
అంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (88) మంగళవారం కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్ మరణించిన విషయాన్ని ‘ఫిడే’ ప్రకటించింది. ప్రపంచ చెస్‌ను సోవియట్ యూనియన్ శాసిస్తున్న కాలంలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన వారిలో స్పాస్కీ కూడా ఒకడు.
1969–1972 మధ్య అతను పదో వరల్డ్ చాంపియన్‌గా శిఖరాన నిలిచాడు. అయితే డిఫెండింగ్ చాంపియన్‌గా స్పాస్కీ బరిలోకి దిగిన 1972 వరల్డ్ చాంపియన్ పోరాటానికి ప్రపంచ చెస్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సోవియట్ యూనియన్, అమెరికా మధ్య తీవ్ర వైరంతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న ఆ కాలంలో స్పాస్కీతో అమెరికాకు చెందిన బాబీ ఫిషర్ చాలెంజర్‌గా తలపడ్డాడు.
దాంతో ఈ సమరం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సమయంలో దీనికి ‘మ్యాచ్ ఆఫ్ ద సెంచరీ’గా గుర్తింపు వచి్చంది. సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికాగా మారిపోయిన ఈ 21 గేమ్‌ల పోరులో చివరకు 8.5–12.5 పాయింట్ల తేడాతో ఫిషర్ చేతిలో ఓడి స్పాస్కీ వరల్డ్ టైటిల్‌ను కోల్పోయాడు.
నాలుగేళ్ల తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లి స్థిరపడిన స్పాస్కీ ఆ తర్వాత 21 ఏళ్ల పాటు ఆ దేశం తరఫున పోటీల్లో పాల్గొన్నా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 2013లో అతను తిరిగి స్వదేశానికి వచ్చేసి చివరి వరకు మాస్కోలోనే ఉండిపోయాడు. స్పాస్కీతో సమరంతో 1972లో జగజ్జేతగా నిలిచిన బాబీ ఫిషర్ 2008లోనే మరణించాడు.
చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment