యూవీ పోస్ట్‌: అందరి కళ్లు భువీ పైనే! | Bhuvneshwar Kumar Steals Instagram Post In Yuvraj Singh Gender Swap Photo | Sakshi
Sakshi News home page

‘భువీ చాలా అందంగా ఉన్నాడు.. హీ ఈజ్‌ హాటెస్ట్‌’

Published Tue, Jun 23 2020 1:11 PM | Last Updated on Tue, Jun 23 2020 1:51 PM

Bhuvneshwar Kumar Steals Instagram Post In Yuvraj Singh Gender Swap Photo - Sakshi

న్యూఢిల్లీ: జెండర్‌-స్వాప్ ఫేస్‌‌ యాప్‌ ద్వారా టీమిండియా ఆటగాళ్లను అమ్మాయిలుగా మార్చిన ఫొటోలను మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘మీ స్నేహితురాలిగా వీరిలో ఎవరిని ఎంచుకుంటారు?’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తుంది.  ప్రత్యేకించి పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు మంచి స్పందన లభిస్తోంది. అమ్మాయిగా భువీ చాలా అందరంగా ఉన్నాడంటు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నా స్నేహితురాలిగా భువీని ఎంచుకుంటాను’ ​అంటూ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కామెంట్‌ చేయగా.. మాజీ పేసర్‌‌ ఆశిష్‌ నెహ్రా భార్య రష్మా తాను కూడా అంటూ భజ్జీతో ఏకిభవించారు. (రోహిత్‌.. నువ్వు చాలా క్యూట్‌: చహల్‌)

అంతేగాక బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ చౌదరి ‘భువీ హాటెస్ట్‌’ అంటూ కామెంటు చేయగా, కరణ్‌ వాహి  ‘నా ఓటు భువనేశ్వర్‌ కే’ అంటూ కామెంట్‌ చేశాడు. ‘నేను భువీని ఎంచుకుంటాను’ అంటూ భువనేశ్వర్‌ కూడా తనకు తానే ఎంచుకున్నాడు. టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ స్పందిస్తూ ‘‘ఈ జాబితాలో మీది కూడా ఉండాలని కోరుకుంటున్నాను యూవీ పా’’ అంటూ ఫన్నీగా కామెంట్‌ పెట్టాడు. కాగా పొడవాటి లీవ్‌ హేర్‌స్టైల్, స్టైలిష్‌ లుక్‌లో ఆటగాళ్లంతా అమ్మాయిలుగా చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇంతకు ముందు చహాల్ కూడా‌ ఈ యాప్‌ ద్వారా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మను అమ్మాయిగా మార్చి ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు రోహితా శర్మా భయ్యా’’ అంటూ షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయిన విషయం తెలిసిందే. (‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement