
కైరో: ఈజిప్టులో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 55 మంది పోలీసులు మరణించారు. కైరోకు 135 కిలోమీటర్ల దూరంలో ఎల్–వాహత్ ఎడారిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరు వర్గాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో పోలీసు అధికారులు, సైనికులు సహా 55 మంది మరణించారు. ఉగ్రవాదులు 15 మంది మరణించారు. అయితే వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనేది తెలియరాలేదు.
కాగా, 2013లో అధ్యక్షుడిగా ఉన్న ఇస్లాం మతవాది మొహమ్మద్ మోర్సీని పదవి నుంచి దింపేసిన తర్వాత ఈజిప్టులో పోలీసులు, భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. అప్పటి నుంచి వందలాది మంది పోలీసులు, ఆర్మీ సిబ్బంది దాడుల్లో మృతి చెందారు. మరోవైపు ఆర్మీ కూడా సినాయ్ ప్రావిన్సులో ఉగ్రవాదుల కోసం తరచూ గాలిస్తూ, అనుమానితులను అరెస్టు చేయడంతోపాటు ముష్కరుల ఇళ్లను కూల్చివేసింది. సినాయ్‌లోని కొన్ని ఇళ్ల నుంచి గిజాకు సొరంగ మార్గాలను కూడా ఆర్మీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment