సాక్షి, తాడేపల్లి: భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.
తెలుగు తేజం కోనేరు హంపి విజయంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ అభినందనలు తెలిపారు.
The pride of India, @humpy_koneru, has won the 2024 FIDE Women's World Rapid Championship for the second time! She is an inspiration to many, particularly those balancing professional and personal life. Wishing her many more victories! pic.twitter.com/v0sv5eE5qM
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 29, 2024
Comments
Please login to add a commentAdd a comment