ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే..! | Govt Release Names Of Slain CRPF Personnel In Pulwama Attack | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే..!

Published Fri, Feb 15 2019 4:29 PM | Last Updated on Fri, Feb 15 2019 4:54 PM

Govt Release Names Of Slain CRPF Personnel In Pulwama Attack - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. వారిలో 36 మృతదేహాలను గుర్తించి వారి వివరాలను శుక్రవారం విడుదల చేశారు. మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఉగ్రదాడిలో మృతిచెందిన ఇద్దరు తమిళనాడు జవాన్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఇరవై లక్షల చెప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

అమరులైన జవాన్లు వీరే..
1. రాథోడ్‌ నితిన్‌  శివాజీ, మహారాష్ట్ర
2. వీరేంద్ర సింగ్‌, ఉత్తరాఖండ్‌
3. అవదేశ్‌ కుమార్‌ యాదవ్‌,  ఉత్తరప్రదేశ్‌
4. రతన్‌ కుమార్‌ ఠాకూర్‌, బిహార్‌
5. పంకజ్‌ కుమార్‌ త్రిపాఠి, ఉత్తర ప్రదేశ్‌
6. జెట్‌ రామ్‌, రాజస్తాన్‌
7. అమిత్‌ కుమార్‌,  ఉత్తరప్రదేశ్‌
8. విజయ్‌ మౌర్యా,  ఉత్తరప్రదేశ్‌
9. కుల్విందర్‌ సింగ్‌, పంజాబ్‌
10, మనేశ్వర్‌ బసుమంతరాయ్‌, అస్సాం.
11. మోహన్‌ లాల్‌, ఉత్తరాఖండ్‌
12. సంజయ్‌ కుమార్‌ సిన్హా
13. రామ్‌ వకీల్‌, ఉత్తరప్రదేశ్‌
14. నాసీర్‌ ఆహ్మద్‌, జమ్మూ కశ్మీర్‌
15. జైమాల్‌ సింగ్‌, పంజాబ్‌
16. కుఖేందర్‌ సింగ్‌, పంజాబ్‌
17. తిలక్‌ రాజ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌
18. రోహితేష్‌ లంబా, రాజస్తాన్‌
19. విజయ్‌ సోరింగ్‌, జార్ఖండ్‌
20. వసంత్‌ కుమార్‌, కేరళ
21. సుబ్రహ్మణ్యం , తమిళనాడు
22. గురు, కర్ణాటక
23. మనోజ్‌ కేఆర్‌ బెహరా
24. నారాయణ్‌ లాల్‌గుర్జార్‌, రాజస్తాన్‌
25. ప్రదీప్‌ కుమార్‌, ఉత్తర ప్రదేశ్‌
26. హమ్రాజ్‌ మీనా, రాజస్తాన్‌
27. రమేష్‌ యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌
28. సంజయ్‌ రాజ్‌పుత్‌, ఉత్తరప్రదేశ్‌
29. కౌశల్‌ కుమార్‌ రాజ్‌పుత్‌, ఉత్తరప్రదేశ్‌
30. ప్రదీప్‌ సింగ్‌, ఉత్తర ప్రదేశ్‌
31. శ్యామ్‌ బాబు, ఉత్తరప్రదేశ్‌
32. అజిత్‌ కుమార్‌, ఉత్తరప్రదేశ్‌
33. మహేందర్‌ సింగ్‌ అట్టారి, పంజాబ్‌
34. అశ్విన్‌ కుమార్‌, మధ్యప్రదేశ్‌,
35. సుదీప్‌ బిస్వాస్‌, బెంగాల్‌
36. శివచంద్రన్‌, తమిళనాడు


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement