ప్రణీత్‌ను అభినందించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి 82వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీత్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభినందించారు. ప్రణీత్ తన తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మిలతో కలిసి సోమవారం సచివాలయంలో సీఎంను కలిశాడు. ప్రణీత్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్...అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
భారీ నజరానా
భవిష్యత్తులో ప్రణీత్ ఇతర టోర్నీల కోసం సన్నద్ధమయ్యేందుకు, మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ. 2 కోట్ల 50 లక్షలను తెలంగాణ సీఎం ప్రకటించారు. రాష్ట్రం తరఫున గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ఐదో ఆటగాడిగా ప్రణీత్ గుర్తింపు పొందాడు.
ఆమెకు 50 లక్షలు
మరోవైపు మహిళా క్యాండిడేట్ మాస్టర్ (డబ్ల్యూసీఎం) హోదా పొందిన చెస్ ప్లేయర్ వీర్లపల్లి నందినికి రూ. 50 లక్షల ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం ఆదేశించారు.
చదవండి: రన్నరప్ హంపి
బెర్లిన్: వరల్డ్ చెస్ అర్మగెడాన్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ మహిళల టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. బిబిసారా అసాబయేవా (కజకిస్తాన్)తో జరిగిన ఐదు గేమ్‌ల ఫైనల్లో హంపి 1.5–3.5తో ఓడిపోయింది. తొలి గేమ్‌లో హంపి 33 ఎత్తుల్లో ఓడిపోగా.. రెండో గేమ్‌లో హంపి 41 ఎత్తుల్లో గెలిచింది.
మూడో గేమ్‌లో 61 ఎత్తుల్లో, నాలుగో గేమ్‌లో 27 ఎత్తుల్లో బిబిసారా విజయం సాధించింది. ఐదో గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఎనిమిది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య ఈ టోర్నీ జరిగింది. మహిళల టోర్నీ విన్నర్, రన్నరప్ హోదాలో బిబిసారా, హంపి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అర్మగెడాన్ గ్రాండ్ ఫైనల్ టోర్నీకి అర్హత సాధించారు.
గ్రాండ్ ఫైనల్ టోర్నీకి ఇప్పటికే సో వెస్లీ, సామ్ షాంక్‌లాండ్ (అమెరికా), దొమ్మరాజు గుకేశ్ (భారత్), నొదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) కూడా అర్హత పొందారు. త్వరలో యూరోప్, ఆఫ్రికా రీజియన్ మధ్య జరిగే టోర్నీ ద్వారా మరో ఇద్దరికి గ్రాండ్ ఫైనల్ టోర్నీకి బెర్త్‌లు లభిస్తాయి.
చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే!
Comments
Please login to add a commentAdd a comment