దర్శకుడిగా మారిన ఎడిటర్​.. తుపాకీతో నిఖిల్​ యాక్షన్​ | Nikhil Weapon Training For Editor Garry BH Spy Thriller Movie | Sakshi
Sakshi News home page

Nikhil: దర్శకుడిగా మారిన ఎడిటర్​.. తుపాకీతో నిఖిల్​ యాక్షన్​

Published Tue, Feb 22 2022 8:52 AM | Last Updated on Tue, Feb 22 2022 9:00 AM

Nikhil Weapon Training For Editor Garry BH Spy Thriller Movie - Sakshi

ప్రత్యర్థులపై పోరాటం చేసేందుకు ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్‌. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్‌’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా చేసిన గ్యారీ బీహెచ్‌ దర్శకుడిగా మారి నిఖిల్‌ హీరోగా ఓ స్పై థ్రిల్లర్‌ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిఖిల్‌ గూడఛారి పాత్ర చేస్తున్నారు. కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమా తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసింది. 

మలి షెడ్యూల్‌ వచ్చే నెలలో మనాలీలో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్‌ కోసమే నిఖిల్‌ తుపాకీతో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా తెలిపారు. ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement