Chess Grand Master
-
కోనేరు హంపికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.తెలుగు తేజం కోనేరు హంపి విజయంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ అభినందనలు తెలిపారు. The pride of India, @humpy_koneru, has won the 2024 FIDE Women's World Rapid Championship for the second time! She is an inspiration to many, particularly those balancing professional and personal life. Wishing her many more victories! pic.twitter.com/v0sv5eE5qM— YS Jagan Mohan Reddy (@ysjagan) December 29, 2024 -
ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత ఇలా.. సంతోషంగా ఉంది!
India's 85th chess Grandmaster- దుబాయ్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనుకున్నది సాధించాడు తమిళనాడు చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్. 31 ఏళ్ల శ్యామ్ నిఖిల్భారత చెస్‌లో 85వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. జీఎం హోదా దక్కాలంటే చెస్ ప్లేయర్ 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్‌లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా లభిస్తుంది. 2012లోనే శ్యామ్ 2500 ఎలో రేటింగ్‌ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్‌లు సాధించాడు. అయితే చివరిదైన మూడో జీఎం నార్మ్ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది.12 ఏళ్లపాటు వేచి చూశాక ఎట్టకేలకు శ్యామ్ నిఖిల్ దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో శ్యామ్ నిఖిల్ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్‌లో నిలిచాడు. చాలా సంతోషంగా ఉందిఈ క్రమంలో ఏడుగురు గ్రాండ్మాస్టర్లతో తలపడిన శ్యామ్ ఒకరిపై గెలిచి, ఆరుగురితో ‘డ్రా’ చేసుకొని మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. ‘ఎనిమిదేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాను. అయితే మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్–13 రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాను. 2012లోనే రెండు జీఎం నార్మ్‌లు అందుకున్నా మూడో జీఎం నార్మ్ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని 2022లో కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచిన శ్యామ్ నిఖిల్ వ్యాఖ్యానించాడు. -
కొత్త క్వీన్ వైశాలి: తోబుట్టువుతో పోటీపడి.. తమ్ముడి నీడను దాటి
‘మీ తమ్ముడు నీకంటే నాలుగేళ్లు చిన్నవాడు. కానీ గ్రాండ్‌మాస్టరై నాలుగేళ్లు దాటిపోయింది. మరి మీరెప్పుడు గ్రాండ్‌మాస్టర్ అవుతారు?’ ఏడాది కాలంగా ఎక్కడికి వెళ్లినా వైశాలిని వెంటాడుతున్న ప్రశ్న అది. ఒక్కోసారి తోబుట్టువు ఘనత కూడా తెలీకుండానే అనవసరపు అసహనాన్ని కలిగిస్తుంది. నిజానికి క్రీడల్లో ఒకరి ప్రదర్శనకు మరొకరి ఆటతో పోలికే ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వైశాలికి మాత్రం ఇంట్లోనే పోటీ ఉండటంతో పోలిక సహజమైంది. దాంతో ఆమెపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. కానీ చదరంగంలో ఒత్తిడిని అధిగమించడమే అన్నింటికంటే పెద్ద సవాల్ కదా! వైశాలి కూడా అలాగే ఆలోచించింది. జీఎం కావడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో వరుసగా ఒక్కో గేమ్‌లో, ఆపై ఒక్కో టోర్నీలో గెలుపుపై మాత్రమే దృష్టి పెట్టి దూసుకుపోయింది. క్యాండిడేట్స్లాంటి మెగా టోర్నీకి కూడా అర్హత సాధించింది. అక్కడా ఆమె తన ప్రశాంతతను కొనసాగించింది. ఫలితంగా విజయాలు వైశాలిని వెతుక్కుంటూ వచ్చాయి. ఎట్టకేలకు 22 ఏళ్ల వయసులో చెస్ గ్రాండ్‌మాస్టర్ల జాబితాలో తన పేరును రాసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న ఆ అమ్మాయి చిచ్చరపిడుగు అయిన తమ్ముడి నీడను దాటి ఇప్పుడు సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. మున్ముందు ఆమె సాధించబోయే ఘనతల్లో ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇకపై మరిన్ని సంచలనాలు ఈ చెన్నై అమ్మాయి నుంచి రావడం ఖాయం. ఎప్పుడో 2002.. భారత్ నుంచి చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తొలి మహిళగా కోనేరు హంపి గుర్తింపు.. ఆపై మరో 9 ఏళ్లు.. 2011లో రెండో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ద్రోణవల్లి హారిక.. ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిల తర్వాత భారత చెస్‌లో మహిళలకు సంబంధించి ఒక తరహా శూన్యం ఆవరించింది. ఒక వైపు పురుషుల విభాగంలో ఆటగాళ్లు దూసుకుపోతుండగా, మహిళల వైపు నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనే రాలేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడ కొన్ని మెరుపులు కనిపించినా అవి తాత్కాలికమే. పైగా దిగువ స్థాయికే పరిమితమయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ లేదా విమెన్ గ్రాండ్‌మాస్టర్ స్థాయికి మించి కొందరు ముందుకు సాగలేకపోయారు. అలాంటి స్థితిలో వైశాలి ప్రదర్శన గురించి ఎంత పొగిడినా తక్కువే. అక్కడే మొదలు.. 2013లో వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడేందుకు చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చెన్నైకి వచ్చాడు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అసలు ఆటకు ముందు 20 మంది జూనియర్ ప్లేయర్లతో ఒకేసారి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు కార్ల్సన్ సిద్ధమయ్యాడు. ఈ పోరులో 12 ఏళ్ల వైశాలి మాత్రమే కార్ల్‌సన్‌ను ఓడించడంలో సఫలమైంది. ఆ ఫలితం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎగ్జిబిషన్ మ్యాచే అయినా కార్ల్‌సన్‌పై గెలుపు అంటే ఆషామాషీ కాదు. అప్పుడు వైశాలి అందరి దృష్టిలో పడింది. ఆరేళ్ల వయసులో చాలా ఎక్కువ సమయం టీవీ చూడటంలోనే గడుపుతున్న కూతురు దృష్టి మళ్లించేందుకు తండ్రి రమేశ్‌బాబు చెస్ నేర్పించాడు. తర్వాతి రోజుల్లో అదే ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. స్థానికంగా పోటీ పడిన తొలి ఈవెంట్లోనే వైశాలి గెలిచి రావడంతో ఆమె పూర్తి స్థాయిలో ఆట వైపు మళ్లింది. తండ్రితో పాటు తల్లి నాగలక్ష్మి ప్రోత్సాహం, సహకారం కూడా ఆమె వేగంగా దూసుకుపోవడంలో ఉపకరించాయి. చెన్నైలోని వేలమ్మ స్కూల్, ఆ తర్వాత కాలేజ్‌లో.. వైష్ణవ్ ఇన్స్టిట్యూట్ కూడా వైశాలి చదరంగ ప్రదర్శనను గుర్తించి ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన తండ్రి పోలియో కారణంగా ఎక్కడా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. అయినా ఇతరత్రా ఒక తండ్రిగా కూతురికి అండగా నిలవడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన అక్కను ఆడనీయకుండా చేస్తూ ఇబ్బంది పెట్టిన తమ్ముడు ప్రజ్ఞానంద.. తర్వాత రోజుల్లో సాధనలో ఆమెకు భాగస్వామిగా మారడమే కాదు గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి అక్క గేమ్‌లను విశ్లేషించి తప్పొప్పులతో ఆమె ఆటకు సహాయకారిగా వ్యవహరించడం విశేషమే! తొలిసారి గుర్తింపుతో.. 2012.. వైశాలి చెస్ కెరీర్‌ను మలుపు తిప్పింది. స్లొవేనియాలో అండర్–12 బాలికల వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ జరిగింది. 11 ఏళ్ల వైశాలి యూరోప్‌లో పర్యటించడం అదే తొలిసారి. టైమ్ జోన్ భిన్నంగా ఉండటంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30కి గేమ్‌లు ప్రారంభం అయ్యేవి. దాంతో ఒక్కసారిగా అలవాటు తప్పిన సాధనతో పాటు ఇతరత్రా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఇలాంటివాటిని అధిగమించి∙ఆమె చాంపియన్‌గా నిలవడం అద్భుతం! మూడేళ్ల తర్వాత గ్రీస్‌లో ఇదే తరహాలో వరల్డ్ అండర్–14 చాంపియన్‌షిప్ జరిగింది. ఈసారి మాత్రం ఆమె పూర్తి సన్నద్ధతతో వెళ్లింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె దానికి న్యాయం చేస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ అండర్–10 విభాగంలో తమ్ముడు ప్రజ్ఞానంద కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. దాంతో రమేశ్‌బాబు కుటుంబంలో ఆనందం రెట్టింపయింది. ఒలింపియాడ్‌లో సభ్యురాలిగా.. కోవిడ్ సమయం ప్రపంచవ్యాప్త క్రీడా ఈవెంట్లపై కూడా ప్రభావం చూపించింది. అయితే ఆన్లైన్ గేమ్‌ల తర్వాత చెస్ ఆటగాళ్లు కొంత వరకు తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు. ఈ క్రమంలో వైశాలి ఆన్లైన్లో విమెన్స్ స్పీడ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని సత్తా చాటింది. తుది ఫలితం అనుకూలంగా రాకపోయినా రెండు సంచలన విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. తనకంటే ఎంతో ఎక్కువ రేటింగ్ ఉన్న ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారిణులు అసబయెయెవా, ద్రోణవల్లి హారికలను వైశాలి ఓడించగలిగింది. ప్రపంచ చెస్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన ఒలింపియాడ్ ఆమె కెరీర్లో మరో చెప్పుకోదగ్గ ఘనతగా నిలిచింది. ఇందులో విజేతైన భారత జట్టులో వైశాలి కూడా ఉంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తొలి సోదర, సోదరి ద్వయంగా అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధించినా గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకోవడమే వైశాలికి కీలకంగా మారింది. భారత చెస్ చరిత్రలోని 83 మంది గ్రాండ్మాస్టర్లలో ఇద్దరు మాత్రమే మహిళలు. అయితే వైశాలి శ్రమ, పోరాడేతత్వం, ఓటమిని అంగీకరించని నైజం ఆమెను కొత్త జీఎంగా నిలిపాయి. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా పట్టుదలతో సాగి ఈ చెన్నై అమ్మాయి.. తన లక్ష్యాన్ని చేరింది. 2019లో ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్‌లో ఆమె తొలి జీఎం నార్మ్ సాధించింది. పది మంది ప్రత్యర్థులతో తలపడగా వారిలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు. రెండో జీఎం సాధించేందుకు ఆమెకు కొంత సమయం పట్టింది. హెరాక్లియోన్‌లో జరిగిన ఫిషర్ ఓపెన్‌లో ఆమె రెండో నార్మ్ సొంతం చేసుకుంది. ఇదే జోరులో మూడో నార్మ్ వేట సాగింది. ఏడాదిన్నర లోపే ఖతర్ ఓపెన్‌లో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించి ఎనిమిది గేమ్‌లలోనూ నార్మ్ సాధించడంతో ఇక జీఎం లాంఛనమే అయింది. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు మారియా ముజీచుక్, స్టెఫనోవా, జోంగి తాన్లను ఓడించడంతో పాటు 2600 రేటింగ్ దాటడంతో ఇటీవలే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో వైశాలి జీఎం ఖాయమైంది. ప్రపంచ చెస్‌లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వైశాలి, ప్రజ్ఞానంద నిలిచారు. ఇకపై కూడా తమ్ముడి నీడలో కాకుండా తన ఆటతో, ఎత్తుకు పైఎత్తులతో చదరంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని వైశాలి ధ్యేయంగా పెట్టుకుంది. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
‘ప్రజ్ఞ’కు పట్టం.. 18 ఏళ్ల వయస్సులో ఎన్నో సంచలనాలు
నవంబర్ 2013.. విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ మధ్య వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్.. వేదిక చెన్నైలోని హయత్ రీజెన్సీ హోటల్.. ఎనిమిదేళ్ల కుర్రాడొకడు టోర్నీ జరిగినన్ని రోజులు తన కోచ్‌తో పాటు అక్కడే తచ్చాడుతూ కనిపించాడు. ప్రేక్షకుల మధ్యలో కూర్చొనే అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు దిగ్గజాల మధ్య పోరులో ఎత్తులు, పైఎత్తులను గమనించడం.. లేదంటే హోటల్ లాబీలో చెస్‌తో సంబంధం ఉన్న ఎవరైనా ఆట గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినడం.. అన్ని రోజులూ అతనిది అదే దినచర్య! ఆ సమయంలో అతనొక ఔత్సాహిక ఆటగాడు, చెస్ అభిమాని మాత్రమే. అతనే కాదు అతని కోచ్ కూడా ఊహించలేదు.. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత ఆ ‘ప్రజ్ఞ’ ప్రపంచ స్థాయికి చేరుతుందని. ఆ కుర్రాడు.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన రెండో భారతీయుడిగా నిలుస్తాడని.. అదే కార్ల్సన్తో విశ్వ వేదికపై తలపడతాడని! అద్భుతమైన ప్రతిభతో ఇప్పుడు భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా దక్కించుకున్న ఆ బాల మేధావి పేరు ఆర్. ప్రజ్ఞానంద. గత ఏడాది మే నెలలో చెస్ ఏబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్ జరుగుతోంది. అదే సమయంలో ప్రజ్ఞానంద తన 11వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. స్టడీ బ్రేక్ అంటూ పరీక్షల మధ్యలో కొంత విరామం ఇవ్వడంతో అతను ఈ టోర్నీలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. కార్ల్సన్, వీయీ, అనీశ్ గిరి, డింగ్ లారెన్ లాంటి స్టార్లు ఉన్న ఈ టోర్నీలో ‘నేనేమాత్రం ముందుకు వెళ్లగలను?’ అనే సందేహం ఉండటంతో పరీక్షల గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ టోర్నీలో వచ్చిన అద్భుతమైన ఫలితాలు ఫైనల్ వరకు తీసుకెళ్లాయి. దాంతో ఒకే సమయంలో పగలు, రాత్రి అటు చెస్, ఇటు పరీక్షలు అంటూ మేనేజ్ చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల వరకు గేమ్ ఆడి మళ్లీ 7 గంటలకు అతను పరీక్షకు హాజరయ్యాడు. ఆ శ్రమ వృథా కాలేదు. ఆ టోర్నీలో ఆల్‌టైమ్ గ్రేట్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించడంలో అతను సఫలమయ్యాడు. మూడు నెలల వ్యవధిలో కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించడంతో అతని గత విజయం గాలివాటు కాదని, ప్రజ్ఞానంద ఎంతో ప్రత్యేకమైన ఆటగాడనేది ప్రపంచానికి తెలిసింది. 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ప్రపంచ చెస్‌లో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన ఈ చెన్నై చిచ్చరపిడుగు ఆపై కూడా అంతే వేగంగా దూసుకుపోయాడు. అక్క చూపిన దారిలో.. ప్రజ్ఞానంద.. ఆరంభంలో ఆసక్తితో కాకుండా అనుకోకుండానే చదరంగపు ఎత్తులు నేర్చుకున్నాడు. తమిళనాడు స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్‌లో తండ్రి రమేశ్‌బాబు మేనేజర్. పోలియో బాధితుడైన ఆయన తన పిల్లలను సరదాగా ఆటల కోసం బయటకు తీసుకెళ్లడంలో ఇబ్బంది పడేవాడు. పెద్దమ్మాయి వైశాలి ఎక్కువసేపు టీవీ చూడటం, వీడియో గేమ్‌లకే అతుక్కుపోయేది. దాంతో దానిని నివారించేందుకు తనకు ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆయన తన కూతురును ముందుగా చెస్ వైపు నడిపించాడు. ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆమె ఆసక్తి పెంచుకొని చదరంగం బోర్డుపైనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. అక్క ఆటను చూస్తూ వచ్చిన చిన్నారి ప్రజ్ఞానంద కూడా చెస్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కను దాటి అగ్రస్థానానికి చేరాడు. వైశాలి కూడా ఇప్పుడు భారత చెస్‌లో చురుకైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ మాస్టర్, మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా కూడా వైశాలి సత్తా చాటుతుండగా.. మరో వైపు తమ్ముడు ప్రపంచ కప్ రన్నరప్ స్థాయికి చేరాడు. కోచ్ చూపిన బాటలో.. ప్రజ్ఞానంద గెలుపు ప్రస్థానంలో కోచ్ రమేశ్‌దే కీలక పాత్ర. సహజమైన ప్రతిభను గుర్తించి చాలా చిన్న వయసులోనే సానబెట్టడంలో ఆయన దూరదృష్టి పని చేసింది. చెన్నైలోని చెస్ గురుకుల్ అకాడమీలో ఆయన వద్ద దాదాపు నాలుగు వందల మంది శిక్షణ పొందుతుండగా వారిలో ప్రజ్ఞ ప్రియ శిష్యుడయ్యాడు. అందుకే ఈ సంచలనం గురించి రమేశ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ‘పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ గంటలు గంటలు గడిపే వయసులో ప్రజ్ఞానంద ఈ స్థాయికి చేరాడు. ప్రతిభతోపాటు కష్టపడే తత్వం కూడా ఉంది ఆ పిల్లాడికి! అందుకే ఇంకా ఏదో సాధించాలంటూ అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచను. అతను తర్వాతి గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్ సాధిస్తాడని తెలిసి కూడా దాన్ని బయటకు వెలిబుచ్చకుండా బరిలోకి దించాను. ఆటలో గెలుపుతో పాటు ఓటములూ ఉంటాయనే విషయం అతనికి ఇప్పుడు అర్థమైంది. ఓడినా తన రొటీన్‌ను మార్చుకోడు కాబట్టి మానసికంగా సమస్య లేదు. పెద్దగా స్నేహితులు కూడా లేరు. కాబట్టి సమయం దొరికితే నేనే అతనితో సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడతాను. ఏడాదిగా అతను అద్భుతాలు చేస్తున్నాడు. అవి అలాగే కొనసాగుతాయని నా నమ్మకం’ అన్నారు కోచ్. అన్నీ సంచలనాలే.. ప్రజ్ఞానందకు ఇటీవలే 18 ఏళ్ల నిండాయి. ఇప్పటికే అతను అంతర్జాతీయ చెస్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఇటీవల కార్ల్సన్తో తలపడి ప్రపంచ కప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలవడం అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. అయితే చిన్న వయసులోనే వరుసగా సాధించిన సంచలనాల జాబితా కూడా పెద్దదే! 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్ అయి ఆపై రెండేళ్ల తర్వాత గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. అంతకు ముందే ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్–8, అండర్–10 విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడు కూడా అతనే. ఆనంద్, హరికృష్ణ తర్వాత ఈ దిగ్గజాన్ని ఓడించిన మూడో భారతీయుడు ప్రజ్ఞానందే కాగా, మొత్తం 3 సార్లు అతను ఈ ఫలితాన్ని పునరావృతం చేయడం విశేషం. 14 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టోర్నీ ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్ (డెన్మార్క్)లో విజేతగా నిలవడంతో అతనికి తొలిసారి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత యూత్ అండర్–18 వరల్డ్ చాంపియన్‌షిప్ కూడా అతని ఖాతాలోనే చేరింది. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌కు సవాల్ విసిరే ఆటగాడిని ఎంపికచేసే ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నీకీ ప్రజ్ఞ అర్హత సాధించాడు. అతని విజయాలకెప్పుడూ అమ్మ నాగలక్ష్మి తోడుంటూ వచ్చింది. ఇటీవలి వరల్డ్ కప్ సమయంలోనే ఆమె పైనా అందరి దృష్టి పడింది. చిన్నప్పటి నుంచి కొడుక్కి తోడుగా.. అతని ఏర్పాట్లన్నీ చూస్తూ.. మ్యాచ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడూ ఏమాత్రం లోటు రానివ్వకుండా.. తన చేతివంటతో బిడ్డపై చూపించే ఆ తల్లి ప్రేమ కూడా ఆటల సమయంలో ఆ చిన్నారికి అదనపు బలమవుతోంది. ప్రజ్ఞానంద ఎంతో ప్రతిభావంతుడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని ఆట గురించి ఒక ప్రత్యేక అంశం నన్ను ఆకట్టుకుంటోంది. ‘డ్రా’కు అవకాశం ఉన్న మ్యాచ్‌లలో కూడా ఎక్కడా అతను తగ్గకుండా మిడిల్ గేమ్‌లో అనూహ్యమైన ఎత్తులతో అతను ఫలితం వైపు తీసుకెళ్తాడు. వేర్వేరు టోర్నమెంట్లలో గేమ్‌లను ఎంచుకునే విషయంలోనూ ఎంతో పరిణతి ప్రదర్శిస్తున్నాడు. అతను కెరీర్లో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. – విశ్వనాథన్ ఆనంద్ ♦మొహమ్మద్ అబ్దుల్ హాది -
చదరంగ విప్లవం ముంగిట్లో భారత్!
దశాబ్ద కాలంలోనే భారత్‌లో యాభై మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు అవతరించారు. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. ఎంతోమంది యువకులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. చెస్‌కు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. అయితే దేశంలో చదరంగ విప్లవానికి ఇది నాంది మాత్రమే. మున్ముందు జరగాల్సింది చాలా మిగిలి ఉంది. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఇంకో భారతీయుడు ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తాడా? ఏమైనా, భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందని మాత్రం తప్పక చెప్పవచ్చు. బిందువు బిందువు సింధువైనట్లు... ముందు కొంతమంది యువ ప్రతిభావంతులు చెస్ గ్రాండ్ మాస్టర్లుగా ఎదిగారు. ఆ తరువాత పరిపక్వత లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. భారతీయ చదరంగ చరిత్రలో డి.గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద నేతృత్వంలో సువర్ణ అధ్యాయం మొదలైంది. వీరితోపాటు ఎంతోమంది యువ కులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. కొత్త కొత్త ఎత్తులను అధిరోహిస్తున్నారు. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ సందర్భంగా భారతీయ క్రీడా కారుల ఆటతీరును గమనించినప్పుడు ఇలాంటిది ఏదో జరగాలని మనం ఆశించాము. ఆ పోటీల్లో ఇండియా–బి బృందం ఓపెన్ కేటగి రిలో కాంస్య పతకం సాధించింది. మహిళా క్రీడాకారులు కూడా కాంస్య పతకం గెలుచుకున్నారు. అయితే ఫైడ్ చెస్ ర్యాంకింగ్‌లో గుకేశ్ టాప్–10లో ఒకడిగా ఎదగడంతో మిగిలిన వారు కూడా ఇప్పుడు మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదరంగంలో అతితక్కువ కాలంలో వచ్చిన ఈ గుణాత్మక మార్పునకు కారణాలు ఎన్నో. చెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. ఆటగాళ్లకూ, ఆటకూ ఎక్స్ పోజర్ కూడా బాగుంది. అత్యున్నతస్థాయి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యానికి కొరతే లేదు. దేశంలో చదరంగం మరింత ఎదిగేందుకు ఈ నైపుణ్యమే కీలకం. విస్తృతస్థాయిలో నైపుణ్యం ఉండటం పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కాస్తా ఆటగాళ్లు మరింత రాటుదేలేందుకు ఉపయోగ పడుతుంది. భారత్ తరఫున ఇప్పుడు చెస్ ఒలింపియాడ్ లేదా వరల్కప్ పోటీల్లో పాల్గొనాలంటే అత్యున్నత స్థాయి ఆట ఆడాల్సి ఉంటుంది. మనకేం ఫర్వాలేదు అనుకునే అవకాశం ఏ ఆటగాడికీ ఉండదు. అందరూ ముంగాళ్లపై నుంచోవాల్సిందే. నిజాయితీగా ఉండాల్సిందే. ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూంటారు. మంచి మిత్రులే కానీ, ఆట విషయానికి వస్తే మాత్రం ఎవరి గుట్లు వారి వద్దే ఉంటాయి. ఎందుకంటే ఆ రహస్యాలే వారికి ఏదో ఒక రోజు విజయాన్ని సంపాదించి పెట్టవచ్చు. ఇక్కడ చాలామంది టాప్ ర్యాంకింగ్ ఆటగాళ్లను మాత్రమే చూస్తున్నారు. కానీ కింది స్థాయిలోనూ చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నేను భారతదేశంలో నంబర్ వన్ (1986 జూలై ఒకటవ తేదీన 2405 ఎలో రేటింగ్‌తో ప్రవీణ్ థిప్సే కంటే ముందుకు వెళ్లినప్పుడు)గా మారినప్పుడు దరిదాపుల్లో ఇంకో ఆటగాడు కనిపించలేదు. 1988లో ఇరవై ఏళ్ల వయసులో నేను గ్రాండ్‌మాస్టర్ అయినప్పుడు పోటీల గురించి కాకుండా, రానున్న మూడేళ్లలో ఉన్నత స్థానానికి చేరుకోవడం ఎలా అని ఆలోచించాను. నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి! 1988లో నేను గ్రాండ్ మాస్టర్‌గా అవతరిస్తే, మూడేళ్ల తరువాత 1991లో దివ్యేందు బారువా ఆ ఘనత సాధించాడు. ప్రవీణ్ థిప్సే 1997 నాటికి గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడు పరిస్థితిలో చాలామార్పు వచ్చింది. 2013 నుంచి ఇప్పటివరకూ సుమారు 50 మంది గ్రాండ్మాస్టర్లుగా ఎదిగారు. ఎలో రేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉన్న భారతీయ గ్రాండ్ మాస్టర్లు (పాక్షికంగా రిటైరైన నాతో కలిపి) ఆరుగురు ఉన్నారిప్పుడు. గ్రాండ్ మాస్టర్ కావడం చాలా గొప్పవిషయమే అయినప్పటికీ ప్రస్తుతం సాధారణమైపోయింది. మారుతున్న కాలానికి నిదర్శనం ఇది. ఈ తరానికి ఇంకో సానుకూల అంశమూ ఉంది. నాకున్న దశాబ్దాల అనుభవంపై వారు ఆధారపడవచ్చు. అలాగే ఎందరో చెస్ గురు వుల ప్రస్థానాల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చాలా కీలకం. కానీ మాలాంటివాళ్లం ఈ తరం ఆటగాళ్లకు మార్గ దర్శనం మాత్రమే చేయించగలం. టాప్ లెవల్ ఆటగాళ్లందరికీ ఇప్పుడు దాదాపు అన్ని రకాల పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి ఆటగాళ్లను వేరు చేసే అంశాలు వారి ప్రవర్తన, నిత్యం ఉన్నతస్థాయి ఆటను కొనసాగించగలగడం, శారీరక దారుఢ్యం, ఒత్తిడికి లోనుకాకపోవడం. అంతేకాదు... ఆట విషయంలో సమగ్రత కూడా చాలా అవసరం. ప్రత్యర్థి ఎప్పుడు ఏ రకమైన సవాలు విసురుతాడో మనకు తెలియదు కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండటం అవసరం. కొంతమంది ప్రత్యర్థులు మీరు తయారైన దానికంటే భిన్నమైన రీతిలో దాడికి దిగవచ్చు. అప్పుడు మీరెలా స్పందిస్తారు? దేనిపై ఆధారపడతారు? మీ లెక్కకు చిక్కని విషయమని భావిస్తారా? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటేనే బాగా శ్రమించడం అన్నదానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఎలో రేటింగ్ 2700కు చేరుకోవడం కూడా ఈ శ్రమలో భాగమే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. భారతీయ చదరంగం కేవలం పురుషులకు మాత్రమే చెందింది కాదు. దేశంలో చదరంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే మహిళా క్రీడాకారులు కూడా బాగా రాణించాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ పురుషులు, మహిళా క్రీడాకారుల సంఖ్యలో చాలా అంతరం ఉంది. భారత్‌లోనే కాదు... ప్రపంచం మొత్తమ్మీద ఇదే పరిస్థితి. ఈ అంత రాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాడమీ ఏర్పాటు ద్వారా మేమీ ప్రయత్నం చేస్తున్నాం. విజయం సాధిస్తామన్న నమ్మ కమూ ఉంది. కోనేరు హంపి, డి.హారిక, ఇతరుల స్థాయుల మధ్య చాలా అంతరం ఉంది. ఉన్నత స్థానంలో ఏళ్ల తరబడి కొనసాగేందుకు తగిన జ్ఞానం హారిక, హంపికి ఉంది. అయితే మిగిలిన వారు సమీప భవిష్యత్తులోనే వీరికి సవాలు విసరగలరని ఆశిస్తున్నా. ఒకే ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు కదా! అసలైన విప్లవం అందరినీ తోడుతీసుకునే మొదలవుతుంది. గుకేశ్, ప్రజ్ఞానంద్ ఇద్దరూ చదరంగంలో మారుతున్న తరానికి ప్రతినిధులు. నా అనుభవం వారికి ఉపయోగపడుతుంది కానీ, వారు తమ సొంత మార్గంలో మరింత దూరం ప్రయాణించడం అలవర్చు కోవాలి. తమ సమస్యలకు వారే పరిష్కారాలు వెతుక్కోవాలి. కొత్త హోదా, హంగు ఆర్భాటాలకు వారిప్పుడిప్పుడే అలవాటు పడుతు న్నారు. ఎదురుదెబ్బలూ వారికి ఎదురు కావచ్చు. ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కాకపోతే వీరు అనుసరిస్తున్న మార్గం మాత్రం సరైందనే చెప్పాలి. మిగిలినవి ఎలా ఉన్నా ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం భారత దేశ చదరంగం ఒక్కో అడుగే ముందుకేయాలి. ఎదుగుతున్నప్పటికీ అందుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. విçస్తృతమైన, లోతైన వ్యవస్థ అక్కరకొచ్చే అంశం. కాలం గడుస్తున్న కొద్దీ ఒకదానికి ఒకటి పూరకంగా వ్యవహరిస్తాయి. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఈ యువ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తారా? ఇంకో భారతీ యుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ఒకే మాట చెప్పవచ్చు. భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందీ అని! విశ్వనాథన్ ఆనంద్ వ్యాసకర్త ప్రపంచ ఛాంపియన్ షిప్ ఐదుసార్లు నెగ్గిన చదరంగ క్రీడాకారుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే!
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌కు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం. చెస్‌కు చహల్ వీరాభిమాని. గతంలో భారత్‌లో జరిగిన వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌కు ప్రతినిధిగా వ్యవహరించాడు. ఆల్పైన్ వారియర్స్ ఫ్రాంచైజీకి చహల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు ఇటీవలే దుబాయ్ వేదికగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియాకు మ్యాచ్‌లు లేకపోవడంతో అంబాసిడర్ హోదాలో దుబాయ్‌కు వెళ్లాడు. తాజాగా చహల్ ఒక యువతితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''నేనిప్పుడు దుబాయ్‌లో ఉన్నా. మిస్టరీ గర్ల్ విత్ గ్లోబల్ చెస్ లీగ్''అని క్యాప్షన్ జత చేశాడు. అయితే చహల్ పేర్కొన్న మిస్టరీ గర్ల్ పేరు భలే గమ్మత్తుగా ఉంది. ఆమె పేరు జెస్సీ ఫిబ్రవరి. సౌతాఫ్రికాకు చెందిన జెస్సీ ఫిబ్రవరి.. రెండుసార్లు సౌతాఫ్రికా వుమెన్స్ చెస్ చాంపియన్.. మరోసారి ఆఫ్రికన్ వుమెన్స్ చెస్ చాంపియన్‌గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా జెస్సీ తన ట్విటర్లో చహల్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''మొత్తానికి చహల్‌ను కలుసుకున్నా.. సంతోషంగా ఉంది'' అంటూ పేర్కొంది. కాగా చహల్ ఫోటోపై అభిమానులు స్పందించారు. ''ఎవరు పిల్లా నువ్వు.. పేరే గమ్మత్తుగా ఉంది.. చహల్‌తో ఫోటో దిగావు సరే.. ధనశ్రీ చూస్తే ఊరుకుంటుందా.. అంతే సంగతి'' అంటూ కామెంట్ చేశారు. ఇక సౌతాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్‌కు చెందిన జెస్సీ ఫిబ్రవరి 2016లో మహిళల విభాగంలో చెస్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకుంది. 2021 మేలో జెస్సీ ఫిబ్రవరి వుమెన్స్ ఆఫ్రికన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని 8 స్కోరుకు గాను ఏడు పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లతో 2100 రేటింగ్ సాధించిన జెస్సీ ఫిబ్రవరి గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించింది. ఇక 2021 జూలైలో జరిగిన మహిళల చెస్ వరల్డ్‌కప్‌కు క్వాలిఫై సాధించినప్పటికి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. Just 2 hardcore cricket fans. pic.twitter.com/UBgN3TTmxy — Jesse February (@Jesse_Feb) June 25, 2023 చదవండి: #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! #Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
స్పాన్సర్లు లేరన్న బాధ! 2 కోట్ల 50 లక్షల నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆమెకు..
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి 82వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీత్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభినందించారు. ప్రణీత్ తన తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మిలతో కలిసి సోమవారం సచివాలయంలో సీఎంను కలిశాడు. ప్రణీత్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్...అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారీ నజరానా భవిష్యత్తులో ప్రణీత్ ఇతర టోర్నీల కోసం సన్నద్ధమయ్యేందుకు, మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ. 2 కోట్ల 50 లక్షలను తెలంగాణ సీఎం ప్రకటించారు. రాష్ట్రం తరఫున గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ఐదో ఆటగాడిగా ప్రణీత్ గుర్తింపు పొందాడు. ఆమెకు 50 లక్షలు మరోవైపు మహిళా క్యాండిడేట్ మాస్టర్ (డబ్ల్యూసీఎం) హోదా పొందిన చెస్ ప్లేయర్ వీర్లపల్లి నందినికి రూ. 50 లక్షల ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం ఆదేశించారు. చదవండి: రన్నరప్ హంపి బెర్లిన్: వరల్డ్ చెస్ అర్మగెడాన్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ మహిళల టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. బిబిసారా అసాబయేవా (కజకిస్తాన్)తో జరిగిన ఐదు గేమ్‌ల ఫైనల్లో హంపి 1.5–3.5తో ఓడిపోయింది. తొలి గేమ్‌లో హంపి 33 ఎత్తుల్లో ఓడిపోగా.. రెండో గేమ్‌లో హంపి 41 ఎత్తుల్లో గెలిచింది. మూడో గేమ్‌లో 61 ఎత్తుల్లో, నాలుగో గేమ్‌లో 27 ఎత్తుల్లో బిబిసారా విజయం సాధించింది. ఐదో గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఎనిమిది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య ఈ టోర్నీ జరిగింది. మహిళల టోర్నీ విన్నర్, రన్నరప్ హోదాలో బిబిసారా, హంపి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అర్మగెడాన్ గ్రాండ్ ఫైనల్ టోర్నీకి అర్హత సాధించారు. గ్రాండ్ ఫైనల్ టోర్నీకి ఇప్పటికే సో వెస్లీ, సామ్ షాంక్లాండ్ (అమెరికా), దొమ్మరాజు గుకేశ్ (భారత్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) కూడా అర్హత పొందారు. త్వరలో యూరోప్, ఆఫ్రికా రీజియన్ మధ్య జరిగే టోర్నీ ద్వారా మరో ఇద్దరికి గ్రాండ్ ఫైనల్ టోర్నీకి బెర్త్‌లు లభిస్తాయి. చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే! -
‘గ్రాండ్‌మాస్టర్’ ప్రణీత్.. ఇప్పటికైతే ఆర్థికంగా ఆదుకోవడానికి నాకు స్పాన్సర్ లేరు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ చెస్ టోర్నీలలో తన నిలకడమైన ప్రదర్శనను కొనసాగిస్తూ తెలంగాణ టీనేజ్ ప్లేయర్ వుప్పాల ప్రణీత్ భారత 82వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. అజర్బైజాన్లో జరిగిన బకూ ఓపెన్ టోర్నీలో 15 ఏళ్ల ప్రణీత్ గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రణీత్ ఆరు పాయింట్లు స్కోరు చేసి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. ఎనిమిదో రౌండ్లో టాప్ సీడ్, అమెరికా గ్రాండ్‌మాస్టర్ హాన్స్ మోక్ నీమన్‌పై ప్రణీత్ గెలుపొందడంతో అతని లైవ్ ఎలో రేటింగ్ 2500.5గా నమోదైంది. చివరి రౌండ్లో ఈ టోర్నీ విజేత, భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకా (గోవా) చేతిలో ఓడిపోయినా అతని ఎలో రేటింగ్‌పై ప్రభావం చూపకపోవడంతో ప్రణీత్‌కు జీఎం హోదా ఖాయమైంది. జీఎం హోదా ఖరారైంది ఇలా ►ఈ టోర్నీలో ప్రణీత్ నలుగురు గ్రాండ్‌మాస్టర్లు వహాప్ సనాల్ (తుర్కియే), వుగార్ అసాదిల్ (అజర్బైజాన్), లెవాన్ పాంత్సులయ (జార్జియా), నీమన్ (అమెరికా)లపై నెగ్గడంతోపాటు ఇస్కందరోవ్ (అజర్బైజాన్), నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ►చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతోపాటు ఎలో రేటింగ్ పాయింట్లు 2500 దాటాలి. ప్రణీత్ ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించినా అతని ఎలో రేటింగ్ 2500 దాటలేకపోవడంతో జీఎం హోదా కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే బకూ ఓపెన్‌లో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబరిచి తన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించడంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. ►ప్రణీత్ తొలి జీఎం నార్మ్‌ను 2022 మార్చిలో ఫస్ట్ సాటర్డే టోర్నీలో, రెండో జీఎం నార్మ్‌ను 2022 జూలైలో బీల్ ఓపెన్ టోర్నీలో, మూడో జీఎం నార్మ్‌ను 2023 ఏప్రిల్‌లో సన్వే ఫార్మెన్‌టెరా ఓపెన్ టోర్నీలో సాధించాడు. ►2021 వరకు ప్రముఖ కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ పొందిన ప్రణీత్ ప్రస్తుతం ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ విక్టర్ మిఖాలెవ్‌స్కీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. పదేళ్లుగా చెస్ ఆడుతున్న ప్రణీత్ శ్రమకు తగ్గ ఫలితం రావడంపట్ల అతని తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మి ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకైతే ప్రణీత్‌ను సొంత ఖర్చులతోనే టోర్నీలకు పంపించామని, ఇకనైనా అతనికి స్పాన్సర్లు వస్తే సంతోషిస్తామని తెలిపారు. ఇప్పటికైతే ఆర్థికంగా ఆదుకోవడానికి నాకు స్పాన్సర్ లేరు ఒక స్వప్నం సాకారమైంది. నా కెరీర్లో ఇది చిరస్మరణీయ క్షణం. 2500 రేటింగ్ దాటడం ఒక మైలురాయిలాంటిది. భవిష్యత్‌లో 2700 రేటింగ్‌ను అందుకోవడం, ప్రపంచ చాంపియన్ కావడం నా సుదీర్ఘ లక్ష్యాలు. కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నా నిర్ణీత సమయంలోపు గేమ్‌ను ముగించాలనే ఒత్తిడి నాపై ఉండేది. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నా. భారత్ నుంచి పలువురు యువ ఆటగాళ్లు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధిస్తుండటం ఈ ఆటకు ఎంతో మేలు చేస్తుంది. కజకిస్తాన్‌లో త్వరలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడమే నా తదుపరి లక్ష్యం. అత్యున్నతస్థాయిలో పోటీపడాలన్నా, మెరు గైన శిక్షణ తీసుకోవాలన్నా, విదేశాల్లో టోర్నీలు ఆడేందుకు వెళ్లాలన్నా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికైతే ఆర్థికంగా ఆదుకోవడానికి నాకు స్పాన్సర్ లేరు. గ్రాండ్‌మాస్టర్ హోదా టైటిల్‌తో నాకు స్పాన్సర్లు లభిస్తారని ఆశిస్తున్నా. –ప్రణీత్ తెలంగాణ నుంచి భారత చెస్‌లో తెలంగాణ నుంచి గతంలో ఇరిగేశి అర్జున్ (2018), హర్ష భరతకోటి (2019), రాజా రిత్విక్ (2021), రాహుల్ శ్రీవాత్సవ్ (2022)ఈ ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే పెంటేల హరికృష్ణ (2001), హంపి (2002), హారిక (2011), లలిత్ బాబు (2012), కార్తీక్ వెంకటరామన్ (2018) గ్రాండ్‌మాస్టర్ హోదా పొందారు. -
చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే?
ప్రతి ఆటకూ ఒకరు టార్చ్‌బేరర్ ఉంటారు... అతను నడిచిన బాట కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తుంది.. అతను వేసిన దారి కొత్తవారి విజయాన్ని సులువు చేస్తుంది..ఆ ఆటగాడు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ నమ్మకాన్ని కలిగిస్తుంది.. మేమూ సాధించగలమనే ధైర్యాన్ని ఇస్తుంది.. భారత్ చదరంగానికి సంబంధించి ఆ ఘనాపాటి విశ్వనాథన్ ఆనంద్.. మిగతా క్రీడల్లో మరో పేరు స్ఫురణకు రావచ్చేమో కానీ ఆనంద్ లేకుండా భారత చెస్ లేదు..ఇప్పుడు భారత్‌లో 79 మంది గ్రాండ్‌మాస్టర్లు.. మొదటివాడు మాత్రం మన ‘విషీ’.. ‘ఆనంద్‌లాంటి వ్యక్తులు చాలా అరుదు. రోజుకు 14 గంటలు కష్టపడితే చెస్‌లో నైపుణ్యం సంపాదించవచ్చు. కొన్ని విజయాలూ అందుకోవచ్చు. కానీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదగాలంటే అసాధారణ, సహజ ప్రజ్ఞ ఉండాలి. అది ఆనంద్‌లో ఉంది. అందుకే ఆయన ఆ స్థాయికి చేరారు. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు’.. ఆనంద్ తర్వాత భారత రెండో గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు బారువా చేసిన వ్యాఖ్య ఇది. దశాబ్దాలుగా చదరంగంలో సాగుతున్న రష్యా ఆధిపత్యాన్ని ఆనంద్ బద్దలు కొట్టగలిగాడు. గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పొవ్, వ్లదిమిర్ క్రామ్నిక్.. మొదలైన వారికి సవాల్ విసురుతూ ఆనంద్ శిఖరానికి చేరగలిగాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. చెస్ ఆటకు మన దేశం నుంచి అసలైన రాయబారిగా నిలిచాడు. ఆమె అండగా.. అమ్మ సుశీల ఆనంద్‌కు చెస్‌లో ఆది గురువు. 80ల్లో తల్లిదండ్రులకు ఏదైనా క్రీడలో ఆసక్తి ఉండి వారు అందులో ప్రోత్సహిస్తే అదే ఆటను ఎంచుకోవడం తప్ప సొంతంగా తమ ఇష్టాయిష్టాలను ప్రదర్శించే అవకాశం తక్కువ. అందులోనూ చెస్ అంటే ‘ఏం భవిష్యత్ ఉంటుంది?’ అన్నట్లుగానే ఉండేది. ఆనంద్ తల్లికి చదరంగం అంటే ఇష్టం ఉన్నా.. కొడుకును బలవంతపెట్టలేదు. కానీ ‘చైల్డ్ ప్రాడజీ’లాంటి తన కొడుకులో చురుకుదనాన్ని ఆమె గుర్తించింది. దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనే ఆనంద్‌ను చెస్‌లోకి తీసుకొచ్చింది. తానే గురువుగా మారి అన్నీ నేర్పించింది. తండ్రి కృష్ణమూర్తి కూడా ఎంతో ప్రోత్సహించాడు. ఉద్యోగరీత్యా తాను ఫిలిప్పీన్స్‌లో ఉండాల్సి వస్తే అక్కడకు వెళ్లాక సరైన రీతిలో శిక్షణ ఇప్పించాడు. ఆ కుర్రాడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఊహించినదానికంటే వేగంగా ఎదుగుతూ దూసుకుపోయాడు. మద్రాసులో ఆరేళ్ల వయసులో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న ఆనంద్ ఐదు పదులు దాటినా విశ్వవ్యాప్తంగా ఇప్పటికీ తనదైన ముద్రను చూపించగలుగుతున్నాడంటే అతని ఘనత ఎలాంటిదో అర్థమవుతోంది. వర్ధమాన ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో ‘లైట్నింగ్ కిడ్’ అంటూ చెస్ ప్రముఖులతో పిలిపించుకున్న విషీ.. ఆ తర్వాత చదరంగంలో తన విజయాలతో వెలుగులు విరజిమ్మాడు. వరుస విజయాలతో.. 14 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియ¯Œ గెలవడం మొదలు ఆనంద్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆశ్చర్యకర రీతిలో అసలు అపజయాలు లేకుండా అతను పైపైకి దూసుకుపోయాడు. తర్వాతి ఏడాదే ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్, 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు, 16 ఏళ్లకే జాతీయ సీనియర్ చాంపియన్, 18 ఏళ్ల వయసులో వరల్డ్ జూనియర్ చాంపియన్ .. ఈ జాబితా అలా సాగుతూ పోయింది. ఆనంద్ ఉన్నాడంటే చాలు ప్రత్యర్థులు రెండో స్థానానికి పోటీ పడేందుకు సిద్ధమైనట్లే అన్నట్లుగా పరిస్థితి ఉండేది! తన విజయాలు గాలివాటం కాదని, ఈ అసాధారణ ప్రతిభతో మున్ముందు తానేంటో చూపించగలననే నమ్మకం ఎట్టకేలకు 19వ ఏట వచ్చింది. 1988లో సొంత రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన శక్తి ఇంటర్నేషనల్ టోర్నీని గెలవడంతో ఒక కొత్త చరిత్ర నమోదైంది. భారతదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్‌గా విశ్వనాథన్ ఆనంద్ అవతరించాడు. అక్కడ మొదలైన ఆ అగ్రస్థాయి ప్రస్థానం ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిపింది. అందరికీ ఇష్టుడు.. ‘వై దిస్ నైస్ గై ఆల్వేస్ విన్ ’.. విశ్వనాథన్ ఆనంద్ గురించి చెస్ ప్రపంచంలో తరచుగా వినిపించే, అతనికి మాత్రమే వర్తించే వ్యాఖ్య! సాధారణంగానే చెస్ ఆటగాళ్లు బోర్డుపై మినహా బయట ఎక్కువగా దూకుడు ప్రదర్శించరు. కానీ ఆనంద్ వారందరికంటే మరో మెట్టు పైనుంటాడు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో హోరాహోరీ మ్యాచ్‌లలో ఆడినా ఏరోజూ అతను సంయమనం కోల్పోలేదు. విమర్శలు, ప్రతివిమర్శలు చేయలేదు. ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేయలేదు. అతని ఆటలాగే మాట, వ్యవహారశైలి కూడా ప్రశాంతంగా ఉంటుంది. తాను జూనియర్‌గా ఉన్న సమయంలో ఏర్పాట్లు బాగా లేవంటూ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా టోర్నీని బహిష్కరిస్తే తాను మాత్రం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమని ఆనంద్ స్పష్టంగా చెప్పేశాడు. అదే నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా విమానాలు అనూహ్యంగా రద్దయితే రెండు రోజుల పాటు 2 వేల కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణించి మరీ ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడికి చేరుకున్న వెంటనే మ్యాచ్ ఆడాడు. నిర్వాహకులు కూడా అమితాశ్చర్యంతో ‘మ్యాచ్‌ను వాయిదా వేసేవాళ్లం కదా’ అన్నా వారికీ చిరునవ్వే సమాధానమైంది. రష్యా రాజకీయాల్లో కాలు పెట్టి తీవ్ర వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్న కాస్పరోవ్లా ఆనంద్ ఎప్పుడూ తన పరిధి దాటలేదు. ఇలాంటి వ్యక్తిత్వమే ఆనంద్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టింది. సాధించిన ఘనతలెన్నో.. 2000, 2007, 2008, 2010, 2012లలో విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. 2007లో తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా మారిన అతను సుదీర్ఘకాలం ప్రపంచ చెస్‌ను శాసించాడు. తన సమకాలికులు ఎందరికో సాధ్యం కాని రీతిలో 48 ఏళ్ల వయసులో అత్యంత వేగంగా సాగే ‘ర్యాపిడ్’ ఈవెంట్లో సత్తా చాటాడు. తన తరంలో అత్యుత్తమ ర్యాపిడ్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 2003, 2017లలో ఈ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. ర్యాపిడ్ కంటే కూడా వేగంగా క్షణాల వ్యవధిలో సాగే బ్లిట్జ్‌లో తన ముద్ర వేయడం ఆనంద్‌కే చెల్లింది. 2000లో వరల్డ్ బ్లిట్జ్ కప్ విజేతగా నిలవడం అతని సామర్థ్యాన్ని చూపించింది. టోర్నమెంట్ ఫార్మాట్, మ్యాచ్ ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్, ర్యాపిడ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు కావడం.. ఆనంద్ గొప్పతనాన్ని చెబుతుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లు మాత్రమే కాదు కోరస్ ఇంటర్నేషనల్, టాటా స్టీల్, తాల్ మెమోరియల్, లినారెస్ చెస్‌లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి తొలి ‘ఖేల్‌రత్న’ పురస్కారంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు అతనికి కంఠాభరణంగా మారాయి. ‘మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్’ అంటూ తన అనుభవాలతో భారత్ చెస్‌కు కొత్త పాఠాలు నేర్పించిన ఆనంద్ కెరీర్ ఆద్యంతం స్ఫూర్తిదాయకం. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్న అర్జున్ ఇరిగేశి.. ఐదేళ్లకు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి తన ప్రొఫెషనల్ కెరీర్లో తొలిసారి స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రంగంలో పని చేస్తున్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘క్వాంట్‌బాక్స్’తో అర్జున్ చేతులు కలిపాడు. ఐదేళ్ల కాలానికిగాను ఈ స్పాన్సర్షిప్ విలువ 15 లక్షల డాలర్లు (సుమారు రూ.12 కోట్ల 41 లక్షలు) కావడం విశేషం. అంటే ఏడాదికి సుమారు రూ. 2 కోట్ల 50 లక్షలుగా ఈ డీల్ ఉంటుంది. భారత చెస్ చరిత్రలో దీనిని అత్యుత్తమ ఒప్పందంగా భావిస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ‘క్వాంట్‌బాక్స్’ వ్యవస్థాపకుడు, మాజీ చెస్ ఆటగాడైన ప్రశాంత్ సింగ్ ఈ ఒప్పందం వివరాలను వెల్లడించారు. 2022లో అర్జున్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది టాటా స్టీల్ చాలెంజర్స్, జాతీయ చాంపియన్‌షిప్, ఢిల్లీ ఓపెన్, అబుదాబి మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన అర్జున్ ప్రస్తుతం 2722 ఎలో రేటింగ్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానంలో ఉన్నాడు. -
భారత చెస్ 77వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య
ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆదిత్య మిట్టల్ భారత చెస్‌లో 77వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రెగట్ టోర్నీలో ఆరో రౌండ్లో ఫ్రాన్సిస్కో (స్పెయిన్)పై ఆదిత్య గెలిచి జీఎం నార్మ్ ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు. జీఎం కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎం నార్మ్‌లతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి. ఆదిత్య 2021లో తొలి జీఎం నార్మ్, 2022లో మిగతా రెండు జీఎం నార్మ్‌లు సంపాదించాడు. చదవండి: టీ 20 అండర్ 19 వరల్డ్ కప్‌లో మన చిచ్చర పిడుగులు IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? -
‘బ్లిట్జ్’ చాంపియన్ అర్జున్
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ టోర్నీ బ్లిట్జ్ ఈవెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. పది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల అర్జున్ 12.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన అర్జున్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. 10 గేముల్లో గెలిచిన అర్జున్ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని మరో మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) రెండో స్థానంలో, 9.5 పాయింట్లతో షఖిర్యార్ (అజర్బైజాన్) మూడో స్థానంలో నిలిచారు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ ఈవెం ట్లో అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 18 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లు సాధించింది. ఎనిమిది గేముల్లో గెలిచిన హారిక, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. ర్యాపిడ్ ఈవెంట్లోనూ హారికకు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన వైశాలి 13.5 పాయింట్లతో బ్లిట్జ్ ఈవెంట్లో టైటిల్ దక్కించుకోగా, మరియా (ఉక్రెయిన్) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలి చింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. విజేత వైశాలికి 7,500 డాలర్లు (రూ. 6 లక్షల 10 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
గుకేశ్ ఖాతాలో ‘హ్యాట్రిక్’ టైటిల్
భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుసగా మూడో అంతర్జాతీయ చెస్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. చెన్నైకు చెందిన 15 ఏళ్ల గుకేశ్ ఇటీవల లా రోడా ఓపెన్, మెనోర్కా ఓపెన్లలో విజేతగా నిలిచాడు. తాజాగా స్పెయిన్‌లోనే జరిగిన చెసెబల్ సన్వే ఫార్మెన్‌టెరా ఓపెన్‌లోనూ గుకేశ్ చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్ ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. -
Mitrabha Guha: 72వ గ్రాండ్ మాస్టర్‌గా మిత్రభా గుహా
Kolkata Mitrabha Guha Becomes India 72nd Grandmaster: కోల్‌కతాకు చెందిన 20 ఏళ్ల మిత్రభా గుహా భారత్ నుంచి 72వ గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. సెర్బియాలో జరుగుతున్న మిక్స్ 220 టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకున్నాడు. గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన షేక్ రసెల్ జీఎం టోర్నీలో మిత్రభా రెండో జీఎం నార్మ్‌ను సాధించాడు. అంతేకాకుండా జీఎం హోదా దక్కడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌నూ దాటాడు. చదవండి: Syed Musthaq Ali T20: సయ్యద్ ముస్తాక్ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు -
Dronavalli Harika: కల నెరవేరింది.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు
భారత చెస్ స్టార్ ద్రోణవల్లి హారిక ఖాతాలో ఇప్పటి వరకు మూడు వరల్డ్ చాంపియన్ షిప్ వ్యక్తిగత కాంస్యాలు ఉన్నాయి. అయితే 2004నుంచి జట్టు సభ్యురాలిగా ఉన్నా టీమ్ ఈవెంట్లో ఒక్కసారి కూడా పతకం అందుకునేందుకు పోడియం ఎక్కలేదనే నిరాశ ఆమెను వెంటాడింది. ఇప్పుడు హారికకు ఆ లోటు తీరిపోయింది. స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌తో రజతం ఆమె ఖాతాలో చేరింది. పైగా వ్యక్తిగత ప్రదర్శనకుగాను మరో వెండి పతకం కూడా హారిక చెంత చేరడంతో ఆనందం రెట్టింపైంది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని ఘనతలు సాధించేందుకు ఆమె సిద్ధమవుతోంది. సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పతకంకంటే తన దృష్టిలో సమష్టి విజయంతో దక్కే టీమ్ మెడల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అభిప్రాయ పడింది. చెస్లోనూ ఒలింపియాడ్ ఉన్నా... వరల్డ్ చాంపియప్లో సాధించిన పతకం తన దృష్టిలో ఒలింపిక్ క్రీడల్లో విజయంలాంటిదేనని ఆమె పేర్కొంది. స్పెయిన్‌నుంచి తిరిగొచ్చాక ‘సాక్షి’తో ముచ్చటించిన హారిక చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... చాంపియన్‌షిప్‌కు ముందు అంచనాలు... పెద్దగా ఆశలతో మేం టోర్నీకి వెళ్లలేదు. పైగా కోనేరు హంపి కూడా దూరం కావడంతో టీమ్ కాస్త బలహీనంగానే మారింది. అయితే మా శాయశక్తులా ప్రయత్నించాలని, చివరి వరకు పట్టుదలగా పోరాడాలని మాత్రం అనుకున్నాం. నేను ఈ టోర్నీ కోసం సుమారు నెలన్నర పాటు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. స్విస్ సిస్టంతో పోలిస్తే ఈ సారి ఫార్మాట్ నాకౌట్‌కు మారడం మాకు కొంత సానుకూలంగా పని చేసిందని భావిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి గేమ్‌లలో పెద్ద జట్లు, అగ్రశ్రేణి ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి ఉంటుంది. మేం స్వేచ్ఛగా ఆడేందుకు అది మేలు చేసింది. క్వార్టర్ ఫైనల్లో కజకిస్తాన్‌పై గెలవడం అన్నింటికంటే కీలకంగా నేను భావిస్తున్నాను. టీమ్ ఈవెంట్ పతకానికి ఉన్న ప్రత్యేకత... నా 13 ఏళ్ల వయసులో తొలిసారి భారత జట్టులో భాగమయ్యాను. 17 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వేర్వేరు వరల్డ్ చాంపియన్షిప్లే కాకుండా చెస్కే ప్రత్యేకమైన ఒలింపియాడ్‌లలోనూ పాల్గొన్నాను. కానీ ఒక్కసారి కూడా పతకం లభించలేదు. వ్యక్తిగత విజయాలు ఎన్ని సాధించినా భారత జట్టుతో కలిసి వేదికపై నిలబడాలని ఎన్నో సార్లు కోరుకున్నాను. ఇప్పుడు నా కల తీరింది. ఒలింపిక్స్‌లో చెస్ క్రీడాంశం లేదు కానీ ఇప్పుడు జట్టుగా కలిగిన ఆనందం అక్కడ దక్కే పతకంకంటే తక్కువేమీ కాదు. గతంలో టీమ్ ఈవెంట్లలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానం మాత్రమే. ఇప్పుడు మేం దానిని మార్చాం. దీనిని అధిగమించాలంటూ ముందు తరాల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించాం. టోర్నీ ‘టేబుల్ 1’లలో నా ఆటకు మరో రజతం కూడా దక్కడం సంతోషం. ఏడాదిగా ఆన్లైన్ టోర్నీలు ఆడటంపై... బయటినుంచి చూస్తే చెస్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ తేడా ఏముుంటుంది అనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో తలపడటం ఏమాత్రం ఆసక్తి కలిగించదు. చెస్ ఆట మాత్రమే కాదు...మైండ్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి. దగ్గరినుంచి ప్రత్యర్థి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ స్పందనను బట్టి సైకలాజికల్‌గా వేసే ఎత్తులు కూడా ఎంతో ముఖ్యం. అది ఆన్లైన్లో సాధ్యపడదు. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆడటం ఒక కొత్త అవకాశాన్ని సృష్టించినా...అసలు ఆటతో దానికి పోలిక లేదు. కోవిడ్ తర్వాత సోచిలో ఆఫ్‌లైన్‌లో ఆడిన నాకు ఇది రెండో టోర్నీ. అయితే ర్యాపిడ్, బ్లిట్జ్ తరహాలో ఇకపై ఆన్లైన్ కూడా ఒక ఫార్మాట్‌గా మారుతుందేమో! ఇప్పటికీ భారత మహిళల చెస్నుంచి ఇద్దరే గ్రాండ్‌మాస్టర్లు ఉండటంపై... చాలా దురదృష్టకరం. నిజాయితీగా చెప్పాలంటే కారణం ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. 70 మంది గ్రాండ్మాస్టర్లలో ఇన్నేళ్ల తర్వాత కూడా నేను, హంపి మాత్రమే మహిళలం. మనతో పోలిస్తే ఇతర దేశాల్లో మహిళల చెస్‌కు ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. అయితే ఓవరాల్‌గా చూస్తే మన చెస్‌లో మంచి పురోగతి కనిపిస్తుండటం శుభ పరిణామం. 2022 ఆసియా క్రీడల్లో మళ్లీ చెస్ రానుండటం సంతోషించాల్సిన విషయం. చెస్ ఖరీదైన క్రీడగా మారిపోవడంపై... ఇప్పుడే కాదు. చాలా కాలంగా చెస్‌లో ఒక స్థాయికి చేరాలంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందనేది వాస్తవం. ఇందులో సింహ భాగం కోచింగ్‌కే వెళుతుంది. పెద్ద స్థాయికి చేరే కొద్దీ మంచి శిక్షణ అవసరం అయితే దాని కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సిందే. ఈ ఇబ్బందులతో చాలా మంది ఆటగాళ్లు ఇంటర్నెట్, పుస్తకాలపై ఆధారపడి కూడా తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం కూడా నేను చూస్తున్నాను. వ్యక్తిగత జీవితంపై... మూడేళ్లుగా నా భర్త కార్తీక్ నాకు అన్ని విధాలా అండగా నిలిచారు. 2019 చివరి వరకు కూడా ఇద్దరం కలిసే ప్రయాణాలు చేశాం. దాదాపు అన్ని టోర్నీలకు కలిసి వెళ్లడంతో నా ఆట ఏమిటో, ఇతర సమస్యలేమిటో ఆయనకూ తెలిశాయి. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ -
సరదాగా చదరంగంలోకి వచ్చా..!
సాక్షి, తుని: సరదాగా నేర్చుకున్న చదరంగం క్రీడ సమాజంలో గుర్తింపు ఇస్తుందని ఊహించలేదు.. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరకు మహిళా గ్రాండ్ మాస్టర్ కావడం వెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉందని బొడ్డా ప్రత్యూష అన్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరానికి చేరడం వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిదని ఆమె వివరించారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది. ప్రత్యూష తండ్రి ప్రసాద్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. విధులు ముగించుకుని ఇంటికొచ్చాక తన తండ్రి చదరంగం ఆడుతుండడం ప్రత్యూష ఆసక్తిగా గమనించేవారు. ఇలా ఏడేళ్ల వయసులో ఆమె సరదాగా చదరంగం అలవాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ క్రీడలో రాణిస్తూ వచ్చారు. ఇలా 16 ఏళ్ల పాటు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని మేటి చెస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఇంగ్లాండ్‌లో జరిగిన చెస్ టోర్నీలో విజయం సాధించి మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. మహిళా గ్రాండ్ మాస్టర్ ప్రత్యూష ప్రపంచ చాంపియన్ లక్ష్యం ప్రస్తుతం విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రత్యూష కుటుంబం ఉంటుంది. చిన్నతనంలో ప్రత్యూష తండ్రి ప్రసాద్, తాతయ్య వెంకటరమణలు ఈ క్రీడలో ప్రోత్సహించారు. అప్పట్లో శ్రీప్రకాష్ విద్యా సంస్థలో చదువుతూనే చెస్ టోర్నీల్లో పాల్గొని రాణించారు. ఇప్పటి వరకు 45 దేశాల్లో జరిగిన పోటీల్లో 25 అంతర్జాతీయ, 8 జాతీయ స్థాయి పతకాలను సాధించారు. 2016లో రెండు నార్మ్‌లు సాధించినా మూడో నార్మ్‌కు మూడేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం 2,230 రేటింగ్‌లో ఉన్న ప్రత్యూష 2,500 రేటింగ్‌కు చేరుకుంటే మూడు గ్రాండ్ మాస్టర్స్ నార్మ్‌లు సాధించి గ్రాండ్ మాస్టర్ కావాలని ఆశిస్తున్నారు. అదే సాధిస్తే ఆమె పురుషులతో కూడా ఆడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఉన్నారు. మూడో మహిళా గ్రాండ్ మాస్టర్‌గా ప్రత్యూష ఘనత సాధించారు. ప్రపంచ చాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభినందన మహిళా గ్రాండ్ మాస్టర్ సాధించిన ప్రత్యూష భవిష్యత్‌లో గ్రాండ్ మాస్టర్ కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. ఇటీవల అమరావతిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సారథ్యంలో ముఖ్యమంత్రిని ప్రత్యూష కలిశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహమిస్తామని హామీ ఇచ్చారు. -
విజేత హర్ష భరతకోటి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి పోలాండ్‌లో జరిగిన ఇరీనా వారకోమ్స్కా స్మారక ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 19 ఏళ్ల హర్ష ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఐదు గేముల్లో గెలిచిన అతడు, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచాడు. పావెల్ మాజ్, క్లాడియా కులోన్, లుకాస్ లిక్నెర్స్కీ, పిటోర్ గోలుచ్, తొమాజ్ మర్కోవ్‌స్కీ (పోలాండ్)లపై గెలుపొందిన హర్ష... నాదియా షపాంకో (ఉక్రెయిన్), వియాచెస్లావ్ (రష్యా), జాసెక్ టామ్జాక్ (పోలాండ్), వ్లాదిమిర్ జకోరోత్సోవా (రష్యా)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. -
హరికృష్ణ వివాహం
-
హంపి పెళ్లికూతురాయెనే...
వైభవంగా చెస్ స్టార్ వివాహంసాక్షి, విజయవాడ: చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పెళ్లికూతురుగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. విజయవాడకే చెందిన పారిశ్రామికవేత్త దాసరి అన్వేష్‌తో బుధవారం రాత్రి ఎ-కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా హంపి వివాహం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చెస్ క్రీడాకారులు, కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వివాహానికి హాజరయ్యారు.