ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ.. ‘ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు.
ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్ అవన్ని. అందులో నుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ..మనం సాధారణంగా మంచిని తెలుపుగాను, చెడును నలుపుగాను చూస్తుంటాం. కాని ఆ రెండు కలర్స్ మధ్యలో కొన్ని వందల షేడ్స్ ఉంటాయి. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అదే గ్రే..ఒక స్పై డ్రామా. అరవింద్ కృష్ణతో రెండు సినిమాలు చేశాను. మళ్లీ అతనితో కలిసి చేయడం హ్యాపీ. ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేశారు. అలీ రెజాని బిగ్‌బాస్ తర్వాత కలిశాను.
చాలా మంచి నటుడు. వీరిద్దరితో పాటు ప్రతాప్ పోతన్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఒక రకంగా సూత్రధారి క్యారెక్టర్. ఊర్వశీ రాయ్ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆమెది లీడింగ్ లేడీ క్యారెక్టర్. సినిమా ఫస్ట్ కాపీ చూశాం. చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరికీ నచ్చింది. ఆడియన్స్ కి కూడా తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. దానికోసం అన్ని అంశాలను రీసెర్చ్ చేయడం జరిగింది’ అన్నారు. ఈ సినిమాలో ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్, రాజ్ మదిరాజు, షాని సాల్మోన్, నజియా, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment