దుబాయ్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్- ధనశ్రీ దంపతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని- సాక్షి నుంచి వీరికి ఆత్మీయ స్వాగతం లభించింది. కొత్తజంటను డిన్నర్‌కు ఆహ్వానించిన ధోని కుటుంబం వారికి గుర్తుండిపోయేలా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చహల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా సంతోషంగా ఉందంటూ అతిథులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ధనశ్రీ సైతం.. ‘‘థాంక్యూ. ఇంతకంటే ఏం చెప్పగలను. ఇంట్లో ఉన్నట్టే అనిపించింది’’ అని కృతజ్ఞతా భావం చాటుకున్నారు. (చదవండి: బుమ్రా కంటే వేగంగా సాధించాడు..)
కాగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత చహల్ తన ప్రేయసి ధనశ్రీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం గత మంగళవారం ఈ వేడుక జరిగింది. ఇక ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 లో రవీంద్ర జడేజా గాయపడడంతో కాంకషన్‌గా వచ్చి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే చహల్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం పట్ల ఆసీస్ జట్టు అభ్యంతరం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది. కాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన చహల్ ఇప్పటి వరకు టీమిండియా తరపున 54 వన్డేలు, 45 టీ20లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment