'మిస్టరీ గర్ల్‌'తో యజ్వేంద్ర చహల్‌.. ధనశ్రీ చూస్తే అంతే! | Mystery Girl Photo Session-With Indian Spinner Yuzvendra Chahal Viral | Sakshi
Sakshi News home page

#Chahal: 'మిస్టరీ గర్ల్‌'తో యజ్వేంద్ర చహల్‌.. ధనశ్రీ చూస్తే అంతే!

Jul 4 2023 4:44 PM | Updated on Jul 4 2023 5:09 PM

Mystery Girl Photo Session-With Indian Spinner Yuzvendra Chahal Viral - Sakshi

టీమిండియా స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌కు చెస్‌ గేమ్‌ అంటే చాలా ఇష్టం. చెస్‌కు చహల్‌ వీరాభిమాని. గతంలో భారత్‌లో జరిగిన వరల్డ్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌కు ప్రతినిధిగా వ్యవహరించాడు. ఆల్పైన్‌ వారియర్స్‌ ఫ్రాంచైజీకి చహల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు ఇటీవలే దుబాయ్‌ వేదికగా గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియాకు మ్యాచ్‌లు లేకపోవడంతో అంబాసిడర్‌ హోదాలో దుబాయ్‌కు వెళ్లాడు.

తాజాగా చహల్‌ ఒక యువతితో దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''నేనిప్పుడు దుబాయ్‌లో ఉన్నా. మిస్టరీ గర్ల్‌ విత్‌ గ్లోబల్‌ చెస్‌ లీగ్‌''అని క్యాప్షన్‌ జత చేశాడు. అయితే చహల్‌ పేర్కొన్న మిస్టరీ గర్ల్‌ పేరు భలే గమ్మత్తుగా ఉంది. ఆమె పేరు జెస్సీ ఫిబ్రవరి. సౌతాఫ్రికాకు చెందిన జెస్సీ ఫిబ్రవరి.. రెండుసార్లు సౌతాఫ్రికా వుమెన్స్‌ చెస్‌ చాంపియన్‌.. మరోసారి ఆఫ్రికన్‌ వుమెన్స్‌ చెస్‌ చాంపియన్‌గా నిలవడం విశేషం.

ఈ సందర్భంగా జెస్సీ తన ట్విటర్‌లో చహల్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ''మొత్తానికి చహల్‌ను కలుసుకున్నా.. సంతోషంగా ఉంది'' అంటూ పేర్కొంది.  కాగా చహల్‌ ఫోటోపై అభిమానులు స్పందించారు. ''ఎవరు పిల్లా నువ్వు.. పేరే గమ్మత్తుగా ఉంది.. చహల్‌తో ఫోటో దిగావు సరే.. ధనశ్రీ చూస్తే ఊరుకుంటుందా.. అంతే సంగతి'' అంటూ కామెంట్‌ చేశారు.

ఇక సౌతాఫ్రికాలోని పోర్ట్‌ ఎలిజబెత్‌కు చెందిన జెస్సీ ఫిబ్రవరి 2016లో మహిళల విభాగంలో చెస్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ టైటిల్‌ గెలుచుకుంది. 2021 మేలో జెస్సీ ఫిబ్రవరి వుమెన్స్‌ ఆఫ్రికన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొని 8 స్కోరుకు గాను ఏడు పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లతో 2100 రేటింగ్‌ సాధించిన జెస్సీ ఫిబ్రవరి గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించింది. ఇక 2021 జూలైలో జరిగిన మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌కు క్వాలిఫై సాధించినప్పటికి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.

చదవండి: #PoojaTomar: ఆ గేమ్‌ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే!

#Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు'

'చహల్‌ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement