
రాత్రి 20 కేజీల ఐఈడీతో వెళుతున్న....
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. పుల్వామా తరహాలో మరో దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నగా ఆర్మీ, పుల్వామా పోలీసులు, పారామిలటరీ బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పి కొట్టారు. వాహనంలో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉంచి దాడికి యత్నించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సరైన రీతిలో స్పందించాయి. బుధవారం రాత్రి 20 కేజీల ఐఈడీతో వెళుతున్న వైట్ హ్యూండాయ్ శాంట్రో కారును ఆపాయి. (హిజ్‌బుల్ టాప్ కమాండర్ దిగ్బంధం)
అయితే అందులోని వ్యక్తి బారికేడ్‌ను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లటానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అతడు బలగాలపై ఎదురు కాల్పులు జరుపుతూ అక్కడినుంచి పరారయ్యాడు. కారునుంచి పరారైన సదరు వ్యక్తిని హిజ్బుల్ ఉగ్రవాదిగా వారు గుర్తించారు. కాగా, గత సంవత్సరం పుల్వామాలో జరిగిన ఐఈడీ వాహన దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే.