ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'గ్రే: ద స్పై హూ లవ్డ్ మి'. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీని అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మించగా.. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26న విడుదల కానుంది.
(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత)
దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ.. 'ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్. అందులో నుంచి పుట్టిన ఐడియానే ఈ గ్రే మూవీ. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అదే ఈ స్పై డ్రామా' అని అన్నారు.
(ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!)
మా ‘గ్రే’ చిత్రం 2022లో పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు ఎంపికైంది. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫిలిం ఫెస్టివల్ 2022 లో విన్నర్‌గా నిలిచింది. 2022 ఆసియన్ ఫిలిం ఫెస్టివల్, బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు గ్రే చిత్రాన్ని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment