేరును చేర్చి పోలీసులు దానిని కోర్టుకు సమర్పించారు. ఆ వ్యక్తితో మాట్లాడి క్షమాపణ కోరామనీ, అభియోగపత్రంలో అతని పేరును తొలగించామని పోలీసులు చెప్పారు. -
పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపిన ప్రధాని మోదీ
-
భారత్‌కి అమెరికా నుంచి పెరుగుతున్న మద్దతు
-
భోపాల్‌లో సీఆర్పీఎఫ్ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన
-
తండ్రి మృతదేహనికి కడసారి సెల్యూట్..
-
అమరవీరులకు కన్నీటి వీడ్కోలు
-
ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం
-
ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ
-
అమర జవాన్లకు నివాళులు అర్పించిన ప్రముఖులు
-
జమ్మూ సహా పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ విధింపు
-
ఉగ్రదాడిపై తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్రం
-
అమరుల కుటుంబాలకు పరిహారం ప్రకటన..!
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమరుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ప్రకటించగా, ఒడిశా 12 లక్షలు పరిహారం ప్రకటించింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.21 లక్షల పరిహారం ఇస్తున్నట్లు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ప్రకటించగా, రూ.12 లక్షల పరిహారం ఇస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. (పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి) హిమాచల్ ప్రదేశ్ రూ.21 లక్షలు పరిహారం ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి అమరుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని పలు ప్రభుత్వాలు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులైన జవాన్లకు నివాళి అర్పించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. (ఉగ్రదాడిని ఖండించిన యావత్ భారతావని) -
‘పుల్వామా ఉగ్రదాడి హేయమైన చర్య’
సాక్షి, వైఎస్సార్ : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లను యుద్ధ భూమిలో కాకుండా ఉగ్రదాడి చేయటం దుర్మార్గమన్నారు. పిరికితనంతో చేసిన దాడిలో, విధినిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే..!
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. వారిలో 36 మృతదేహాలను గుర్తించి వారి వివరాలను శుక్రవారం విడుదల చేశారు. మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఉగ్రదాడిలో మృతిచెందిన ఇద్దరు తమిళనాడు జవాన్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇరవై లక్షల చెప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అమరులైన జవాన్లు వీరే.. 1. రాథోడ్ నితిన్ శివాజీ, మహారాష్ట్ర 2. వీరేంద్ర సింగ్, ఉత్తరాఖండ్ 3. అవదేశ్ కుమార్ యాదవ్, ఉత్తరప్రదేశ్ 4. రతన్ కుమార్ ఠాకూర్, బిహార్ 5. పంకజ్ కుమార్ త్రిపాఠి, ఉత్తర ప్రదేశ్ 6. జెట్ రామ్, రాజస్తాన్ 7. అమిత్ కుమార్, ఉత్తరప్రదేశ్ 8. విజయ్ మౌర్యా, ఉత్తరప్రదేశ్ 9. కుల్విందర్ సింగ్, పంజాబ్ 10, మనేశ్వర్ బసుమంతరాయ్, అస్సాం. 11. మోహన్ లాల్, ఉత్తరాఖండ్ 12. సంజయ్ కుమార్ సిన్హా 13. రామ్ వకీల్, ఉత్తరప్రదేశ్ 14. నాసీర్ ఆహ్మద్, జమ్మూ కశ్మీర్ 15. జైమాల్ సింగ్, పంజాబ్ 16. కుఖేందర్ సింగ్, పంజాబ్ 17. తిలక్ రాజ్, హిమాచల్ ప్రదేశ్ 18. రోహితేష్ లంబా, రాజస్తాన్ 19. విజయ్ సోరింగ్, జార్ఖండ్ 20. వసంత్ కుమార్, కేరళ 21. సుబ్రహ్మణ్యం , తమిళనాడు 22. గురు, కర్ణాటక 23. మనోజ్ కేఆర్ బెహరా 24. నారాయణ్ లాల్‌గుర్జార్, రాజస్తాన్ 25. ప్రదీప్ కుమార్, ఉత్తర ప్రదేశ్ 26. హమ్రాజ్ మీనా, రాజస్తాన్ 27. రమేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ 28. సంజయ్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్ 29. కౌశల్ కుమార్ రాజ్‌పుత్, ఉత్తరప్రదేశ్ 30. ప్రదీప్ సింగ్, ఉత్తర ప్రదేశ్ 31. శ్యామ్ బాబు, ఉత్తరప్రదేశ్ 32. అజిత్ కుమార్, ఉత్తరప్రదేశ్ 33. మహేందర్ సింగ్ అట్టారి, పంజాబ్ 34. అశ్విన్ కుమార్, మధ్యప్రదేశ్, 35. సుదీప్ బిస్వాస్, బెంగాల్ 36. శివచంద్రన్, తమిళనాడు -
‘అక్కడ శవాలు పడున్నాయి’
-
కశ్మీర్లో 18 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: శ్రీనగర్ శివారులో దాదాపు 18 గంటలపాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు చనిపోగా ఒక జవానుకు గాయాలయ్యాయి. మరో ఘటనలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ శివార్లలోని బందిపొరా రోడ్డు ముజ్గుంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు శనివారం రాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. రెండు వర్గాల మధ్య దాదాపు 18 గంటలపాటు హోరాహోరీగా కాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు బలగాలు సుమారు ఐదు ఇళ్లను పేల్చి వేశారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఒక జవానుతోపాటు ముగ్గురు పౌరులు గాయపడ్డారు. మృతులను బందిపొరా జిల్లా హజిన్ ప్రాంతానికి చెందిన ముదసిర్ రషీద్ పర్రే(16), సకీబ్బిలాల్ షేక్‌గా గుర్తించారు. అయితే, పర్రే వయస్సుతోపాటు, అతడు ఉగ్రవాదో కాదో నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తిని పాక్‌కు చెందిన అలీగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం ఈ ప్రాంతంలో భద్రతా బలగాలతో స్థానికులు ఘర్షణలకు దిగటంతో పెల్లెట్లు, బాష్పవాయువును ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోఘటనలో..యువతను ఉగ్రవాద ముసుగులోకి లాగుతున్న కిష్త్వార్ జిల్లా సౌందర్ దచ్చాన్ గ్రామానికి చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపు ఉగ్రవాది రియాజ్ అహ్మద్‌ను బలగాలు అరెస్టు చేశాయి. ఇతడు కరడుగట్టిన ఉగ్రవాది మొహమ్మద్ అమిన్ అలియాస్ జహంగీర్‌కు సన్నిహితుడని పోలీసులు తెలిపారు. ఏకే–47 చేత పట్టుకుని ఉన్న రియాజ్ అహ్మద్ ఫొటోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పరింపొరా ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనతో ఇతనికి సంబంధమున్నట్లు గుర్తించారు. యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగడంలో రియాజ్ నిపుణుడని అధికారులు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన జహంగీర్ కిష్త్వార్ ప్రాంతంలో చాలాకాలంగా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. -
ఉగ్రదాడుల్లో ఆర్మీ జవాన్ వీర మరణం
పాతపట్నం: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పాతపట్నం మండలం ఎ.ఎస్.కవిటి గ్రామానికి చెందిన సాధ గుణకరరావు (25) అనే ఆర్మీ జవాన్ మృతి చెందాడు. తోటి డ్రైవర్‌తో కలిసి జీపులో వెళ్తుండగా ఉగ్రమూకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి. కుమారుడు మృతి వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు, గ్రామ సర్పంచ్ అంపోలు భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో మూడు రోజులుగా ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఎ.ఎస్.కవిటికి చెందిన సాధ గుణకరరావు ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా మరో అసిస్టెంట్ డ్రైవర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున జీపుతో వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు ఎగబడ్డారు. ఈ ఘటనలో ముందుగా అసిస్టెంట్ డ్రైవర్‌కు, తరువాత గుణకరరావుకు తూటాలు తగిలాయి. అసిస్టెంట్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన గుణకరరావును ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటల సమయంలో గుణకరరావు మృతి చెందిన విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు తల్లి సాధ జయమ్మకు ఫోన్లో తెలియజేశారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు.. గుణకరరావు తండ్రి మల్లేశ్వరరావు వ్యవసాయకూలీ కాగా, ముగ్గురు అక్కలు కృపారాణి, సుశీల, సావిత్రిలకు వివాహాలు జరిగాయి. మరో ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటానని, ఇల్లు కట్టమని చెప్పి ఇంతలోనే కుమారుడు మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. 2012 సెప్టెంబర్‌లో విధుల్లో చేరిన గుణకరరావు పంజాబ్ రాష్ట్రం పఠాన్‌కోఠ్ యూనిట్ ఎం.ఈ.జీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం శ్రీనగర్‌లోని 1 ఆర్ఆర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన అంపోలు తారకేశ్వరరావు కూడా శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. నేడు మృతదేహం రాక! మృతదేహం శ్రీనగర్ నుంచి ఢిల్లీ వస్తుందని, అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుంటుందని గ్రామస్తులు తెలిపారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రం గ్రామానికి మృతదేహం తీసుకొస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆర్ఐ బి.సోమేశ్వరరావు, వీఆర్ఓ కె.సూర్యనారాయణలు గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. -
సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర దాడి
శ్రీనగర్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాదులు దాడి జరిపి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. గ్రెనేడ్ లాంఛర్లు, ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన కొందరు ముష్కరులు ఆదివారం వేకువజామున సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చీ రావటంతోనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. క్యాంప్ లోపలికి దూసుకెళ్లటానికి వారు చేసిన యత్నాలను సీఆర్పీఎఫ్ గార్డులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఉగ్రవాది కూడా మరణించి ఉంటాడని, అతని మృతదేహం కోసం క్యాంప్‌లో గాలిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి రాజేశ్ యాదవ్ తెలిపారు. అమరులైన వారిని సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తౌఫయిల్ అహ్మద్, ఇన్స్పెక్టర్ కుల్దీప్ రాయ్ (హిమాచల్ ప్రదేశ్), కానిస్టేబుళ్లు.. షరీఫుద్దీన్ గనీ (బుద్గాం), రాజేందర్ నైన్(రాజస్థాన్), పీకే పాండా(ఒడిశా)గా గుర్తించారు. చనిపోయిన ఉగ్రవాదులను మంజూర్ అహ్మద్ బాబా(పుల్వామా), ఫర్దీన్ అహ్మద్ ఖన్దే(త్రాల్)గా భావిస్తున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పోలీసులను పెద్ద సంఖ్యలో క్యాంప్‌నకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతని పాక్ ప్రేరేపిత జైష్–ఎ–మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాక్ కాల్పుల ఉల్లంఘన రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత పోస్టులపైకి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను చనిపోయాడు. వేకువ జామున పాక్ బలగాలు రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని భారత్ ఫార్వర్డ్ పోస్టుల పైకి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన జవాను ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా పూంఛ్ జిల్లా దిగ్వార్ సెక్టార్లో అర్ధరాత్రి నుంచి వేకువజాము 5.30 గంటల వరకు పాక్ బలగాలు కాల్పులు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాల యుద్ధ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరిపారు. రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణాధీన రేఖ వెంబడి ఫార్వర్డ్ పోస్టులను ఆదివారం పరిశీలించారు. డిసెంబర్ 10వ తేదీ వరకు ఎల్వోసీ వెంబడి పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనలు 881 జరగ్గా, గత ఏడేళ్లలో ఇదే అత్యధికం కావటం గమనార్హం. దీంతోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నవంబర్ వరకు మొత్తం 110 సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ ఘటనల్లో 14 మంది సైనికులు, 12 మంది పౌరులు, నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయ్యారని సైన్యం తెలిపింది. 2003లో భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ‘పుల్వామా దాడి ప్రధాని వైఫల్యం’ పుల్వామా సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి ప్రధాని మోదీ విదేశాంగ విధానం వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. దేశ విరోధులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఎన్నికల సమయంలో చెప్పిన మోదీ మాటలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుశ్మితా దేవ్ ప్రశ్నించారు.