Spy Thriller
-
బ్లాక్ అండ్ వైట్ స్పై థ్రిల్లర్.. ఆసక్తి పెంచుతోన్న 'గ్రే'
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'గ్రే: ద స్పై హూ లవ్డ్ మి'. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీని అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మించగా.. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26న విడుదల కానుంది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ.. 'ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్. అందులో నుంచి పుట్టిన ఐడియానే ఈ గ్రే మూవీ. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే ఈ స్పై డ్రామా' అని అన్నారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) మా ‘గ్రే’ చిత్రం 2022లో పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు ఎంపికైంది. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫిలిం ఫెస్టివల్ 2022 లో విన్నర్‌గా నిలిచింది. 2022 ఆసియన్ ఫిలిం ఫెస్టివల్, బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు గ్రే చిత్రాన్ని కొనియాడారు. -
దర్శకుడిగా మారిన ఎడిటర్.. తుపాకీతో నిఖిల్ యాక్షన్
ప్రత్యర్థులపై పోరాటం చేసేందుకు ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా చేసిన గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి నిఖిల్ హీరోగా ఓ స్పై థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిఖిల్ గూడఛారి పాత్ర చేస్తున్నారు. కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. మలి షెడ్యూల్ వచ్చే నెలలో మనాలీలో జరగనుంది. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ కోసమే నిఖిల్ తుపాకీతో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. Live Weapons Training... For one Adrenaline Pumping Project with @Garrybh88 @Ishmenon @tej_uppalapati @EdEntertainments pic.twitter.com/SQNpqR0rpj — Nikhil Siddhartha (@actor_Nikhil) February 20, 2022 -
మణిరత్నం సినిమా ఖరార్
దక్షిణాదిలోనే ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సంచలన చిత్రం రూపొందనుంది. ఇందులో నాగార్జున, మహేశ్‌బాబు నటించనున్నారు. ఈ విషయం ఎట్టకేలకు సాధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రంలో నాగ్ సరసన ఐశ్వర్యారాయ్, మహేశ్‌కి జోడీగా శ్రుతీహాసన్ చేయనున్నారు. ఈ కాంబినేషన్లో మణిరత్నం ద్విభాషా చిత్రం చేస్తున్నట్లు సుహాసిని ఓ తమిళ చానల్‌కు బుధవారం తెలిపారు. తెలుగులో ఓ అగ్రనిర్మాణ సంస్థతో కలిసి మణిరత్నం ఈ ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. నిజానికి, ఈ ప్రాజెక్టుపై మణిరత్నం చాలాకాలంగా కసరత్తులు చేస్తున్నారు. నాగార్జునతో ‘గీతాంజలి’ తర్వాత ఆయన డెరైక్ట్‌గా తెలుగులో ఏ సినిమా చేయలేదు. తెలుగునాట కూడా మణిరత్నంకు చాలా మంది అభిమాను లున్నారు. మణిరత్నంతో సినిమాకు మహేశ్ చాలా కాలంగా ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, ఎందుకో కార్యరూపం ధరించలేదు. ‘కడలి’ తర్వాత మణిరత్నం ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడీ సినిమా పట్టాల మీదకెక్కు తోంది. దాంతో, మహేశ్ ఈ సినిమా చేయడం లేదంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు తప్పని తేలింది. ఇందులో ఓ పాకిస్తానీ నటి కూడా కీలకపాత్ర పోషించనున్నారట. హాలీవుడ్ చిత్రం ‘బోర్న్ ఐడెంటిటీ’ తరహాలో ఇది స్పై థ్రిల్లర్ అని చెన్నై వర్గాల కథనం. రెహమాన్ దీనికి స్వరాలందించనున్నారట. రవివర్మన్ ఛాయాగ్రాహకుడు.