భారత చెస్‌ 77వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య  | Chess: Mumbai Aditya Mittal Became India 77th Grandmaster | Sakshi
Sakshi News home page

భారత చెస్‌ 77వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య 

Published Wed, Dec 7 2022 8:44 AM | Last Updated on Wed, Dec 7 2022 9:57 AM

Chess: Mumbai Aditya Mittal Became India 77th Grandmaster - Sakshi

ఆదిత్య మిట్టల్‌

ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆదిత్య మిట్టల్‌ భారత చెస్‌లో 77వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రెగట్‌ టోర్నీలో ఆరో రౌండ్‌లో ఫ్రాన్సిస్కో (స్పెయిన్‌)పై ఆదిత్య గెలిచి జీఎం నార్మ్‌ ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు.

జీఎం కావాలంటే ఓ చెస్‌ ప్లేయర్‌ మూడు జీఎం నార్మ్‌లతోపాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లను సాధించాలి. ఆదిత్య 2021లో తొలి జీఎం నార్మ్, 2022లో మిగతా రెండు జీఎం నార్మ్‌లు సంపాదించాడు.    

చదవండి: టీ 20 అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో మన చిచ్చర పిడుగులు
IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement