సాక్షి, హైదరాబాద్: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి తన ప్రొఫెషనల్ కెరీర్‌లో తొలిసారి స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రంగంలో పని చేస్తున్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘క్వాంట్‌బాక్స్’తో అర్జున్ చేతులు కలిపాడు. ఐదేళ్ల కాలానికిగాను ఈ స్పాన్సర్‌షిప్ విలువ 15 లక్షల డాలర్లు (సుమారు రూ.12 కోట్ల 41 లక్షలు) కావడం విశేషం.
అంటే ఏడాదికి సుమారు రూ. 2 కోట్ల 50 లక్షలుగా ఈ డీల్ ఉంటుంది. భారత చెస్ చరిత్రలో దీనిని అత్యుత్తమ ఒప్పందంగా భావిస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ‘క్వాంట్‌బాక్స్’ వ్యవస్థాపకుడు, మాజీ చెస్ ఆటగాడైన ప్రశాంత్ సింగ్ ఈ ఒప్పందం వివరాలను వెల్లడించారు. 2022లో అర్జున్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది టాటా స్టీల్ చాలెంజర్స్, జాతీయ చాంపియన్‌షిప్, ఢిల్లీ ఓపెన్, అబుదాబి మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన అర్జున్ ప్రస్తుతం 2722 ఎలో రేటింగ్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment