సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి పోలాండ్‌లో జరిగిన ఇరీనా వారకోమ్‌స్కా స్మారక ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 19 ఏళ్ల హర్ష ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఐదు గేముల్లో గెలిచిన అతడు, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచాడు. పావెల్ మాజ్, క్లాడియా కులోన్, లుకాస్ లిక్‌నెర్‌స్కీ, పిటోర్ గోలుచ్, తొమాజ్ మర్కోవ్‌స్కీ (పోలాండ్)లపై గెలుపొందిన హర్ష... నాదియా షపాంకో (ఉక్రెయిన్), వియాచెస్లావ్ (రష్యా), జాసెక్ టామ్‌జాక్ (పోలాండ్), వ్లాదిమిర్ జకోరోత్సోవా (రష్యా)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment