భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుసగా మూడో అంతర్జాతీయ చెస్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. చెన్నైకు చెందిన 15 ఏళ్ల గుకేశ్ ఇటీవల లా రోడా ఓపెన్, మెనోర్కా ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు. తాజాగా స్పెయిన్‌లోనే జరిగిన చెసెబల్ సన్‌వే ఫార్మెన్‌టెరా ఓపెన్‌లోనూ గుకేశ్ చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గుకేశ్ ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment